విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ముంబ‌యికి ప‌య‌న‌మైన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సీఈఏ నేతృత్వంలోని కేంద్ర అధికారుల బృందం

-ముంబ‌యి న‌గ‌రంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా స్తంభించిన విష‌య‌మై అధ్యయనం, పరిస్థితులకు పరిష్కారాలను కనుగొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి త‌గిన సహాయం చేయ‌నున్న బృందం

- నేషనల్ గ్రిడ్ ప్రభావితం కాన‌ప్ప‌టికీ స్టేట్ గ్రిడ్‌లో అంత‌రాయం ఏర్ప‌డ‌టంపై అధ్య‌య‌నం జ‌ర‌ప‌నున్న బృందం

- విద్యుత్ స‌రఫ‌రా పునరుద్ధరణకు స‌హాయం అందిస్తున్న కేంద్ర విద్యుత్ శాఖ అధికారులు: శ్రీ ఆర్.కె. సింగ్

Posted On: 12 OCT 2020 5:34PM by PIB Hyderabad

ముంబ‌యిలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం క‌లిగిన విష‌య‌మై ఈ రోజు తెల్లవారు జామున కేంద్ర విద్యుత్, ఎంఎన్ఆర్ఈ మంత్రిత్వ శాఖల‌‌ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా) ఆర్.ఆర్.కె. సింగ్ మాట్లాడుతూ “విద్యుత్ సరఫరా (ముంబ‌యిలో) గణనీయంగా పునరుద్ధరించబడింది. 2000 మెగావాట్లలో మొత్తం  1900 మెగావాట్ల మేర స‌ర‌ఫ‌రా పునరుద్ధరించబడింది. మిగ‌తా ప్రాంతాల్లోనూ
త్వరలో స‌ర‌ఫ‌రా పునరుద్ధరించబడుతంది. నేషనల్ గ్రిడ్‌కు ఏలాంటి ప్ర‌మాదం వాటిల్ల లేదు, స్టేట్ గ్రిడ్‌లోని కొన్నిప్రాంతాల్లో మాత్రం సమస్యలు ఏర్ప‌డ్డాయి.”
స‌ర‌ఫ‌రాలో అంత‌రాయ‌పు సమస్యను గుర్తించడానికి గాను, ఇలాంటి ప‌రిస్థితుల‌కు ఎదుర్కొనేందుకు సాధ్యమైన పరిష్కారాలను తెలుసుకోవడానికి కేంద్ర బృందం ముంబ‌యిని సందర్శిస్తుందని శ్రీ సింగ్ అన్నారు.

***


(Release ID: 1663818) Visitor Counter : 138