వ్యవసాయ మంత్రిత్వ శాఖ

భారత్‌, భూటాన్‌ల‌ మధ్య వ్యవసాయ ఉత్ప‌త్తుల మార్కెట్‌కు కొత్త యాక్సెస్

Posted On: 15 OCT 2020 7:50PM by PIB Hyderabad

భారతదేశం, భూటాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలలో గణనీయమైన విజయం నమోదు చేయబ‌డింది. భార‌త ప్ర‌భుత్వపు జాతీయ మొక్కల సంరక్షణ సంస్థ (ఎన్‌పీపీఓ), వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భూటాన్ వ్యవసాయం మరియు ఆహార నియంత్రణ అథారిటీ (భ‌ఫ్రా), వ్యవసాయ మరియు అటవీ మంత్రిత్వ శాఖ, భూటాన్ రాయల్ గవర్నమెంట్ మరియు భారత రాయబార కార్యాలయం మధ్య సన్నిహిత సమన్వయం ఫ‌లితంగా ఒక నోటిఫికేష‌న్ జారీ చేయ‌డ‌మైంది. దీని ప్ర‌కారం ఇరు దేశాల మ‌ధ్య వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల కోసం కొత్త మార్కెట్ యాక్సెస్  తెర‌వ‌బ‌డింది. దీని ఫ‌లితంగా ఆపిల్, బంగాళాదుంప, క‌మ‌ల‌పండ్లు, అల్లం, వ‌క్క‌ల‌ను భూటాన్ నుండి భారతదేశానికి మార్కెట్ చేసేందుకు.. ఇదే స‌మ‌యంలో భార‌త్ నుంచి టొమాటో, ఉల్లిపాయ మరియు బెండ‌కా‌య‌ల‌ను భూటాన్ దేశంలో మార్కెట్ చేసేందుకు కొత్త యాక్సెస్ ల‌భించింది.
 

****


(Release ID: 1664947) Visitor Counter : 108