వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో 'కనీస మద్దతు ధర' కార్యకలాపాలు
- 11.10.2020 వరకు 3.57 లక్షల మంది రైతుల నుండి రూ.8032.62 కోట్లు ఎంఎస్‌పీ విలువ కలిగిన సుమారు 42.55 ఎల్ఎంటీల వరి కొనుగోలు
Posted On:
12 OCT 2020 6:04PM by PIB Hyderabad
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) 2020-21 ప్రారంభంతో కేంద్ర ప్రభుత్వం గత సీజన్లలో మాదిరిగానే.. ప్రస్తుతమున్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పథకాల ప్రకారం రైతుల నుండి సీజన్ పంటలను ఎంఎస్‌పీ వద్ద కొనుగోలు చేస్తోంది. ఖరీఫ్ 2020-21 సీజన్ వరి సేకరణ ప్రక్రియ రాష్ట్రాలలో సజావుగా జరుగుతోంది. 11.10.2020 వరకు 3.57 లక్షల మంది రైతుల నుండి రూ.8032.62 కోట్లు ఎంఎస్‌పీ విలువ కలిగిన సుమారు 42.55 ఎల్ఎంటీల వరి కొనుగోలు చేయడం జరిగింది. దీనికి తోడుగా రాష్ట్రాల ప్రతిపాదన ఆధారంగా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020 కోసం 30.70 ఎల్‌ఎంటీ పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోలుకు అనుమతులు జారీ చేయడమైంది.
ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలలో పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోలుకు ఈ అనుమతులు జారీ చేయడమైంది. దీనికి తోడుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 1.23 ఎల్‌ఎంటీల కొబ్బరి (శాశ్వత పంట) కొనుగోలుకు అనుమతి ఇవ్వబడింది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు మరియు కొప్రాలను ధరల మద్దతు పథకం(పీఎస్ఎస్) కింద కొనుగోలుకు తగిన ప్రతిపాదనలు వచ్చాక పలు ఇతర రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా
అనుమతి ఇవ్వబడుతుంది. దీంతో 2020-21 సంవత్సరానికి గాను ఈ పంటల యొక్క ఎఫ్ఏక్యూ గ్రేడ్ సేకరణను నోటిఫైడ్ ఎంఎస్‌పీ రిజిస్టర్డ్ రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసే వీలవుతుంది. నోటిఫైడ్ హార్వెస్టింగ్ వ్యవధిలో మార్కెట్ రేటు ఎంఎస్‌పీ కంటే తక్కువగా ఉంటే ఆయా రాష్ట్రాలు/యుటీలలో రాష్ట్రంలో నామినేట్ చేసిన ప్రొక్యూర్ ఏజెన్సీల ద్వారా సెంట్రల్ నోడల్ ఏజెన్సీల ద్వారా పంటల కొనుగోలు చేయడం జరుగుతోంది. 11.10.2020 వరకు ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా దాదాపు 606.56 మెట్రిక్ టన్నుల పెసర్లు, మినుముల్ని కొనుగోలు చేసింది. వీటి ఎంఎస్‌పీ కొనుగోలు విలువ రూ.4.36 కోట్లు. దీంతో తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానాలో 533 మంది రైతులకు లబ్ధి చేకూరింది. అదే విధంగా, కర్ణాటక, తమిళనాడులలో 3961 మంది రైతులకు మేలు జరిగేలా రూ.52.40 కోట్ల ఎంఎస్‌పీ విలువ కలిగిన 5089 మెట్రిక్ టన్నుల కొబ్బరిని నోడల్ ఎజెన్సీల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. కొబ్బరి, మినుములు తదితర కొనుగోలుకు సంబంధించి, ప్రధాన ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో రేట్లు ఎంఎస్‌పీ కంటే ఎక్కువగా ఉన్నాయి. మినుములు మరియు ఇతర ఖరీఫ్ పప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరణకు సంబంధించి వచ్చిన అభ్యర్థనల ఆధారంగా.. నిర్ణయించిన తేదీ నుండి సంబంధిత రాష్ట్ర / యూటీ ప్రభుత్వాలు సేకరణ ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో పత్తి గింజల (కపాస్) సేకరణ 2020 అక్టోబర్ 1వ తేదీ నుండి ప్రారంభమైంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2020 అక్టోబర్ 11 నాటికి సంచిత సేకరణ ఎంఎస్‌పీ కింద రూ.7545 లక్షల విలువైన 24863 బేళ్ల పరిమాణంలో కొనుగోళ్లు జరిపింది. దీనివల్ల 5252 మంది రైతులకు లబ్ధి చేకూరింది.
*****
(Release ID: 1663875)
Visitor Counter : 145