రక్షణ మంత్రిత్వ శాఖ
డిఆర్‌డిఒ ప్రొక్యూర్‌మెంట్ మాన్యువల్ 2020ని విడుదల చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Posted On:
20 OCT 2020 4:52PM by PIB Hyderabad
రక్షణ పరిశోధన & అభివృద్ధి (ఆర్ &డి)లో పాలుపంచుకునేందుకు స్టార్టప్ లు సహా, చిన్న మధ్య తరహా పరిశ్రమలను భారతీయ పరిశ్రమలో భాగస్వాములను చేసి ప్రోత్సహించి, ఆత్మనిర్భర్ భారత్ ను సాధించడం కోసం ఉద్దేశించిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (డిఆర్‌డిఒ) నవీన ప్రొక్యూర్‌మెంట్ మాన్యువల్ (సమీకరణ పత్రం) 2020 (పిఎమ్ -2020)ను మంగళవారంనాడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశీయ రక్షణ పరిశ్రమకు నూతన డిఆర్‌డిఒ పత్రం ప్రక్రియలను సరళతరం చేసి, డిజైన్, అభివృద్ధి కార్యకలాపాలలో పాలుపంచుకునే సౌకర్యాన్ని కల్పిస్తుందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసేందుకు పిఎమ్ -2020 తోడ్పడుతుందని ఆయన అన్నారు. సవరించిన పిఎమ్ -2020ని తీసుకురావడంలో దోహదం చేసిన డిఆర్‌డిఒ అధికారులు, రక్షణ మంత్రిత్వ శాఖలోని విత్త విభాగ అధికారులను ఆయన అభినందించారు.
నూతన పిఎమ్ -2020 పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసేందుకు తోడ్పడుతుంది. వివిధ ఆర్ &డి ప్రాజెక్టులలో పరిశ్రమ పాలుపంచుకునేందుకు ఈ పత్రంలో సవరించిన కొన్ని అంశాలు దీర్ఘకాలంలో తోడ్పడతాయి.
ముందస్తుగా సొమ్మును డిపాజిట్ చేసిన వారికి బిడ్ భద్రత ప్రకటన ప్రత్యామ్నాయం, ముందస్తు చెల్లింపుల ప్రారంభ పరిమితి పెంపు, ఒక వేళ తక్కువ బిడ్ చేసిన సంస్థ (ఎల్ 1) వెనక్కి మళ్ళితే ఆ తర్వాత అతి తక్కువగా బిడ్ చేసిన వారికి (ఎల్ 2) ఆర్డర్ ఇవ్వడం అన్నవి నూతన మాన్యువల్‌లో ప్రముఖ అంశాలు. ప్రాజెక్టుల వేగవంతంగా అమలు చేసేందుకు పరిశ్రమలకు ఇది తోడ్పడుతుంది.
ఈ పత్రంలోని మరికొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే, బిడ్ భద్రత, పనితీరు భద్రతకు రూ. 10 లక్షల వరకు మినహాయింపు, మార్కెట్ శక్తుల ద్వారా ధరల నిర్ణయం జరుగుతున్నప్పడు తయారైన వస్తువుల/ సేవల (COTS )పై సంప్రదింపులకు, చర్చలకు తావుండదు.
సేవా కాంట్రాక్టుల పనితీరు భద్రతను, మొత్తం కాంట్రాక్టు విలువకు బదులుగా చెల్లింపుల చట్రంతో అనుసంధానం చేశారు. పరిశ్రమకు తోడ్పడేందుకు, భాగస్వాముల నుంచి దుకాణాలను సేకరించడం,ఉచితంగా అందించిన సామాగ్రికి బ్యాంకు గ్యారంటీకి బదులుగా బీమా కవర్‌ను ఇచ్చిన వాటిని పరిరక్షించడం వంటి సౌకర్యాలను కల్పించారు.
నూతన పిఎమ్ -2020లో అభివృద్ధి కాంట్రాక్టులలో నిర్ణయ యోగ్య నష్టపరిహారం రేటును తగ్గించారు. వేగవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు పంపిణీ కాల కొనసాగింపు ప్రక్రియను సరళతరం చేశారు. పరిశ్రమతో వేగవంతంగా ఒప్పందాలు చేసుకునేందుకు అనేకమైన అంతర్గత విధానాలను మరింతగా సులభతరం చేశారు. డిఆర్‌డిఒకి చెందిన గత ప్రొక్యూర్‌మెంట్ మాన్యువల్‌ను ఆఖరిసారి 2016లో సవరించడం గమనార్హం.
ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఒ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి, రక్షణ విత్త విభాగ కార్యదర్శి శ్రీమతి గార్గి కౌలంద్ సహా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1666201)
Visitor Counter : 279