రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్-చైనా సైనిక కమాండర్ల స్థాయి ఏడో దఫా సమావేశ సంయుక్త పత్రిక ప్రకటన
Posted On:
13 OCT 2020 5:16PM by PIB Hyderabad
భారత్-చైనాకు చెందిన సీనియర్ సైనిక కమాండర్ల ఏడో దఫా సమావేశం గత సోమవారం చుషుల్‌లో జరిగింది. భారత్-చైనా సరిహద్దుల్లోని పశ్చిమ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వెంట బలగాల ఉపసంహరణపై రెండు పక్షాలు నిజాయతీగా, లోతైన, నిర్మాణాత్మక అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా సాగాయని, రెండు పక్షాల పరిస్థితులపై ఇరు దేశాలు అవగాహన పెంచుకున్నట్లు అభిప్రాయం వ్యక్తమైంది. సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించాలని, సైనిక బలగాల ఉపసంహరణపై వీలైనంత త్వరగా పరస్పర ఆమోదయోగ్య పరిష్కారానికి రావాలని రెండు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాల నేతల మధ్య కుదిరిన ముఖ్యమైన అవగాహనలను అమలు చేయాలని, విభేదాలను వివాదాలుగా మార్చకూడదని, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిస్థితులను ఉమ్మడిగా కాపాడాలని ఇరు దేశాల సైనిక బృందాలు ఈ సమావేశంలో అంగీకరించాయి.
***
(Release ID: 1664224)
Visitor Counter : 229