యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి నైపుణ్య కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి మరో ఏడు రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలోని క్రీడా సౌకర్యాలను ఎంపిక చేయడం జరిగింది



Posted On: 17 OCT 2020 2:21PM by PIB Hyderabad

ఖేలో ఇండియా పథకం కింద మొత్తం తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని కేంద్రాలను ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి నైపుణ్య కేంద్రాలు (కె.ఐ.ఎస్.సి.ఈ) గా  కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది.  ఆ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, చండీగఢ్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, త్రిపుర, జమ్మూ-కశ్మీర్ ఉన్నాయి.

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, ఈ నిర్ణయం గురించి మాట్లాడుతూ,  "ఒకవైపు క్షేత్ర స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ, మరోవైపు క్రీడా నైపుణ్యం కోసం సౌకర్యాలను కల్పించే, ద్విముఖ విధానాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. కె.ఐ.ఎస్.సి.ఈ. లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో, భారతదేశం యొక్క ఒలింపిక్ కలలను మరింత పెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ క్రీడా ప్రతిభకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది." అని వివరించారు. 

గత ప్రదర్శనలు, మౌలిక సదుపాయాల నాణ్యత, నిర్వహణ మరియు క్రీడా సంస్కృతి మొదలైన వాటి ఆధారంగా, ఈ కేంద్రాలను ఎంపిక చేయడం జరిగింది.  ఈ ఏడాది ప్రారంభంలో, మొత్తం 14 కేంద్రాలను, కె.ఐ.ఎస్.సి.ఈ. లుగా అభివృద్ధి చేయాలని మంత్రిత్వ శాఖ గుర్తించింది.

క్రీడా పరికరాలు, అధిక పనితీరు గల మేనేజర్లు, శిక్షకులు, క్రీడా శాస్త్రవేత్తలు, సాంకేతిక సహకారం మొదలైన వాటిలో ఉన్న అంతరాలను తగ్గించే రూపంలో ఈ కేంద్రాలకు సహాయం అందించబడుతుంది.

ప్రతి రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాలచే ఈ క్రీడా సౌకర్యాలు ఎంపిక చేయబడ్డాయి.  వారితో లేదా వారి ఏజెన్సీలతో లేదా ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలుగా అభివృద్ధి చేయగల ఏదైనా అర్హత కలిగిన ఏజెన్సీలతో అందుబాటులో ఉన్న ఉత్తమ క్రీడా మౌలిక సదుపాయాలను గుర్తించవలసిందిగా కోరడం జరిగింది. 

తాజాగా గుర్తించిన కె.ఐ.ఎస్.సి.ఈ. లు :

ఆంధ్రప్రదేశ్ – డాక్టర్ వై.ఎస్.ఆర్. క్రీడా పాఠశాల, వై.ఎస్.ఆర్. జిల్లా, కడప; 

చండీగఢ్ - హాకీ స్టేడియం, సెక్టార్ - 42;

ఛత్తీస్ గఢ్ - రాష్ట్ర క్రీడా శిక్షణా కేంద్రం, బిలాస్‌పూర్;

గోవా - ఎస్.ఏ.జి. క్రీడా ప్రాంగణం, కంపల్, పనాజీ;

హర్యానా - మోతీలాల్ నెహ్రూ క్రీడా పాఠశాల, రాయ్, సోనిపట్; 

హిమాచల్ ప్రదేశ్ - ఇండోర్ స్టేడియం లుహ్ను క్రీడా ప్రాంగణం, బిలాస్‌పూర్; 

పుదుచ్చేరి – రాజీవ్ గాంధీ క్రీడా పాఠశాల, ఉప్పళ్ళం; 

త్రిపుర - దశరథ్ దేవ్ రాష్ట్ర క్రీడా ప్రాంగణం, బాదర్ ఘాట్, అగర్తలా;

జమ్మూ-కశ్మీర్ -  i)      ఎమ్.ఏ. స్టేడియం, ఫెన్సింగ్ అకాడమీ, జమ్మూ

                       ii)      జె & కె స్పోర్ట్స్ కౌన్సిల్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ, శ్రీనగర్

ప్రస్తుతం కె.ఐ.ఎస్.సి.ఈ. లతో ఉన్న రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు :

 రాష్ట్రాలు: -

అస్సాం, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, కర్ణాటక, ఒడిశా, కేరళ, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, చండీఘర్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర. 

కేంద్ర పాలిత ప్రాంతాలు :-

దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యు, పుదుచ్చేరి, జమ్మూ & కశ్మీర్. 

 

*****

 

 



(Release ID: 1665490) Visitor Counter : 198