రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

సిక్కిం ప్రభుత్వంతో ఇఫ్కో జాయింట్ వెంచర్

సిక్కిమ్లోని రాంగ్పోలో సమగ్ర ఆహార శుద్ధీకరణ యూనిట్ల నిర్మాణం ప్రారంభం

సేంద్రీయ అల్లం, పసుపు, పెద్ద ఏలకులు బక్వీట్ శుద్ధీకరణకు ఉద్దేశించిన ప్లాంట్ల నిర్మాణం, వచ్చే అక్టోబర్ నాటికి పూర్తవుతుంది.

Posted On: 20 OCT 2020 3:29PM by PIB Hyderabad
ఇఫ్కో  సేంద్రీయ జాయింట్ వెంచర్, సిఫ్కో (సిక్కిం ఇఫ్కో ఆర్గానిక్స్ లిమిటెడ్) రాంగ్పోలో నిర్మాణ పనులను  నిన్న ప్రారంభించింది. వచ్చే ఏడాదికి నాటికి పనులు పూర్తవుతాయి  తరువాత ఉత్పత్తి ప్రారంభమవుతుంది. రెండు ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మొత్తం నిర్మాణ వ్యయం సుమారు రూ .50 కోట్లు. ఈ ప్లాంట్లకు సిక్కిం ముఖ్యమంత్రి  పవన్ సింగ్ తమంగ్, కేంద్ర వ్యవసాయ మంత్రి  నరేంద్ర సింగ్ తోమర్ సమక్షంలో గత ఏడాది శంకుస్థాపన జరిగింది. ఇవి సిక్కింలో సేంద్రీయ వ్యవసాయానికి మాత్రమే కాకుండా, ఈశాన్య రాష్ట్రాలలోని సేంద్రీయ రైతులకు కూడా మేలు చేస్తాయి. కరోనా మహమ్మారి ఈ ప్రాజెక్టును కొన్ని నెలలు ఆలస్యం చేసింది. సిఫ్కో త్వరలో జర్మనీ, ఇటలీ  ఇతర యూరోపియన్ దేశాలలో తన ఏజెన్సీల ద్వారా తాజా అల్లం వ్యాపారం ప్రారంభిస్తుంది. సిఫ్కో ఉత్పత్తులన్నీ సేంద్రీయ సాగు పద్ధతుల్లో పండించినవే!  అందువల్ల వీటిలో ఎటువంటి హానికర పదార్థాలు ఉండవు. ఇది సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది.  గ్రీన్ హిమాలయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
 
రంగ్పోలోని నిర్మాణ స్థలంలో సంప్రదాయ భూమి పూజతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో  సిక్కిం శాసనసభ స్పీకర్ ఎల్.బి. దాస్,  వ్యవసాయ మంత్రి ,  లోక్ నాథ్ శర్మ , సిక్కిం ఇఫ్కో ఆర్గానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ గుప్తా, ఇఫ్కో ఇతర సీనియర్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు పెంచడంలో ఈ ప్లాంట్లు గొప్ప ముందడుగు అవుతాయి.  2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కావాలని ప్రధానమంత్రి కోరుకుంటున్నారు. ఇందుకోసం రైతుల నుంచే ఉత్పత్తులను నేరుగా సేకరిస్తారు.  సిక్కిం ఇప్పటికే 100% సేంద్రీయ రాష్ట్రంగా గుర్తించబడింది. భారతదేశంలో  ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో వినియోగదారులకు సురక్షితమైన ఆహార సరఫరా గొలుసును అందించడం ఈ జేవీ  లక్ష్యం. ఈ జేవీ మొదట్లో.. అల్లం, పసుపు, పెద్ద ఏలకులు, బక్ వీట్ను శుద్ధీకరిస్తుంది.  భారీ ఎగుమతి సామర్థ్యం కలిగిన సిక్కిం రాష్ట్రంలోని ప్రధాన పంటలు ఇవి. సిఫ్కో ఈ ఉత్పత్తులను దేశంతోపాటు  ప్రపంచంలోని వివిధ మార్కెట్లలో అమ్ముతుంది. ఈ విషయంలో ఇప్పటికే రెండు అవగాహన ఒప్పందాలు కుదిరాయి.  అమెరికాలోని బ్లాసమ్స్ బయోడైనమిక్స్ ఎంఓయూ కుదిరింది. దీని వల్ల ఉత్తర అమెరికా మార్కెట్లలో దాని మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను ఉపయోగించుకోవచ్చు. సెంటార్ డాక్టర్ రుడోల్ఫా స్టీనిరా క్రొయేషియాతో రెండో ఒప్పందం కుదిరింది. దీనివల్ల  యూరోపియన్ యూనియన్, క్రోయేషియాలో సిక్కిం ప్రొడక్టులను అమ్మవచ్చు. 
***


(Release ID: 1666121) Visitor Counter : 143