భారత పోటీ ప్రోత్సాహక సంఘం

అదానీ గ్రీన్ ఎనర్జీ టెన్ లిమిటెడ్ కు సంబంధించిన సౌర శక్తి ఉత్పత్తి ఆస్తులను అదానీ గ్రీన్ ఎనర్జీ ట్వంటీ-త్రీ లిమిటెడ్ కొనుగోలు చేయడానికి సిసిఐ ఆమోదం తెలిపింది.

Posted On: 14 OCT 2020 11:24AM by PIB Hyderabad

కాంపిటేషన్ యాక్ట్ సెక్షన్ 31(1) ప్రకారం అదానీ గ్రీన్ ఎనర్జీ టెన్ లిమిటెడ్(ఏజీఈ10ఎల్)కు చెందిన  సౌర శక్తి ఉత్పత్తి ఆస్తులను అదానీ గ్రీన్ ఎనర్జీ ట్వంటీ త్రీ లిమిటెడ్ (ఏజీఈ23ఎల్) కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది.

ఏజీఈ23ఎల్ అనేది టోటల్ సోలార్ సింగపూర్ పీటీఈ లిమిటెడ్, మరియు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థల జాయింట్ వెంచర్. భారతదేశంలోని సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యాపారంలో ఈ సంస్థ ఉంది.

ఈ ప్రతిపాదన ప్రకారం కొనుగోలు జాబితాలో (i) టిఎన్ ఉర్జా ప్రైవేట్ లిమిటెడ్; (ii) ఎస్సెల్ ఉర్జా ప్రైవేట్ లిమిటెడ్; (iii) పిఎన్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్; (iv) పిఎన్ క్లీన్ ఎనర్జీ లిమిటెడ్; (v) కెఎన్ ఇండి విజయ్‌పుర సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్; (vi) కెఎన్ బీజాపురా సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్; (vii) కెఎన్ ముద్దేబిహల్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్; (viii) కెఎన్ సిండగి సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్; (ix) ఎస్సెల్ బాఘల్‌కోట్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్; మరియు (x) ఎస్సెల్ గుల్బర్గా సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ లు ఉన్నాయి. ఈ ఆస్తులు జాయింట్ వెంచర్ కు సొంతమవుతాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ టెన్ లిమిటెడ్ (ఏజీఎల్10ఎల్) వీటికి హోల్డింగ్ సంస్థ.

మరిన్ని వివరాలు సీసీఐ వెల్లడించనుంది

***



(Release ID: 1664278) Visitor Counter : 124