శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

దేశీయంగా సూపర్ కంప్యూటర్ల తయారీ లక్ష్యం దిశలో ఇండియా సత్వర ప్రగతి

జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ ఎస్ ఎం) ద్వారా దేశంలో ఉన్నతస్థాయి మదింపునకు ప్రోత్సాహం

Posted On: 21 OCT 2020 5:14PM by PIB Hyderabad

ఇండియా సూపర్ కంప్యూటర్ సౌకర్యాలను సత్వరం విస్తరిస్తోంది.  దేశంలో సొంతంగా  సూపర్ కంప్యూటర్ల తయారీ సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసుకుంటోంది.
చమురు అన్వేషణ, వరదల సూచన, జన్యు సంబంధ అంశాలు మరియు ఔషధాల ఆవిష్కారం వంటి రంగాలలో  విద్యావేత్తలు, పరిశోధకులు, ఎం ఎస్ ఎం ఈలు మరియు అంకుర సంస్థల నుంచి లెక్కగట్టడానికి సంబంధించి వస్తున్న డిమాండ్లను తీర్చడానికి  జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ ఎస్ ఎం) వివిధ దశల్లో పనిచేయడం ద్వారా దేశంలో శీఘ్రగతిలో ఉన్నతస్థాయి లెక్కింపునకు సంబంధించిన పనులను ప్రోత్సహిస్తోంది.  

ఎన్ ఎస్ ఎం మొదటి దశలో ఏర్పాటు చేయతలపెట్టిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది.   రెండవ దశకు సంబంధించిన ఏర్పాట్లలో చాలా భాగం పూర్తయ్యాయి.  దేశంలో సూపర్ కంప్యూటర్ల వ్యవస్థ త్వరలోనే 16 పెటాఫ్లాప్స్ (ఎఫ్ పి) స్థాయికి చేరుకుంటుంది.  మూడవ దశ 2021 జనవరిలో మొదలై  మదింపు వేగం 45 పెటాఫ్లాప్స్ స్థాయికి చేరుకుంటుంది.  

ఎన్ ఎస్ ఎంకు కేంద్ర ఎలెక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు శాస్త్ర సాంకేతిక విభాగం (డి ఎస్ టి) సంయుక్తంగా సారథ్యం వహిస్తుండగా  పూణేకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్ (సి-డాక్) మరియు బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అమలు చేస్తున్నాయి.  
దేశీయంగా కూర్చిన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పరం శివను ఐ ఐ టి (బి హెచ్ యు)లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరువాత వరుసగా పరం శక్తిని ఐ ఐ టి - ఖరగ్ పూర్ లో మరియు  పరమ బ్రహ్మను ఐ ఐ ఎస్ ఈ ఆర్, పూణేలో ఏర్పాటు చేశారు. 

    ఆ తరువాత సూపర్ కంప్యూటర్ వ్యవస్థలను మరో రెండు సంస్థలలో ఏర్పాటు చేయడం జరిగింది.  మొదటి దశలో ఒక సూపర్ కంప్యూటర్ ఏర్పాటు ద్వారా  మదింపు వేగాన్ని మరింత పెంచి 6.6 పి ఎఫ్ స్థాయికి చేరుస్తారు.  రెండవ దశలో 2021 ఏప్రిల్ నాటికి
మరో 8 సంస్థలకు సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాలను సమకూర్చడం ద్వారా మదింపు సామర్ధ్యం 10 పి ఎఫ్ స్థాయికి పెరుగుతుంది.  ఇండియాలో సూపర్ కంప్యూటర్ల కూర్పు మరియు తయారీకోసం దేశంలో  14 అగ్రగామి/ఉత్తమ సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది.  వాటిలో ఐ ఐ టిలు,  ఎన్ ఐ టిలు,  జాతీయ ప్రయోగశాలలు మరియు ఐ ఐ ఎస్ ఈ ఆర్ వంటి సంస్థలు ఉన్నాయి.  రెండవ దశ వ్యవస్థల స్థాపన 2021 ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. 

 

 మూడవ దశ పనులు 2021లో మొదలవుతాయి.   దీనిలో  మూడు 3 పి ఎఫ్ స్థాయి సిస్టంలు మరియు 20 పి ఎఫ్ స్థాయి సిస్టంను జాతీయ సదుపాయంగా ఏర్పాటు చేస్తారు.  ఈ మూడు దశల పనులు పూర్తయితే దాదాపు 75 సంస్థలకు ఉన్నత స్థాయి కంప్యూటింగ్ (హెచ్ పి సి)  వ్యవస్థలు ఏర్పాటవుతాయి.  అవి  వేలాది మందికి పైగా క్రియాశీల పరిశోధకులు,  విద్యావేత్తలు  సూపర్ కంప్యూటింగ్ సిస్టంలకు వెన్నెముక వంటి జాతీయ జ్ఞాన వ్యవస్థ ద్వారా  పని చేస్తారు.  

హెచ్ పి సి మరియు కృత్రిమ మేధ (ఏ ఐ)  ఒకేచోట కూడాయి.  ఈ రెండింటి కూటమితో 100 ఏ ఐ  పి ఎఫ్  కృత్రిమ మీద సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థను సృష్టించి సి-డాక్ లో నెలకొల్పుతున్నారు.  ఇది ఏ ఐకి సంబంధించిన ఎంతటి పని భారాన్నయినా అత్యంత వేగంగా నిర్వహించగలదు.  

జాతీయ మిషన్ భావితరం సూపర్ కంప్యూటర్ నిపుణుల తయారీకి కూడా చర్యలు తీసుకుంది.  ఇప్పటివరకు 2400 మంది శ్రమ శక్తిని మరియు ఆచార్యగణాన్ని తయారు చేసింది.  

 

దేశీయ సామర్థ్యం
ఎన్ ఎస్ ఎం అందించిన శక్తి సామర్ధ్యాలతో పాటు పరిశ్రమల నుంచి పొందిన సమన్వయంతో  దేశంలోని పరిశోధనా సంస్థల వ్యవస్థ ఇండియాలోనే  సూపర్ కంప్యూటర్లకు అవసరమైన విడి భాగాలను అత్యధిక సంఖ్యలో తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నాయి.  మొదటి దశలో 30 శాతం విడిభాగాలను తయారు చేయగా రెండవ దశలో అది 40 శాతానికి పెరిగింది.  దేశీయంగా సర్వర్ బోర్డు,  ఇంటర్ కనెక్ట్ ప్రాసెసర్, సిస్టం సాఫ్టువేర్ లైబ్రరీలు, స్టోరేజి మరియు  హెచ్ పి సి - ఏ ఐ కలసిన యాక్సిలరేటర్ తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  
సి -డాక్  రూపొందించిన సాఫ్ట్ వేర్ సహాయంతో ఇండియాలో దేశీయ సర్వర్ (రుద్ర) రూపొందించారు. ఇది అన్ని ప్రభుత్వాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల అవసరాలు తీరుస్తుంది.  ఇండియాలో ఒక సర్వర్ వ్యవస్థను తయారు చేయడం ఇదే మొదటిసారి.  
పనుల వేగం ఇలాగే కొనసాగితే మనం తొందరలోనే దేశీయంగా సూపర్ కంప్యూటర్ల తయారీకి అవసరమైన మదర్ బోర్డులు మరియు ఉప వ్యవస్థలను ఇండియాలోనే తయారు చేయగలమని నిపుణులు తెలిపారు.  
ఆ విధంగా ఇండియాలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసి,  చాలా భాగం విడి భాగాలను తయారు చేసి కూర్చి సిద్ధం చేసిన  సిస్టంలను మూడవ దశలో భాగమైన  ఐ ఐ టి - ముంబై ,  ఐ ఐ టి -చెన్నై మరియు  ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్,  పూణేలోని సి-డాక్ వంటి చోట్ల  నెలకొల్పుతారు.  ఇది  సూపర్ కంప్యూటర్ల రూపకల్పన, తయారీ రంగంలో ఇండియా స్వయంసమృద్ధిని సాధించడానికి తోడ్పడుతుంది.  

***


(Release ID: 1666795) Visitor Counter : 228