రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
హైవే రంగంలో ఐఏహెచ్‌ఈని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దేలా వై.ఎస్.మాలిక్ కమిటీ చేసిన సిఫారసులపై ఐఏహెచ్‌ఈ సాధారణ మండలి చర్చ
Posted On:
19 OCT 2020 7:13PM by PIB Hyderabad
కేంద్ర రహదారి రవాణా&హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అధ్యక్షతన, 'ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజినీర్స్' (ఐఏహెచ్‌ఈ) ఐదో సాధారణ మండలి సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ వి.కె.సింగ్, ఉన్నతాధికారులు, పాలకమండలి సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.
1983లో స్థాపితమైన ఐఏహెచ్‌ఈ; హైవేలు, వంతెనలు, సొరంగాల నిర్మాణాలు/ఓరియంటేషన్/నిర్వహణ వృద్ధి/వ్యూహాత్మక శిక్షణ కోర్సుల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు శిక్షణ అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, స్థానిక సంస్థలు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లతో పనిచేసే హైవే ఇంజినీర్లు, నిపుణులకు ఈ శిక్షణ ఇస్తోంది.
హైవేల అభివృద్ధికి మెరుగైన సహకారం అందించేందుకు ఐఏహెచ్‌ఈ కార్యకలాపాల్లో విస్తరణ, వృద్ధి అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిప్రకారం, రహదారి రవాణా&హైవేల శాఖ మాజీ కార్యదర్శి శ్రీ వై.ఎస్.మాలిక్ అధ్యక్షతన ఓ కమిటీని మంత్రిత్వ శాఖ నియమించింది. హైవే రంగంలో ఐఏహెచ్‌ఈని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు సిఫారసులు చేయడం ఈ కమిటీ విధి.
ఐఏహెచ్‌ఈ పరిధిని మూడు విభాగాలకు పెంచేలా కమిటీ చేసిన సిఫారసులపై సాధారణ మండలి చర్చించింది. అవి (i) శిక్షణ (ii) హైవేలు, ప్రజా రవాణా రంగంలో అనువర్తిత పరిశోధన, అభివృద్ధి (iii) రహదారి భద్రత, నియంత్రణ. ఐఏహెచ్‌ఈని హైవే రంగంలో ప్రపంచ స్థాయి ప్రధాన సంస్థగా రూపొందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మండలి నిర్ణయించింది.
***
(Release ID: 1665944)
Visitor Counter : 143