భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

కాకినాడ వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం

తీవ్ర వాయుగుండం గమనాన్ని పర్యవేక్షిస్తున్న మచిలీపట్నం, విశాఖపట్నం, గోపాల్‌పూర్‌లోని డాఫ్లర్‌ వెదర్‌ రాడర్లు
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలకు (రోజుకు 20 సెం.మీ.కు పైగా) అవకాశం; తీర ప్రాంతం, ఉత్తర కర్ణాటక, దక్షిణ కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో, రాబోయే 3 గంటల్లో, గంటకు 55-65 కి.మీ. నుంచి గరిష్టంగా 75 కి.మీ. వేగంతో గాలులు

బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య, వాయవ్య, నైరుతి ప్రాంతాలు, ఒడిశా-ఆంధ్రప్రదేశ్-తమిళనాడు&పుదుచ్చేరి తీరాల్లో తీవ్ర అల్లకల్లోలంగా సముద్రం

Posted On: 13 OCT 2020 9:11AM by PIB Hyderabad

భారత వాతావరణ విభాగానికి (ఐఎండీ) చెందిన తుపాను హెచ్చరిక విభాగం ప్రకారం:

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం, గంటకు 17 కి.మీ. వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలింది. ఈ ఉదయం 5.30 గం. సమయానికి విశాఖకు దక్షిణ-నైరుతి దిశగా 120 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. అదే సమయానికి కాకినాడకు 25 కి.మీ. కంటే దగ్గరగా, నరసాపురానికి తూర్పు-ఈశాన్య దిశగా 100 కి.మీ. దూరంలో ఉంది.

    తాజా సమాచారం ప్రకారం, కాకినాడకు సమీపంలో ఈ ఉదయం 6.30-7.30 గం. మధ్య వాయుగుండం తీరాన్ని దాటింది. ఆ సమయంలో గంటకు 55-65 కి.మీ. నుంచి గరిష్టంగా 75 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.

    తీవ్ర వాయుగుండం గమనాన్ని మచిలీపట్నం, విశాఖపట్నం, గోపాల్‌పూర్‌లోని డాఫ్లర్‌ వెదర్‌ రాడర్లు పర్యవేక్షిస్తున్నాయి. రాడార్లు తీసిన చిత్రాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలు, వాటిని ఆనుకుని ఉన్న జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి.

 

Date/Time(IST)
Position
(Lat. 0N/ long. 0E)
Maximum sustained surface 
wind speed (Kmph)
Category of cyclonic disturbance
13.10.20/0530
16.9/82.5
55-65 gusting to 75

Deep Depression

13.10.20/1130
17.3/81.4
45-55 gusting to 65

Depression

13.10.20/1730
17.6/80.3
35-45 gusting to 55

Depression

13.10.20/2330
17.9/79.2
25-35 gusting to 45

Well marked low

***


(Release ID: 1663957) Visitor Counter : 185