రక్షణ మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వానికి తుది డివిడెండ్ చెల్లించిన బీడీఎల్
Posted On:
13 OCT 2020 5:52PM by PIB Hyderabad
హైదరాబాద్ నగరానికి చెందిన రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థ 'భారత్ డైనమిక్స్ లిమిటెడ్'(బీడీఎల్) భారత ప్రభుత్వానికి రూ.35.018 కోట్ల మేర తుది డివిడెండ్ చెల్లించింది. బీడీఎల్‌లో భారత ప్రభుత్వపు వాటాకు సంబంధించి తుది డివిడెండ్‌గా రూ.35.018 కోట్ల చెక్‌ను బీడీఎల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కమోడోర్ సిద్ధార్థ్ మిశ్రా (రిటైర్డ్) ఈ రోజు న్యూఢిల్లీలో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు అందజేశారు. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను బీడీఎల్ సంస్థ రూ.10 ముఖవిలువ కలిగిన షేరు ఒక్కింటికి రూ.2.55 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. బీడీఎల్ సంస్థ ప్రకటించిన గత ఆర్థిక సంవత్సరానికి చెందిన తుది డివిడెండ్, రూ.183.28 కోట్ల పెయిడప్ క్యాపిటల్‌లో (చెల్లించిన వాటా మూలధనంలో) 25.5 శాతంగా నిలిచింది. అంతకుముందు, బీడీఎల్ సంస్థ ఈ ఏడాది మార్చిలో ఒక్కో షేరుకు రూ.6.25 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించింది.
సంస్థలో ప్రభుత్వ వాటాకు సంబంధించి బీడీఎల్ రూ.100.518 కోట్ల మధ్యంతర
డివిడెండ్‌ను భారత ప్రభుత్వానికి ప్రకటించింది. దీంతో, 2019-20 మొత్తం ఆర్థిక సంవత్సరానికి బీడీఎల్ సంస్థ భారత ప్రభుత్వానికి చెల్లించిన డివిడెండ్ మొత్తం రూ.135.536 కోట్లకు చేరుకుంది. సంస్థ 2019-20 సంవత్సరానికి రూ.3,095.20
కోట్ల మేర అమ్మకాల టర్నోవర్‌ను సాధించింది. బీడీఎల్ పన్ను ముందు లాభం రూ.742.45 కోట్లుగా నిలిచింది. డివిడెండ్ చెల్లింపు ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ (డీడీపీ) కార్యదర్శి శ్రీ రాజ్ కుమార్, రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (ఏరో) శ్రీ చంద్రకర్ భారతి తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1664235)
Visitor Counter : 168