పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో 95 శాతం వాయు కాలుష్యం స్థానికకారణాలవల్ల సంభవిస్తున్నది, ఈరోజు వరకు కేవలం 4 శాతం మాత్రమే వ్యవసాయవ్యర్ధాలు కాల్చడం వల్ల వాయు కాలుష్యం కలుగుతున్నది: శ్రీ ప్రకాశ్ జవడేకర్
సిపిసిబి కి చెందిన 50 బృందాలను క్షేత్రస్థాయిలో ప్రతిస్పందన తెలుసుకునేందుకు ఢిల్లీ, ఎన్‌సిఆర్ పట్టణాలలో కేంద్రం ఏర్పాటు చేసింది.
Posted On:
15 OCT 2020 3:55PM by PIB Hyderabad
మెరుగైన వాయునాణ్యత కోసం కృషి చేసేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా కేంద్ర కాలుష్య నియంత్రణబోర్డు (సిపిసిబి) కి చెందిన 50 బృందాలను ఢిల్లీ-ఎన్‌సిఆర్ పట్టణాలలో విస్తృత క్షేత్రస్థాయి సందర్శనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించింది.
ఈ బృందాల నోడల్ అధికారులనుద్దేశించి ఈరోజు ఢిల్లీలో మాట్లాడుతూ కేంద్ర పర్యావరణ శాఖమంత్రి శ్రీ ప్రకాశ్ జవడేకర్, ప్రస్తుత కోవిడ్ సమయంలో ఈ బృందాల సభ్యులు కోవిడ్ వారియర్‌ల వంటి వారని అన్నారు. వీరు క్షేత్రస్థాయి సందర్శనలు చేసి ప్రభుత్వానికి వివరాలు అందజేస్తారని ఇది వాయు కాలుష్య బెడదను తొలగించడానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
నగరంలోని 95 శాతం కాలుష్యం స్థానిక కారణాలైన దుమ్ము, నిర్మాణపనులు, బయోమాస్ కాల్చడం వంటి వల్ల ఏర్పడుతున్నదని,వ్యవసాయ వ్యర్ధాలు కాల్చడం వల్ల కాలుష్యం ఇవాళ్టికి కేవలం 4 శాతం మాత్రమేనని ఆయన అన్నారు.
ప్రధాన వాయు కాలుష్యకారకాలకు సంబంధించి ఆయా ప్రాంతాలనుంచి రిపోర్టు చేయడం గురించి ప్రస్తావిస్తూ, ఎలాంటి నియంత్రణ లేకుండాసాగే భారీ నిర్మాణపనులు, చెత్తను, నిర్మాణవ్యర్ధాలను రోడ్ల పక్కన, ఖాళీ ప్లాట్లలో పడేయడం, చెత్తను, పారిశ్రామికవ్యర్ధాలను బహిరంగ ప్రదేశాలలో కాల్చడం వంటి వాటిపై సమాచారాన్ని ఈ బృందాలు సమీర్‌యాప్‌ద్వారా సేకరిస్తాయని ఆయన తెలిపారు.
ఈ బృందాలు ఢిల్లీ, ఎన్‌సిఆర్ పట్టణాలైన -నోయిడా,ఘజియాబాద్,ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, హర్యానాలోని గుర్గాం,ఫరీదాబాద్,బల్లబ్‌ఘర్,జజ్జర్,పానిపట్,సోనెపట్, రాజస్థాన్‌లోని భివాడి,అల్వార్, భరత్‌పూర్ లను సందర్శస్తాయి. ఈ బృందాలు ప్రత్యేకంగా పరిస్థితి తీవ్రమవడానికి కారణమయ్యే ప్రాంతాలపై దృష్టిపెడతాయి.
ఈ బృందాలు సేకరించిన సమాచారాన్ని సంబంధిత ఏజెన్సీలకు ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా సత్వర చర్యలకోసం అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్రప్రభుత్వాలకుకూడా అందజేయడం జరుగుతుంది. ఇది సకాలంలో తగిన చర్యలు తీసుకోవడానికి, సంబంధిత ఏజెన్సీలు ఆయా స్థాయిలలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది.
సిపిసిబి కేంద్రకార్యాలయంలో ఒక సెంట్రల్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసి గంట గంటకూ కాలుష్యం స్థాయిలపై దృష్టిపెడుతున్నారు. ఇందుకు వివిధ రాష్ట్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారు. దీనికితోడు ఈ బృందాల మెరుగైన నిర్వహణ,సమన్వయానికి జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమించడం జరిగింది.
చలికాలంలో, ఢిల్లీ, ఎన్‌సిఆర్ ప్రాంతంలో వాయుకాలుష్యం అనేది తీవ్రమైన బెడదగా ఉంది. ఈ ప్రాంతంలో వాయు నాణ్యతను పెంచేందుకు గత 5 సంవత్సరాలుగా వివిధ చర్యలు తీసుకోవడం జరిగింది. ఏటికేడాది వాయునాణ్యత క్రమంగా పెరుగుతున్నప్పటికీ , ఇందుకు సంబంధించి చేయాల్సింది చాలా ఉంది.
***
(Release ID: 1664926)
Visitor Counter : 229