జల శక్తి మంత్రిత్వ శాఖ
త్రిపురకు సంబంధించి జల్ జీవన్ మిషన్ అమలుపై మధ్యంతర సమీక్ష
Posted On:
22 OCT 2020 4:36PM by PIB Hyderabad
జలశక్తి మంత్రిత్వశాఖకు చెందిన తాగునీరు ,పారిశుధ్య విభాగానికి చెందిన నేషనల్ జల్ జీవన్ మిషన్ , కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమమైన జల్‌జీవన్ మిషన్ కింద 2024 నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి కనెక్షన్ అందించే లక్ష్యాన్ని సాధించేందుకు ఈ పథకం సాధించిన ప్రగతిపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సమీక్ష నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా వీడియో కాన్ఫరెన్సుద్వారా వార్షిక మధ్యంతర సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ఆవాసాలకు కుళాయి కనెక్షన్ అమర్చడానికి సంబంధఙంచి సాధించిన పురోగతిని, జెఎంఎం కింద సేవలు సార్వత్రికంగా అందుబాటులోకి తీసుకురావడానికి సంబంధించి సంస్థాగత యంత్రాంగానికి సంబంధించిన వివరాలను రాష్ట్రాలు, కేందద్రపాలిత ప్రాంతాలు అందిస్తున్నాయి.
ఈరోజు త్రిపుర నేషనల్ జల్ జీవన్ మిషన్‌కు తన మధ్యంతర ప్రగతి నివేదికను సమర్పించింది. త్రిపురలో సుమారు 8.01 గృహాలున్నాయి. ఇందులో 1.16 లక్షలు (14శాతం) ఇళ్లకు కుళాయి కనెక్షన్ ఉంఇ. 2023 నాటికి రాష్ట్రం అన్ని ఇళ్లకూ ట్యాప్ కనెక్షన్ అందించాల్సి ఉంది.
రాష్ట్రంలో మంచినీటి సరఫరాలకు మంచి మౌలిక సదుపాయాలు ఉ న్నాయి. 1178 గ్రామాలన్నింటిలోనూ మంచినీటి పథకాలు ఉన్నాయి. 2020-21 నాటికి 3.20 లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వాలన్నది రాష్ట్ర లక్ష్యం. ఇప్పటివరకూ 44,000 కనెక్షన్లు ఇచ్చారు. నవంబర్ నుంచి నెలకు 50,000 కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నది. అంటే రోజుకు 1500 కుళాయి కనెక్షన్లు. రాష్ట్రం 2020-21 సంవత్సరంలొ 277 హర్‌ఘర్ జల్ గ్రామాలు, 12 హర్ ఘర్ జల్ బ్లాకులు సాధించాలని నిర్ణయించింది.
త్రిపుర రాష్ట్రప్రభుత్వం 1178 గ్రామాలన్నింటిలోనూ గ్రామ మంచినీటి, పారిశుధ్య కమిటీలను ఏర్పాటు చేసింది. 250 గ్రామాలు జల్ జీవన్ మిషన్ కార్యక్రమాల అమలుకు గ్రామ కార్యాచరణ ప్రణాళికలను పూర్తిచేశాయి. ఇందులో మూల జనవనరులను బలోపేతం చేయడం, మంచినీటి సరఫరా మౌలిక సదుపాయాలు, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్, కార్యకలాపాలు, నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు కూడా ఉన్నాయి.
నీటివనరుల వ్యవస్థల నిర్వహణ, ఇందుకు సంబంధించిన కార్యక్రమాల ప్రణాళిక అమలు విషయంలొ స్థానిక ప్రజలకు అండగా ఉండడానికి స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జిఒలు, మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
గ్రామస్థాయిలో శిక్షణ పొందిన మానవ వనరులు సృష్టించేందుకు గ్రామపంచాయతి నిర్వాహకులకు, ఇతర స్టేక్ హోల్డర్లకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాల్సిందిగా , గ్రామాలలో నైపుణ్‌యాభివృద్ధి శిక్షణ ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రానికి సూచించడం జరిగింది.ఇది జలవనరుల సరఫరా వ్యవస్థ కార్యకలాపాలు, నిర్వహణ అమలుకు ఎంతగానో ఉపయుక్తంగా ఉండనుంది.
2020 అక్టోబర్ 2 వ తేదీ న ప్రారంభించిన వందరోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా,ప్రతి అంగన్ వాడీ కేంద్రానికీ, పాఠశాలకు, ఆశ్రమశాల(గిరిజన గురుకులాలకు) పైపుద్వారా నీటి సరఫరా జరిగేట్టు చూడాల్సిందిగా సంబంధిత విభాగాలకు రాష్ట్రం అవగాహన కల్పిస్తొంది.
2020-21లో త్రిపుర రాష్ట్ర ప్రారంభ నిల్వ రూ136.46 కోట్లు. దీనికి 156.61 కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్ అమలుకు కేటాయించారు. 2020-21 లో 17.74 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఫలితంగా రాష్ట్రంవద్ద మొత్తం అందుబాటులో ఉన్న నిధులు రూ 154.20 కోట్లు. తొలి విడుదల రెండో వాయిదాను పొందడానికి రాష్ట్రం తన నిధులు ఖర్చుచేయడాన్ని వేగవంతం చేయవలసి ఉంది. త్రిపురకు 15 వ ఫైనాన్స్ కమిషన్ , గ్రామీణ స్థానిక సం్థలకు 38 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో 50 శాతం నిధులు మంచినీటి సరఫరా, పారిశుధ్యానికి వినియోగించవచ్చు. అంటే మంచినీటి సరఫరా,
గ్రేవాటర్ ట్రీట్‌మెంట్, పునర్వినియోగం, మరీ ముఖ్యంగా మంచినీటి సరఫరాకు సంబంధించి దీర్ఘకాలిక కార్యకలాపాలు, నిర్వహణకు వీటిని వాడవచ్చు.
త్రిపురలో సమృద్ధిగా వర్షపాతం ఉంది. అందువల్ల నీటి లభ్యత సమస్య కానే కాదు. గ్రామాలలో నూరుశాతం పైపుద్వారా నీటి సరఫరా జరిగితే గ్రామీణ ఆవాసాలన్నింటికీ నమ్మకమైన పరిశుభ్రమైన తాగునీటి సరఫరా జరగుతుంది. ఇది ప్రజల సులభతర జీవనానికి, వారి జీవన ప్రమాణాల పెంపునకు దోహదపడుతుంది.
***
(Release ID: 1666841)
Visitor Counter : 144