కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
అరుణాచల్ ప్రదేశ్‌కు ఇఎస్ ఐ పథకం విస్తరణ
Posted On:
23 OCT 2020 3:21PM by PIB Hyderabad
ఇఎస్ ఐ పథకం కింద మరింత మంది ఉద్యోగులను తీసుకురావాలన్న భారత ప్రభుత్వ నిరంతర కృషిలో భాగంగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఇఎస్ ఐ) పథకాన్ని అరుణాచల్ ప్రదేశ్‌కు తొలిసారి విస్తరించింది. ఇది నవంబర్ 1, 2020 నుంచి అమలులోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇఎస్ ఐ పథకం కింద పాపుమ్‌పరే జిల్లా అధికారులను ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయవలసిందిగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పది అంతకన్నా ఎక్కువమంది వ్యక్తులను ఉద్యోగులుగా కలిగి ఉన్న పాపుమ్‌పరే జిల్లాలోని అన్ని పరిశ్రమలూ ఇఎస్ ఐ చట్టం, 1948 కింద పథకం పరిధిలోకి రావడానికి అర్హులు అవుతారు. ఇఎస్ ఐ పథకం కింద ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సౌకర్యాన్ని డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.ఇఎస్ ఐసి. ఇన్‌లోనూ, కేంద్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రిత్వ శాఖ శ్రమ సువిధా పోర్టల్ లో ఇచ్చారు. ఇఎస్ై చట్టం కింద నమోదు చేసుకోవడానికి ఎటువంటి పత్రాలను సమర్పించనవసరం లేదు. ఈ పరిశ్రమలలో పని చేస్తున్న ఉద్యోగులు నెలకు రూ. 21,000 వరకు (దివ్యాంగులకు రూ. 25,000) ఆర్జిస్తుంటే ఈ పథకం కింద వారు అర్హులు అవుతారు.
ఈ పరిధిలోకి వచ్చిన ఉద్యోగులు, వారిపై ఆధారపడినవారు కాష్‌లెస్ వైద్య సంరక్షణ సేవలు, సిక్‌నెస్ బెనిఫిట్ (అనారోగ్యం పాలైనప్పుడు), ప్రసూతి సమయంలో, పనిలో గాయపడినప్పుడు, పనిలో గాయపడి మరణించినప్పుడు ఆధారపడిన వారికి ప్రయోజనం, నిరోద్యగ సమయంలో లబ్ధి పొందేందుకు అర్హులు అవుతారు. ఇటానగర్‌లో ఇటీవలే ప్రారంభించిన నూతన డిస్పెన్సరీ కమ్ బ్రాంచ్ ఆఫీసు (డిసిబిఒ) ద్వారా వైద్య సంరక్షణకు ఏర్పాట్లను చేస్తున్నారు.
భారతదేశంలో ఇఎస్ ఐ పథకం
ది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒక నవీన్ సామాజిక భద్రతా సంస్థ. ఇది ఉద్యోగులు గాయపడినప్పుడు, అనారోగ్యం పాలైనప్పుడు, మరణించిన, తదితర సందర్భాలలో నగదు సహాయం వంటి సమగ్ర సామాజిక భద్రతా ప్రయోజనాలను, వైద్య సంరక్షణను అందిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం కింద 3.49 కోట్ల ఉద్యోగ కుటుంబ యూనిట్లలోని 13.56 కోట్లమంది లబ్ధిదారులకు సాటిలేని నగదు ప్రయోజనాలను, సరసమైన వైద్య సంరక్షణను అందిస్తున్నారు. నేడు దాని మౌలిక సదుపాయాలు 1520 డిస్పెన్సరీలు (మొబైల్ డిస్పెన్సరీలు సహా), 307 ఐఎస్ ఎం యూనిట్లు, 159 ఇఎస్ ఐ ఆసుపత్రులు, 793 బ్రాంచి/ పఏ ఆఫీసులు, 64 ప్రాంతీయ, ఉప ప్రాంతీయ కార్యాలయాలుగా విస్తరించాయి. నేడు లక్ష ద్వీప్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 568 జిల్లాలలో ఇఎస్ ఐ పథకాన్ని అమలు చేస్తున్నారు.
వివిధ ప్రయోజనాలే కాకుండా, ఇఎస్ ఐ పథకం పరిధిలోకి వచ్చిన ఉద్యోగులు నిరుద్యోగ భృతికి అర్హులవుతారు. ప్రస్తుతం అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన (ఎబివికెవై), రాజీవ్ గాంధీ శ్రామిక్ కళ్యాణ్ యోజన (ఆర్‌జిఎస్‌కెవై) అన్న రెండు నిరుద్యోగ భృతి పథకాలు అమలులో ఉన్నాయి.
***
(Release ID: 1667048)
Visitor Counter : 251