జల శక్తి మంత్రిత్వ శాఖ

'ప్రధాన మంత్రి కృషి సంచా‌యి యోజన' కింద చేప‌ట్టిన వివిధ ప్రాజెక్టుల‌ విభాగాల్ని జియో ట్యాగింగ్ చేసేందుకు మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించిన జ‌ల్ ‌శ‌క్తి శాఖ స‌హాయ మంత్రి

Posted On: 21 OCT 2020 4:52PM by PIB Hyderabad

కేంద్ర జ‌ల్ శ‌క్తి మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని డ‌బ్ల్యుఆర్‌, ఆర్‌డీ అండ్ జీఆర్ డిపార్ట్‌మెంట్లలో 'ప్రధాన మంత్రి కృషి సంచా‌యి యోజన- యాక్సిల‌రేటెడ్ ఇరిగేష‌న్ బెనిఫిట్ ప్రోగ్రాం'(పీఎంకేఎస్‌వై-ఏఐబీపీ) కింద చేప‌డుతున్న వివిధ
ప్రాజెక్టుల‌లోని ఆయా విభాగాల జియో ట్యాగింగ్‌న‌కు ప్ర‌భుత్వం కొత్త మొబైల్ అప్లికేష‌న్ అందుబాటులోకి తె‌చ్చింది. కేంద్ర జల్ శక్తి, సామాజిక న్యాయం, సాధికారత శాఖల స‌హాయ మంత్రి శ్రీ‌ రత్తన్ లాల్ కటారియా ఈ మొబైల్ అప్లికేష‌న్‌ను ప్రారంభించారు. ఈ యాప్ ప్రారంభం సంద‌ర్భంగా పంచ‌కుల నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ.. 2016-17లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలతో సంప్రదించి దేశంలో మొత్తంగా తొంభై తొమ్మిది (99) ప్ర‌ధాన‌/ మ‌ధ్య త‌ర‌హా నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌కు (ఎంఎంఐ) ప్రాధాన్య‌త‌నిస్తూ గుర్తించింద‌న్నారు. వీటిని పీఎంకేఎస్‌వై - ఏఐబీపీ కింది వివిధ‌ దశల్లో త‌గిన విధంగా పూర్తి చేయాల‌ని నిశ్చయించార‌న్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల దేశ వ్యాప్తంగా 34.64 లక్షల హెక్టార్ల సాగు భూమికి అదనంగా నీటి పారుదల సంభావ్యత ఏర్పడ‌నుంది. దీని వల్ల రక్షిత నీటిపారుదల లభిస్తుంది మరియు గ్రామీణ శ్రేయస్సును ఇది ద‌గ్గ‌ర చేస్తుంద‌న్నారు. ఇప్పటివరకు 99 ప్రాజెక్టులలో 44 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. లక్ష్యంగా ఉన్న దాదాపు 21.33 లక్షల హెక్టార్ల‌కు నీటిపారుదల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. మిగ‌తా ప్రాజెక్టులు కూడా వివిధ ద‌శ‌ల్లో పూర్తికావ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయా ప్రాజెక్టు పనుల వేగం మరియు ప్రాజెక్టుల వాస్తవ స్థితి తెలుసుకోవడానికి మంత్రిత్వ శాఖ భాస్క‌రాచార్య

 


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ & జియో ఇన్ఫర్మేటిక్స్ (బిసాగ్-ఎన్) సహాయంతో ఈ మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా సాధ్యమైన చోట అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తాజా పద్ధతులు అవలంభించబడ్డాయ‌ని మంత్రి తెలిపారు.
వీటి ద్వారా ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షణతో పాటుగా వాటి ప‌నులలోని పురోగతి మరియు అమలులో ఉన్న అడ్డంకులను తెలుసుకోవ‌డానికి వీలు ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఈ విషయ‌మై ప్రాజెక్టు పనుల్లో పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి గాను ఆన్‌లైన్ 'మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్' (ఎంఐఎస్‌) అభివృద్ధి చేయబడింద‌ని తెలిపారు. ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల ఆయ‌క‌ట్టు ప్రాంతంలోని సాగుభూమిని అంచనా వేయడానికి రిమోట్ సెన్సింగ్ పద్ధతులు కూడా ఉపయోగించబడుతున్నాయి. ఈ మొబైల్ యాప్‌‌ ఉప‌యోగించి ప్రాజెక్టు పర్యవేక్షణ బృందం / ప్రాజెక్ట్ అధికారులు ప‌నులు జ‌రుగుతున్న స్థ‌లం, కాలువ రకం/ నిర్మాణం రకం, పూర్తి స్థితి మొదలైన ఇతర వివరాలతో పాటుగా ప్రాజెక్ట్ భాగం యొక్క చిత్రాన్ని సంగ్రహించడానికి వీలుప‌డుతుంది. సంగ్రహించిన సమాచారాన్ని వినియోగ‌దారు ఈ ప్రయోజనం కోసం అభివృద్ధి చేసిన జీఐఎస్ పోర్ట‌ల్‌లో జియో-ట్యాగింగ్ కోసం సమర్పించవచ్చని ఆయన అన్నారు. ఆయా

 


ప్రాంతంలో నెట్‌వర్క్ లభ్యతను బట్టి మొబైల్ అప్లికేషన్‌ను ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వ‌హించ‌వ‌చ్చు. దేశంలో “రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి” అనే ప్ర‌ధాన మంత్రి దృష్టికోణానికి అనుగుణంగా కేంద్ర జల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలలో ఈ యాప్‌ ప్రారంభం ఒక గొప్ప ముంద‌డుగు అని మంత్రి తెలిపారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ మ‌రియు ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ మరియు భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ & జియో ఇన్ఫర్మేటిక్స్‌కు (బిసాగ్-ఎన్) చెందిన అధికారులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వీసీ విధానంలో
ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

***
 



(Release ID: 1666633) Visitor Counter : 248