విద్యుత్తు మంత్రిత్వ శాఖ

దేశ‌వ్యాప్తంగా దూర‌ప్రాంతాల‌కు ఫ్టైయాష్‌ను ర‌వాణా చేయ‌నున్న ఎన్‌.టి.పి.సి

Posted On: 14 OCT 2020 12:47PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ‌శాఖ కింద‌గ‌ల , దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్ప‌త్తిదారు అయిన ఎన్‌.టి.పి.సి లిమిటెడ్‌, దేశంలోని సిమెంటు త‌యారీ కంపెనీల‌తో క‌లిసి ఫ్లైయాష్ స‌ర‌ఫ‌రాకు చ‌ర్య‌లుచేప‌డుతోంది. విద్యుత్ ఉత్ప‌త్తి సంద‌ర్భంగా వ‌చ్చే ఫ్లైయాష్‌ను నూరుశాతం ఉప‌యోగించేందుకు ఎన్‌టిపిసి చ‌ర్య‌లు చేప‌ట్టింది.ఫ్లైయాష్‌ను చౌక‌గా ,ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌రంగా ర‌వాణాచేయ‌డానికి భార‌తీయ రైల్వేకి గ‌ల భారీ నెట్‌వ‌ర్క్‌ను ఉప‌యోగించుకోనుంది.



ఎన్‌.టి.పి.సిలిమిటెడ్ విడుద‌ల చేసిన‌ప్ర‌క‌ట‌న ప్ర‌కారం, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఎన్‌టిసపిసి రిహాండ్ విద్యుదుత్ప‌త్తి ప్లాంటు కండిష‌న్డ్ ఫ్లైయాష్‌ను సిమెంట్ త‌యారీదారుల‌కు పంపిన తొలి విద్యుద‌త్ప‌త్తి ప్లాంటు. ఈ ప్లాంటు ఇటీవ‌ల 3,834 మెట్రిక్ ట‌న్నుల కండిష‌న్డ్ ఫ్లైయాష్‌ను 59 బాక్స‌న్ వాగ‌న్ల‌లో  అస్సాంలోని నాగ‌న్ లోగ‌ల దాల్మియా సిమెంట్ (భార‌త్‌)లిమిటెడ్‌కు పంపింది. అంత‌కుముందు కండిష‌న్డ్‌ఫ్లై యాష్‌రైల్ రేక్‌ల‌ను టికారియా(యూపి),మ‌ధ్య‌ప్ర‌దేశ్లోని కిమోర్‌,పంజాబ్‌లోని రోపార్‌ల‌లోని ఎసిసి కంపెనీ ప్లాంట్ల‌కు పంపింది.
2019-20 ఆర్ధిక సంవ‌త్స‌రంలో దాదాపు 44.33 మిలియ‌న్‌ట‌న్నుల ఫ్లైయాష్‌ను వివిధ ఉత్ప‌త్తుల త‌యారీలో ఉప‌యోగించారు. ఎన్‌.టి.పిసి ప్లాంట్ల‌లో ఏటా సుమారు 65 మిలియ‌న్‌ట‌న్న‌ల బూడిద వ‌స్తుంది. ఇందులో 80 శాతం అంటే సుమారు52 మిలియ‌న్ ట‌న్నులు ఫ్లైయాష్‌. ప్ర‌స్తుతం మొత్తం బూడిద‌లో 73 శాతాన్ని సిమెంట్ ఉత్ప‌త్తిలో ఉప‌యోగిస్తారు. అలాగే ఫ్లైయాష్ ఇటుక‌‌లత‌యారీ,రోడ్డు క‌ట్ట‌ల నిర్మాణం,,గ‌నుల‌ను పూడ్చ‌డానికి,లోత‌ట్టు ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు.
 మొత్తం 62.9 గిగావాట్ల స్థాపిత సామ‌ర్ధ్యంతోఎన్‌.టి.పి.సిగ్రూపు 70 విద్యుత్ స్టేష‌న్ల‌ను క‌లిగి ఉంది. ఇందులో 24 బొగ్గు, 7 కంబైన్డ్ సైకిల్ గ్యాస్‌, లిక్విడ్ ఫ్యూయ‌ల్‌,1 హైడ్రొ 13 రెన్యువ‌బుల్స్ ఉన్నాయి. అలాగే 25 స‌బ్సిడ‌రీ,సంయుక్త రంగ ప‌వ‌ర్ స్టేష‌న్లు ఉన్నాయి. ఈ గ్రూపున‌కు 20 గిగావాట్లకుపైగా సామ‌ర్ధ్యంగ‌ల విద్యుత్ స్టేష‌న్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో 5 గిగావాట్ల పున‌రుత్పాద‌క ఇంధ‌న ప్రాజెక్టులూ ఉన్నాయి.

 


(Release ID: 1664324) Visitor Counter : 228