భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య, ఈశాన్య ప్రాంతాలపై కొనసాగుతున్న అల్పపీడనం
పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి, మరో 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం
అల్లకల్లోలంగా మారనున్న సముద్రం; అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య, ఈశాన్య ప్రాంతాలవైపు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు
Posted On:
17 OCT 2020 10:44AM by PIB Hyderabad
భారత వాతావరణ విభాగానికి చెందిన తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొన్న ప్రకారం:
దక్షిణ గుజరాత్ తీరం వెంబడి అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య, ఈశాన్య ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం, పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి ఈ ఉదయం 5.30 గం.కు తూర్పు మధ్య, ఈశాన్య ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది.
అలాగే పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి, అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య, ఈశాన్య ప్రాంతాలపై మరో 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
***
(Release ID: 1665424)