రక్షణ మంత్రిత్వ శాఖ
సాయుధ బలగాల ఫ్లాగ్ డే ఫండ్‌కు విరాళాలివ్వాలని ప్రజలకు పిలుపు
प्रविष्टि तिथि:
15 OCT 2020 4:22PM by PIB Hyderabad
యుద్ధ వితంతువులు, అమర సైనికుల కుటుంబ సభ్యులు, మాజీ సైనికులు, దివ్యాంగ సైనికుల సంక్షేమం, పునరావాసం కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్-సర్వీస్‌మెన్ వెల్ఫేర్' పని చేస్తోంది. వారికి బతుకుదెరువు, పిల్లల చదువులు, అంత్యక్రియలు, వైద్యానికి, అనాధలు/దివ్యాంగ చిన్నారులకు గ్రాంట్ రూపంలో ఆర్థిక సాయం చేస్తోంది. దీనిని సాయుధ బలగాల ఫ్లాగ్ డే ఫండ్ (ఏఎఫ్‌ఎఫ్‌డీఎఫ్) నుంచి అందజేస్తోంది. ఏఎఫ్‌ఎఫ్‌డీఎఫ్ కోసం ప్రజల నుంచి విరాళాలు స్వీకరిస్తారు. సాయుధ బలగాల ఫ్లాగ్ డేను ఏటా డిసెంబర్ 7వ తేదీన నిర్వహిస్తారు.
యుద్ధ వితంతువులు, అమర సైనికుల సంతానం, మాజీ సైనికుల గురించి మనసుతో ఆలోచించి; మన సైనికులు, వారిపై ఆధారపడినవారికి సంఘీభావం తెలుపుతూ ఏఎఫ్‌ఎఫ్‌డీఎఫ్‌కు ఉదారంగా విరాళాలు కోరడమైనది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80జి(5)(vi) ప్రకారం ఈ విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుంది.
చెక్కులు లేదా డీడీల ద్వారా కేంద్రీయ సైనిక్ బోర్డ్ సెక్రటేరియట్, న్యూదిల్లీకి విరాళాలు అందించవచ్చు. 'ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ అకౌంట్' పేరిట ఇవి ఉండాలి. లేదా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ నం.3083000100179875, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ PUNB0308300కు నేరుగా నగదు జమ చేయవచ్చు. www.ksb.gov.in ద్వారా ఆన్‌లైన్ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చు.
***
(रिलीज़ आईडी: 1664863)
आगंतुक पटल : 193