వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం
Posted On:
21 OCT 2020 5:33PM by PIB Hyderabad
గత ఏడాది అక్టోబర్ 18వ తేదీతో పోలిస్తే ఆగస్టు 2020 చివరి నుంచి ఉల్లిపాయ చిల్లర ధర చెప్పుకోదగిన విధంగా పెరిగింది. గత 10 రోజులలో ఉల్లి ధరలు కిలోకి రూ. 11.56 చొప్పున పెరిగి, దేశవ్యాప్తంగా కిలో ఉల్లి చిల్లర ధరను రూ. 51.95కు తీసుకువెళ్ళింది. ఇది గత ఏడాది ధర కిలోకు రూ. 46.33 కన్నా 12.13% పెరుగుదల.
ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం 14.09.2020న ప్రకటన చేసి, ముందస్తు చర్యలు తీసుకుంది. తద్వారా ఖరీఫ్ ఉల్లి మార్కెట్లో రాకముందు దేశీయ వినియోగదారులకు సరసమైన ధరలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. చిల్లర ధరల పెరుగుదల రేటును కొంతమేరకు అదుపు చేయగలిగినప్పటికీ, ఇటీవలి కాలంలో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో పడ్డ భారీ వర్షాలు ఖరీఫ్ పంటకు, నిల్వ చేసిన ఉల్లిపాయలకు, విత్తనాల నర్సరీలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. వాతావరణ ప్రభావం ఫలితంగా ఉల్లి ధరలు పెరిగిపోవడానికి దోహదం చేశాయి.
కాగా, ప్రభుత్వం రబీ-2020 ఉల్లిపంటకు సంబంధించి నిల్వలను చేసింది. ధరలను కిందకు తీసుకురావడానికి, నిల్వలో ఉంచి ఉల్లిపాయలను సెప్టెంబర్, 2020 నుంచి ఒక క్రమ పద్ధతిలో ప్రధాన మర్కెట్లకు, సఫల్, కేంద్రీయ భండార్, ఎన్ సిసిఎఫ్‌తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తోంది. రానున్న రోజుల్లో మరింత చేయనున్నారు.
ఉల్లిని దిగుమతులను సులభతరం చేసేందుకు ఫ్యూమిగేషన్, ప్లాంట్ క్వారెంటైన్ ఆర్డర్, 2003 కింద అదనంగా ఫైటో శానిటరీ సర్టిఫికెట్ ప్రకటించాలన్న షరతులను 21.10.2020న సడలించి, డిసెంబర్ 15, 2020 వరకు దిగుమతులు చేసుకునేందుకు అనుమతిచ్చింది. సంబంధిత దేశాలలో ఉన్న భారతీయ హైకమిషన్లకు అయా దేశాలలో ఉన్న వ్యాపారులను కాంటాక్ట్ చేయడం ద్వారా దేశానికి ఉల్లిపాయలను భారీగా దిగుమతులను చేసుకునేందుకు మార్గం సుగమం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి ఫ్యూమిగేషన్, పిఎస్‌సిపై ప్రబావం గురించి ఎటువంటి ఎండార్్సమెంట్ లేకుండా భారతీయ రేవులకు దిగుమతై వచ్చిన ఉల్లిపాయలను, దిగుమతి చేసుకున్న వ్యక్తి గుర్తింపునిచ్చిన ట్రీట్‌మెంట్ ఇచ్చే వ్యక్తి ద్వారా ఫ్యూమిగేట్ చేయించాలి. ఒకవేళ ఫ్యూమిగేషన్‌లో స్టెమ్ అండ్ బల్బ్స్ నెమటోడ్ లేదా ఆనియన్ మాగట్ ను గుర్తిస్తే , వాటిని తీసివేసి, ఆ సరుకును అదనపు ఇనస్పెక్షన్ ఫీజు లేకుండా విడుదల చేస్తారు. ఆ ఉల్లిపాయలు వినియోగం కోసమే తప్ప ఉత్పత్తి కోసం కాదని దిగుమతిదారుల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటారు. వినియోగానికి ఉద్దేశించిన ఉల్లిపాయల పిక్యూ ఆర్డర్, 2003 కింద దిగుమతి షరతులను పాటించనందున నాలుగు అదనపు పరీక్షల ఫీజు నుంచి మినహాయిస్తారు.
ప్రస్తుతం సుమారు 37 లక్షల టన్నుల ఖరీఫ్ పంట త్వరలోనే మార్కెట్లలో ప్రవేశించనుంది. ఇది ధరల పెరుగుదల నుంచి కొంత ఊరటను కల్పిస్తుంది.
***
(Release ID: 1666627)
Visitor Counter : 189