భారత ఎన్నికల సంఘం

బీహార్ అసెంబ్లీకి మొదటివిడత ఎన్నికలు జరిగే 71 నియోజకవర్గాల్లో 52,000 మందికి పైగా అర్హులైన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ విధానాన్నిఎంచుకున్నారు.

కొవిడ్-19 నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన సమగ్రమైన మరియు సురక్షితమైన ఎన్నికలను నిర్వహించడానికి అర్హులైనవారికి ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

Posted On: 12 OCT 2020 3:28PM by PIB Hyderabad

త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటిదశ పోలింగ్ లో 52,000 మందికి పైగా సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు పైబడినవారు) దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేసే సదుపాయాన్ని ఎంచుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో పారదర్శకత పాటించడానికి అర్హులైన ఓటర్లకు ముందుగా సమాచారం అందించిన తేదీల్లో బ్యాలెట్లను ఎన్నికల అధికారులు అందిస్తారు. ఈ ప్రక్రియను వీడియో ద్వారా రికార్డ్ చేస్తారు. బీహార్ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని రెండు వర్గాలకు విస్తరించడం ఇదే మొదటిసారి. బీహార్‌లోని 71 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బూత్ లెవల్ ఆఫీసర్లు ఇలాంటి లక్ష మందికి పైగా ఓటర్లను ఇప్పటికే చేరుకున్నారు. మిగిలిన ఓటర్లు ఓటింగ్ కోసం పోలింగ్ బూత్‌ను సందర్శిస్తారని భావిస్తున్నారు.

బీహార్ 2020 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 25,2020న ఎన్నికల కమిషన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మొదటి దశ ఎన్నికలలో భాగంగా బీహార్ లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్టోబర్ 28, 2020న పోలింగ్ జరగనుంది. 2020 సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 01 వరకు బీహార్ లో పర్యటించిన ఎన్నికల సంఘం పైన పేర్కొన్న వర్గాలకు సంబంధించిన ఇబ్బందులపై దృష్టి సారించింది. ఆ సమస్యలను సమగ్రంగా పరిష్కరించడానికి, అక్టోబర్ 03, 2020 న కమిషన్ పలు ఆదేశాలను జారీ చేసింది:

* బూత్ లెవల్ అధికారి పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటరు ఇంటికి వెళ్లి.. ఆర్.ఓ అధించిన ఫారం- 12-Dను అందిస్తారు. సంబంధిత ఓటరు అందుబాటులో లేకపోతే అతని సంప్రదించడానికి అవసరమైన వివరాలను వారి సంబంధికులనుండి స్వీకరిస్తారు. నోటిఫికేషన్ విడుదలైన ఐదు రోజుల్లో తిరిగి ఆ ఓటరు ఇంటిని సందర్శిస్తారు.

* ఫారం 12-డితో జతచేయబడిన రసీదులో ఆ ఓటర్ పోస్టర్ బ్యాలెట్‌ను  ఎంచుకోవచ్చు లేదా ఎంచుకోకపోవచ్చు.

* ఒకవేళ ఆ ఓటర్ పోస్టల్ బ్యాలెట్‌ను ఎంచుకుంటే, నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజులలోపు బూత్ లెవల్ అధికారి ఆ ఓటరునుండి పూరించిన ఫారం 12-D ని సేకరించి ఆ వెంటనే వెంటనే రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. సెక్టార్ అధికారి ఈ ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షిస్తారు. ”

బీహార్లో తరువాత జరగనున్న రెండు దశల ఎన్నికలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలలో ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. తద్వారా కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఈ వర్గాలు ఎన్నికల ప్రక్రియలో సురక్షితంగా,సులభతరంగా పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ ప్రక్రియ కోసం బీహార్ త్వరలో జరగనున్న రెండు దశల ఎన్నికల్లో ఈ ప్రక్రియను అమలు చేసేందుకు బూత్ లెవల్ అధికారులు సుమారు 12 లక్షల మంది ఓటర్ల గృహాలను సందర్శించనున్నారు.

***



(Release ID: 1663878) Visitor Counter : 106