రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మలబార్‌-2020 నౌకాదళ విన్యాసాలు

Posted On: 19 OCT 2020 5:09PM by PIB Hyderabad

భారత్‌-అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా 1992 నుంచి మలబార్‌ విన్యాసాల్లో చేపట్టాయి. 2015లో జపాన్‌ కూడా చేరింది. 2018లో ఫిలిప్పైన్‌ సముద్రంలో, 2019లో జపాన్‌ సముద్రంలో సంయుక్త విన్యాసాలు సాగాయి. వచ్చే ఏడాది బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఈ కార్యక్రమం ఉండొచ్చని అంచనా.

    సముద్ర రక్షణ రంగంలో ఇతర దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్‌ ఆశిస్తుండడం, ఆస్ట్రేలియాతో రక్షణ రంగ సహకారాన్ని పెంచుకున్న నేపథ్యంలో, మలబార్‌-2020లో ఆస్ట్రేలియా కూడా పాల్గొనే అవకాశం ఉంది.

    ఈ ఏడాది, "నాన్‌ కాంటాక్ట్‌ - ఎట్‌ సీ" పద్ధతిలో విన్యాసాలు ఉంటాయి. సభ్య దేశాలను ఈ విన్యాసాలు మరింత చేరువ చేస్తాయి.

    మలబార్‌-2020 విన్యాసాల సభ్య దేశాలు, సముద్ర రంగ భద్రతను పెంచుకునే ఏర్పాట్లలో ఉన్నాయి. ఆయా దేశాలన్నీ, ఇండో-పసిఫిక్‌కు స్వేచ్ఛాయుత, బహిరంగ, సమగ్ర మద్దతు ఇస్తాయి.

***


(Release ID: 1665893) Visitor Counter : 328