మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఎన్ ఐటి రూర్కేలా గోల్డెన్ జూబ్లీ భ‌వ‌నాన్ని దృశ్య మాధ్య‌మం ద్వారా ప్రారంభించిన కేంద్ర విద్యా మంత్రి

Posted On: 19 OCT 2020 7:31PM by PIB Hyderabad

ఎన్ ఐటి రూర్కేలా (ఒడిషా)లో నిర్మించిన గోల్డెన్ జూబ్లీ భ‌వ‌నాన్ని కేంద్ర విద్యా మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ నిశంక్ సోమ‌వారంనాడు దృశ్య మాధ్య‌మం (వ‌ర్చువ‌ల్‌) ద్వారా ప్రారంభించారు. విద్యా సంస్థ ఉనికిలోకి వ‌చ్చి యాభై సంవ‌త్స‌రాలు పూర్తి అయిన నేప‌థ్యంలో స్మార‌క చిహ్నంగా ఈ గోల్డెన్ జూబ్లీ భ‌వ‌నాన్ని నిర్మించారు. 
ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, ఎన్ ఐటి రూర్కేలా దేశంలోనే అత్యుత్త‌మ విద్యా సంస్థ‌ని, కొన్ని ద‌శాబ్దాలుగా దేశం కోసం మేథావుల‌ను త‌యారు చేస్తోంద‌ని అన్నారు.  ఆ సంస్థ ప్ర‌తిష్ఠ‌కు ఈ భ‌వ‌నం ఒక చిహ్న‌మ‌న్నారు. నూత‌న విద్యా విధానం అమ‌లులో ఎన్ ఐటి రూర్కేలా వంటి సంస్థ‌లు కీల‌క పాత్ర పోషిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. 
ఈ భ‌వ‌నం రూర్కేలా న‌గ‌ర ప్ర‌ఖ్యాతిని మ‌రింత‌ పెంచింద‌ని, ఆ చుట్టుప‌క్క‌ల ఉన్న భ‌వ‌నాల‌లో అదే ఎత్తైన భ‌వ‌న‌మ‌ని చెప్పారు. అందుకు ఎన్ ఐటి రూర్కేలా కుటుంబం స‌గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఈ అద్భుత‌మైన నిర్మాణం  భౌగోళికంగా, ఉప‌మానంగా కూడా రూర్కేలా గుండె అని అభివ‌ర్ణించారు. 
సుమారు రూ. 95 కోట్ల వ్య‌యంతో ఈ భ‌వ‌నం నిర్మిత‌మైంద‌ని, దీనికి మొత్తం నిధులు భార‌త విద్యా మంత్రిత్వ శాఖ అందించింద‌ని ఆయ‌న చెప్పారు. ఇప్పుడు అది రూర్కేలాలోనే అతి ఎత్తైన భ‌వ‌న‌మ‌ని ఆయ‌న అన్నారు. ఈ భ‌వ‌నం సుమారు 7000 చ‌ద‌ర‌పు మీట‌ర్ల వ్యాప్తంగా, ప్ర‌తి శాఖ‌కు స‌మాన దూరంలో ఉండేలా మ‌ధ్య‌లో ఉంటుంద‌ని వివ‌రించారు. నిర్మాణ‌ప‌రంగా, ఏడు అంత‌స్థులు క‌లిగిన ఒక బ్లాక్‌తో పాటుగా, 14 అంత‌స్థుల‌తో ఒక ట‌వ‌ర్‌ను ఇది క‌లిగి ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. 
ఈ భ‌వ‌నాన్ని క‌లిగి ఉండాల‌నే దార్శ‌నిక‌త సంస్థ ప్ర‌ధాన ల‌క్ష్యాలైన పాల‌నాప్ర‌క్రియ‌లో స‌మ‌ర్ధ‌త‌ను పెంచి, ఈ ప్ర‌క్రియ‌లో సాంకేతిక‌త‌ను  స‌మ్మిళితం చేయ‌డం ద్వారా దానిని మ‌రింత ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ఉంటుంద‌ని పోఖ్రియాల్ నొక్కి చెప్పారు. 
బ‌హిరంగ ప్ర‌దేశాలు, ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త  వ్య‌వ‌స్థ‌ల‌తో కూడిన అత్యాదునిక నిర్మాణ‌ శిల్పం ఆ సంస్థ‌లో ప‌ని చేస్తున్న సిబ్బందికి అద్భుత‌మైన ప‌ని అనుభ‌వాన్ని ఇస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. క్యాంప‌స్ వైభ‌వానికి ఈ స్మార్ట్ బిల్డింగ్ ఇది మ‌రింత దోహ‌దం చేయ‌డ‌మే కాదు, ప్రారంభించిన నాటి నుంచి  సంస్థ తాత్విక‌త‌గా ఉన్న ఉత్త‌మ స్ఫూర్తి, అంకిత భావానికి ఇది కేంద్రంగా ఉంటుందని ఆయ‌న చెప్పారు.

 


ఈ భ‌వ‌నంలో ప్ర‌పంచ స్థాయి స‌మావేశ కేంద్రం, రెండు అంతస్థుల‌లో వ్యాపించిన గ్రంథాల‌యం ఉంటుంద‌ని, దీనిని త‌క్కువ ఎత్తులో ఉన్న మ‌రొక అంత‌స్థు వేరు చేస్తుంది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో భ‌వ‌నంలో ఫైర్ సెన్సార్లు, ఆటోమేటిక్ నీటి స్ర్పింక్ల‌ర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుత ప్ర‌ణాళిక ప్ర‌కారం, అకెడిమ‌క్ సెక్ష‌న్‌, ఎగ్జామినేష‌న్ సెక్ష‌న్‌, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్ష‌న్‌, ఫైనాన్స్  సెక్ష‌న్‌, కొనుగోళ్ళు, అంత‌ర్గ‌త ఆడిట్‌, ఆలుమ్నై, అంత‌ర్జాతీయ సంబంధాలు, స్పాన్స‌ర్్డ ప‌రిశోధ‌న‌, పారిశ్రామిక క‌న్స‌ల్టెన్సీ, కంటిన్యువ‌స్ ఎడ్యుకేష‌న్ సెల్‌ను ఈ భ‌వ‌నంలోకి మార్చ‌నున్నారు. ఈ భ‌వ‌నంలో డైరెక్ట‌ర్ కార్యాల‌యం, డీన్ల కార్యాల‌యాలు, రిజిస్ట్రార్ కార్యాల‌యం, బోర్్డ రూం, సెనేట్ హాల్ వంటివి ఉంటాయి. భ‌వ‌నంపైన ఒక టెలిస్కోప్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. వాతావ‌ర‌ణం, సౌర వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన అంశాల‌పై భూగోళ‌, వాతావ‌ర‌ణ శాస్త్రాలు, ఫిజిక్స్‌, ఖ‌గోళ శాస్త్ర శాఖ‌లు త‌మ వ్యాఖ్యానాలు చేసేందుకు వ్య‌వ‌స్థ‌లు ఉన్నాయి. ఈ బ్లాక్ బేస్‌మెంట్‌లో సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌, ఆధునిక వ్య‌వ‌స్థాగ‌త అవ‌స‌రాల‌కు త‌గిన 12 అత్యాధునిక ప్ర‌యోగ‌శాలలు ఉంటాయి. ఇవి నైపుణ్యాలు పెంచుకోవ‌డం, శిక్ష‌ణ వంటి అవ‌స‌రాల‌ను తీరుస్తాయి. 

***
 



(Release ID: 1665945) Visitor Counter : 133