మంత్రిమండలి

భార‌త‌దేశానికి చెందిన ఐసిఎఐ కి, మ‌లేషియా కు చెందిన‌ ఎమ్ఐసిపిఎ కి మ‌ధ్య ప‌ర‌స్ప‌ర గుర్తింపు ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 21 OCT 2020 3:21PM by PIB Hyderabad

ఇన్స్ టిట్యూట్ ఆఫ్ చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్‌ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కు, మ‌లేషియ‌న్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ స‌ర్టిఫైడ్ ప‌బ్లిక్ అకౌంటెంట్స్ (ఎమ్ఐసిపిఎ)  కు మ‌ధ్య ప‌ర‌స్ప‌ర గుర్తింపు ఒప్పందానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.  ఈ ఒప్పందం తో రెండు సంస్థలలో దేనిలోనయినా యోగ్య చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ స‌భ్యులకు వారి ప్రస్తుత అకౌంటెన్సీ యోగ్యత తాలూకు సముచిత క్రెడిట్ ల ఆధారంగా రెండో ఇన్స్ టిట్యూట్ లో ప్రవేశం తీసుకొనేందుకు అవకాశం లభిస్తుంది.  

అమ‌లు వ్యూహం - ల‌క్ష్యాలు :

ఐసిఎఐ, ఎమ్ఐసిపిఎ లు ఒకదాని యోగ్యత కు మరొకటి  గుర్తింపు ను ఇచ్చే ఉద్దేశ్యం తో పరస్పరం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి.  దీని ద్వారా అవ‌త‌లి ప‌క్షం సంస్థ‌ కు చెందిన అర్హులైన స‌భ్యులు త‌మకు ఉప‌యుక్త‌మ‌నుకున్న సంస్థ‌ లో స‌భ్య‌త్వాన్ని పొందేందుకు వీలు ఉంటుంది.  ప్ర‌తిపాదిత ఎమ్ఒయు విద్య ను పూర్తి చేసుకొని రెండు ప‌క్షాల స‌భ్య‌త్వ అవ‌స‌రాలకు అనుగుణంగా ఇరు సంస్థ‌ల స‌మాచారాన్ని ఒక‌దానికి మ‌రొక‌టి అందించుకొనేందుకు అంగీకారం తెలియ‌జేస్తాయి.  

ప్ర‌ధాన ప్ర‌భావం:

ఆసియా ప‌సిఫిక్ ప్రాంతం లోని సంస్థ‌ల తో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ఏర్ప‌ర‌చుకోవాల‌ని ఐసిఎఐ కోరుకుంటోంది.  ఈ కార‌ణంగా ఎమ్ఐసిపిఎ తో ఒక ఎంఒయు పై సంత‌కాలు చేయాల‌ని ఐసిఎఐ సంక‌ల్పించింది.  ఈ రెండు అకౌంటెన్సీ సంస్థ‌లు ఈ వృత్తి లో ఎదుర‌వుతున్న కొత్త స‌వాళ్ళ‌ను ప‌రిష్క‌రించ‌డం లో నాయ‌క‌త్వ పాత్ర‌ ను పోషించేందుకు ఒక అవ‌కాశాన్ని చేజిక్కించుకోనున్నాయి.  ఈ రెండు నియంత్రణాధికార సంస్థ‌ల మ‌ధ్య ఒక లాంఛ‌న పూర్వ‌క స‌ర్దుబాటు సంబంధిత స‌ముదాయం లో ఒక విస్తృత‌మైన స్వీకృతి కి బాట ను వేసి, మ‌రిన్ని వృత్తిప‌ర‌మైన అవ‌కాశాల‌ను అందించ‌గ‌ల‌దు.

పూర్వరంగం:

భార‌త‌దేశం లో చార్ట‌ర్డ్ అకౌంటెంట్ల వృత్తిని క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డం కోసం ‘‘చార్ట‌ర్డ్ అకౌంటెంట్ల చ‌ట్టం, 1949’’ ప‌రిధి లో ఏర్పాటు చేసిన ఒక చ‌ట్ట‌బ‌ద్ధ సంస్థే ఇన్స్ టిట్యూట్ ఆఫ్ చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ).  ఇక మ‌లేషియ‌న్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ స‌ర్టిఫైడ్ ప‌బ్లిక్ అకౌంటెంట్స్ (ఎమ్ఐసిపిఎ ) ను మ‌లేషియా లో  కంపెనీల చ‌ట్టం,1965 ప‌రిధి లో ఒక కంపెనీ గా నెల‌కొల్ప‌డం జ‌రిగింది. 


***



(Release ID: 1666522) Visitor Counter : 201