ఆర్థిక మంత్రిత్వ శాఖ
జిఎస్‌టి పరిహార సెస్ లోటు భర్తీకి రాష్ట్రాలకు స్పెషల్ విండో
Posted On:
15 OCT 2020 6:05PM by PIB Hyderabad
ఆప్షన్ -1 కింద రూ 1.1 లక్షల కోట్ల రూపాయల రుణ సదుపాయ స్పెషల్ విండోకు వీలు కల్పించారు. దానికి మించి, వాటి జి.ఎస్.డి.పిలో 0.5 శాతం అదనపు ఓపెన్ మార్కెట్ రుణాలు పొందేందుకు అనుమతి ఇచ్చారు.
జిఎస్‌డిపిలో 0.5 శాతం మేరకు పెంచిన ఒఎంబి అనుమతికి సంబంధించి ఆర్ధిక మంత్రిత్వశాఖ అక్టోబర్13న ఉత్తర్వులు జారీ చేసింది. దీని అర్హతకుసంబంధించి న సంస్కరణల షరతుల విషయంలో సడలింపులకు అనుగుణంగా దీనిని జారీచేశారు. అదనంగా ఆప్షన్ -1 కింద రాష్ట్రాలు తాము వాడుకోని రుణసదుపాయాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించుకోవచ్చు.
స్పెషల్ విండో కింద, తగ్గుతుందని అంచనా వేస్తున్న రూ1.1 లక్షల కోట్లను( అన్ని రాష్ట్రాలతో కలిపి అనుకుంటే) భారత ప్రభుత్వం తగిన విడతలలో రుణం తీసుకుంటుంది.
ఇలా తీసుకున్న రుణాన్ని జిఎస్‌టి పరిహారానికిబదులుగా రుణంగా రాష్ట్రాలకు బదిలీచేయడం జరుగుతుంది.
ఇది భారత ప్రభుత్వ కోశ లోటుపై ఎలాంటి ప్రభావాన్నీ చూపదు. ఈ మొత్తం రాష్ట్రాల కేపిటల్ రాబడిగా ,దాని కోశ లోటుకు ఫైనాన్స్ేయడంలో భాగంగా ఉంటుంది.
ఇది ఒక్కొక్కరాష్ట్రానికి వాటి ఎస్‌డిఎల్‌కు అనుగుణంగా విడిగా డిఫరెన్షియల్ వడ్డీరేట్లు పడకుండా చేస్తుంది. అలాగే పాలనా పరంగా దీని నిర్వహణకూడా సులభం.
ఈ చర్యతో సాధారణ ప్రభుత్వరుణాలు (రాష్ట్రాలు+ కేంద్ర ప్రభుత్వ) ఏమాత్రం పెరగవని స్పష్టమౌతోంది. స్పెషల్‌విండో ద్వారా ప్రయోజనం పొందే రాష్ట్రాలు ఆత్మనిర్భర్ ప్యాకేజ్‌కింద జిఎస్‌డిపిలో 2 శాతం (3 శాతం నుంచి5 శాతం వరకు)అదనపు రుణాలు పొందే సదుపాయంలో చెప్పుకోదగిన స్థాయిలో తక్కువ మొత్తాన్ని అప్పుతెచ్చుకునేం అవకాశం ఉంది.
***
(Release ID: 1664959)
Visitor Counter : 258