నీతి ఆయోగ్
పాఠశాలల వ్యాప్తంగా ఆవిష్కరణ స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు సిజిఐతో అటల్ ఇన్నొవేషన్ మిషన్ భాగస్వామ్యం
Posted On:
13 OCT 2020 3:48PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఆవిష్కరణల స్ఫూర్తిని మరింత పెంచేందుకై నీతి ఆయోగ్‌లో భాగమైన అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం), సిజిఐ ఇండియాతో స్టేట్‌మెంట్ ఆఫ్ ఇంటెంట్ (SOI) మంగళవారం సంతకాలు చేసింది.
ఎయిమ్ కు చెందిన నవీన అటల్ టింకరింగ్ లాబ్ చొరవకు నిరంతర మద్దతునివ్వడంలో భాగంగా, అతిపెద్ద ఐటి, బిజినెస్ కన్సల్టింగ్ సర్వీసుల సంస్థ అయిన సిజిఐ ఎటిల్ పాఠశాలల నుంచి నవీన, సృజనాత్మక కార్మిక శక్తిని విజయవంతంగా సృష్టించేందుకు తన సహకారాన్ని అందిస్తోంది.
ఆవిష్కరణా సంస్కృతిని, వ్యవస్థాపకతను ప్రోత్సహించే భారత ప్రభుత్వ ప్రధాన పథకాలలో ఎఐఎం ఒకటి. భారత దేశ వ్యాప్తంగా 2.5 మిలియన్ల మంది పిల్లలకు ఎటిఎల్ లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్ధులకు డూ-ఇట్- యువరసెల్ఫ్ కిట్లను వాడుకునేందుకు వీలుగా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆవిష్కరణలకు అనువైన ప్రదేశమే ఎటిఎల్. విద్యార్ధులు అక్కడ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సృజనాత్మక ఆవిష్కరణలు చేయడాన్ని నేర్చుకుంటారు.
ఈ ఒప్పందంలో భాగంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబైలలో ఎటిఎల్ లు ఉన్న 100 పాఠశాలలను దత్తత చేసుకునేందుకు సిజిఐ అంగీకరించింది. ఎటిఎల్‌ల వద్ద విద్యార్ధులు తమ సాంకేతికత అక్షరాస్యతను పెంచుకోవడానికి సిజిఐ వాలెంటీర్లు శిక్షణను, మార్గనిర్దేశనాన్ని చేయడం ద్వారా ఎస్‌టిఇఎమ్ పరికరాల ద్వారా పనిలో నిమగ్నమై అనుభవాలను పొందేందుకు తోడ్పడతారు.
ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజైన్ థింకింగ్, కంప్యుటేషనల్ థింకింగ్, రోబోటిక్్స, కోడింగ్ వంటి అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణా వర్్కషాపులను సిజిఐ నిర్వహిస్తుంది.
అటల్ ఇన్నొవేషన్ మిషన్ డైరెక్టర్ ఆర్ రామన్ మాట్లాడుతూ, ఎఐఎమ్‌కు సిజిఐకి మధ్య భాగస్వామ్యం ఎటిఎల్ లకు అవసరమని, ఇది ఎటిఎల్ విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు కూడా అత్యంత లబ్ధి చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా 100 ఎటిఎల్ పాఠశాలలను దత్తత తీసుకుని, సాంకేతిక నైపుణ్యం, ప్రావీణ్యంతో సాయపడేందుకు సిజిఐ అంగీకరించింది. దీనితో భారతదేశంలో చోటు చేసుకుంటున్న 4వ పారిశ్రామిక విప్లవంతో ఎటిఎల్ విద్యార్ధులు మరింత అనుసంధానం అయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. అలాగే, ఎటిఎల్ ఉపాధ్యాయులలో నవీన ఆలోచనావిధానాన్ని నిర్మించేందుకు, సామర్ధ్య నిర్మాణం కోసం అన్‌బాక్స్ టింకరింగ్ వర్్కషాపుల సిజిఐ నిర్వహిస్తుందని ఆయన చెప్పారు.
సిజిఐకి చెందిన ఆసియా పసిఫిక్ గ్లోబల్ డెలివరీ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్్స అధ్యక్షుడు మట్టక్కల్ మాట్లాడుతూ, ఎస్‌టిఇఎమ్ ద్వారా మన విద్యార్ధులను విద్యావంతులను, శక్తివంతులను చేసేందుకు సిజిఐ కట్టుబడి ఉందని అన్నారు. ఆవిష్కరణ, సృజనాత్మకకు ప్రేరణను ఇస్తూ, భవిష్యత్ డిజిటల్ కార్మిక శక్తిని కలిసి నిర్మించే కృషిలో నీతి ఆయోగ్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
దేశంలోని ప్రధాన నగరాలలో 14,000 మంది కన్సల్టెంట్లను సిజిఐ కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లైంట్లకు అంతర్జాతీయ బట్వాడాలో తోడ్పడుతూ, సన్నిహిత భాగస్వామ్యాన్ని, జవాబుదారీ తనాన్ని, సరళతను, ఉన్నతమైన సేవలను, ముఖ్యంగా ఆశించిన వాణిజ్య ఫలితాలను వీరు ఇస్తారు.
***
(Release ID: 1664136)
Visitor Counter : 267