ఆర్థిక మంత్రిత్వ శాఖ

జిఎస్‌టి న‌ష్ట‌ప‌రిహారంగా ప్ర‌త్యేక రుణ గ‌వాక్షం కింద 16 రాష్ట్రాల‌కు తొలి వాయిదాగా రూ. 6,000 కోట్ల‌ రుణంగా బ‌దిలీ చేసిన కేంద్ర ప్ర‌భుత్వం

Posted On: 23 OCT 2020 6:42PM by PIB Hyderabad

ప‌్ర‌స్తుత సంవ‌త్స‌రం -2020-2021 కాలంలో జిఎస్‌టి వ‌సూలులో లోటు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు భార‌త ప్ర‌భుత్వం ప్ర‌త్యేక రుణ గ‌వాక్షాన్ని సృష్టించింది. విత్త మంత్రిత్వ శాఖ స‌మ‌న్వ‌యంతో బ్యాక్ టు బ్యాక్ రుణాలు తీసుకునేందుకు 21 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ప్ర‌త్యేక గ‌వాక్ష ప్ర‌త్యామ్నాయాన్ని ఎంచుకున్నాయి. 
ఇందులో ఐదు రాష్ట్రాల‌లో జిఎస్‌టి న‌ష్ట‌ప‌రిహారం కార‌ణంగా ఎటువంటి లోటు ఏర్ప‌డ‌లేదు. నేడు, కేంద్ర ప్ర‌భుత్వం రూ.6,000 కోట్ల‌ను రుణంగా తీసుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌‌, అస్సాం, బీహార్‌, గోవా, గుజ‌రాత్‌, హ‌ర్యానా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర, మేఘాల‌య‌, ఒడిషా, త‌మిళ‌నాడు, త్రిపుర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ స‌హా 16 రాష్ట్రాల‌కు, రెండు కేంద్ర‌పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జ‌మ్ము,కాశ్మీర్‌ల‌కు బ‌దిలీ చేసింది. 
ఈ రుణంపై 5.19 శాతం వ‌డ్డీ ఉంటుంది. రాష్ట్రాల‌కు రూ.6,000 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌తివారం విడుద‌ల చేయాల‌ని నిశ్చయించారు. రుణ‌ క్ర‌మం 3 నుంచి 5 ఏళ్లు వ‌ర‌కు ఉంటుంద‌ని భావిస్తున్నారు.  

***


 



(Release ID: 1667125) Visitor Counter : 252