భారత పోటీ ప్రోత్సాహక సంఘం

ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిజి పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్‌లో వాటాలను కొనుగోలు చేయడానికి సిసిఐ ఆమోదం తెలిపింది

Posted On: 14 OCT 2020 11:25AM by PIB Hyderabad

ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సిజి పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్‌లో వాటాలను కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది. రెండు కంపెనీల ప్రపోజల్ ప్రపోజల్ ప్రకారం ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా (టిల్) లిమిటెడ్, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (సిజి పవర్) ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 50% కంటే ఎక్కువ కొనుగోలు చేస్తుంది.

మురుగప్ప గ్రూపునకు చెందిన టిల్ స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీ. దీనికి ఇంజనీరింగ్, లోహపు ఉత్పత్తులు, సైకిళ్ళు వ్యాపారాలూ ఉన్నాయి. ఇది ఆటోమోటివ్, రైల్వే, నిర్మాణం, మైనింగ్, వ్యవసాయ పరిశ్రమల కోసం విస్తృత శ్రేణి ఉత్పత్తులను తయారు చేస్తుంది. సీజీ పవర్ ఒక లిస్టెడ్ కంపెనీ. దీనికి రెండు ప్రధాన వ్యాపార విభాగాలు ఉన్నాయి. ఇవి..విద్యుత్ వ్యవస్థలు, పారిశ్రామిక వ్యవస్థలు. పవర్ సిస్టమ్స్ బిజినెస్... యూనిట్ విద్యుత్ ప్రసారం, పంపిణీ, విద్యుత్ పరిష్కారాలు, ఇంటిగ్రేటెడ్ పవర్ సిస్టమ్స్ ఏర్పాటు, సంబంధిత సేవల వ్యాపారాలు చేస్తుంది. పారిశ్రామిక వ్యవస్థల వ్యాపార విభాగంలో రొటేటింగ్ మెషీన్స్ (మోటార్లు మరియు ఆల్టర్నేటర్లు), ఆటోమేటెడ్ ఎసి, డిసి, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్‌లు  , కంట్రోల్ సిస్టమ్స్, ట్రాక్షన్ ఎలక్ట్రానిక్స్, మెషీన్లు, సిగ్నలింగ్, కోచ్ ఉత్పత్తులు, రైల్వే రవాణా కోసం సేవలు/ఉత్పత్తులు ఉంటాయి. తదనంతరం సిసిఐ వివరణాత్మక ప్రకటన వస్తుంది. 


(Release ID: 1664529) Visitor Counter : 152