సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఢిల్లీలోని ఎర్రకోటలో ఆజాద్ హింద్ ప్రభుత్వ 77వ సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్
ఐఎన్ ఎ కురువృద్ధులు నాయక్ లాల్తీ రామ్ జీ, సిపాయి పరమానంద యాదవ్, చంద్ర కుమార్ బోస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Posted On:
21 OCT 2020 2:56PM by PIB Hyderabad
ఆజాద్ హింద్ ప్రభుత్వ 77 సంస్మరణ దినోత్సం సందర్భంగా బుధవారం ఢిల్లీలోని ఎర్రకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పాల్గొన్నారు.
ఆజాద్ హింద ప్రభుత్వం ఏర్పడిన 77వ వార్షికోత్సవ సందర్భంగా సాంస్కృతిక శాఖ మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ దేశానికి చెందిన యువతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వ పటిమని, అత్యున్నత త్యాగాన్ని గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ ప్రయాణాన్ని పూర్తి విశ్వాసంతో, ఉత్సాహంతో, సమర్ధవంతమైన నాయకత్వంతో ముందుకు తీసుకువెడుతున్న ప్రధానమంత్రికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
వచ్చే ఏడాది మన దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుందని, అదే ఏడాది సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి కూడా అని అన్నారు. ఈ రెండు సందర్భాలను నిర్వహించే నోడల్ ఏజెన్సీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అని ఆయన వెల్లడించారు.
ఈ చారిత్రిక ఘటన సంస్మరణ దినోత్సవానికి ఐఎన్ఎ కురువృద్ధులు లలిత్ రాంజీ, సిపాహీ పరమానంద యాదవ్, మేజర్ జనరల్ (రిటైర్్డ) జి.బి. భక్షి, ఐఎన్ ఎ ట్రస్ట్ డైరెక్టర్ -బ్రిగేడర్ చికారా, సుభాష్ చంద్ర బోస్ ముని మనవడు చంద్రకుమార్ బోస్ హాజరయ్యారు.
***
(Release ID: 1666506)
Visitor Counter : 197