ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సండే సంవాద్ -5 సందర్భంగా తన నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తనవ్యక్తిగత ఫోన్‌నెంబర్ ఇచ్చిన డాక్హర్‌హర్ష వర్ధన్
”పండగలను ఆడంబరం గా చేసుకోమని ఏ మతమూ చెప్పదు”
“ కోవిడ్ పై పోరాటమే మన పరమ ధర్మం”
“కోవిడ్ వాక్సిన్ అత్యవసర వినియోగానికి సంబంధించిన అనుమతి, క్లినికల్ పరీక్షల డాటాను బట్టి ఉంటుంది”
“ఫెలూదా పరీక్ష రాగల నాలుగు వారాలలో రావచ్చు”
“ వృత్తిపరమైన ముప్పు, ఇన్‌ఫెక్షన్‌కుగురయ్యే అవకాశం వంటి వాటిని వాక్సిన్ ప్రాధాన్యతలు నిర్ణయించేందుకు వినియోగించడం జరుగుతుంది.”
“పలు కోవిడ్ -19 వాక్సిన్‌లను వాటి అందుబాటును బట్టి దేశంలో ప్రవేశపెట్టే అవకాశాన్నిఅంచనావేస్తాం.”
“ తిరిగి ఇన్‌ఫెక్షన్‌కుగురైన కేసుల భారాన్ని అంచనావేసేందుకు ఐసిఎంఆర్ అధ్యయనం”
“ కోవిడ్‌కు ఆయుష్ పరిష్కారాలలో ఇమ్యునో మాడ్యులారిటీ,యాంటీ వైరల్,యాంటీ పైరటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నట్టు రుజువయ్యాయి.
Posted On:
11 OCT 2020 2:32PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తన సండే సంవాద్-5 వ ఎపిసోడ్‌లో సోష్‌ల్‌మీడియా కుచెందిన పలువురు వేసిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కోవిడ్‌కు సంబంధించిన పుకార్లను,తప్పుడు భావనలను ఆయన కొట్టిపారేస్తూ,కోవిడ్ పై పోరాటంలో ఆయుర్వేదం పాత్రగురించి డాక్టర్‌హర్షవర్ధన్ సవివరంగా తెలియజేశారు. తిరిగి ఇన్‌ఫెక్షన్‌కుగురైన వారిపై ఐసిఎంఆర్ విడుదల చేయనున్న నివేదిక, వాక్సిన్ వేసేందుకు ప్రాధాన్యతల ఎంపిక, కోవిడ్ వాక్సిన్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ ఇబ్బందుల గురించి తెలసుకుని ఆయన తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ను పబ్లిక్ ప్లాట్‌ఫారంపై తెలియజేశారు. తన నియోజక వర్గ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ప్రాధాన్యత నిచ్చి పరిష్కరించనున్నట్టు ఆయన వారికి హామీ ఇచ్చారు.
కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఎక్కడా గుమికూడవద్దని, ప్రభుత్వం జారీ చేసిన ముందు జాగ్రత్త చర్యలను జాగ్రత్తగా పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్ప పండుగలను బయట పందిళ్లలో జరుపుకోవడం కాక తమ ప్రియమైన వారిమధ్య ఇళ్లలోనే జరుపుకోవలసిందిగా ఆయన సూచించారు . కోవిడ్ పై పోరాటమే పరమధర్మమని అంటూ డాక్టర్‌హర్షవర్ధన్,దేశ ఆరోగ్య శాఖ మంత్రి గా తన ధర్మం వైరస్ బారినుంచి ప్రజలను రక్షించి , ఎలాగైనా ప్రజల ప్రాణాలను కాపాడడమే నని ఆయన అన్నారు.“ మీ విశ్వాసాన్ని, మీ మతంపై మీకుగల నమ్మకాన్నివ్యక్తం చేసేందుక పెద్ద సంఖ్యలో గుమికూడాల్సిన అవసరం లేదు.ఇలాచేస్తే మనం పెద్ద సమస్యలో పడతాం. కృష్ణ పరమాత్మ , మీ లక్ష్యం మీద దృష్టి పెట్టమని చెబుతాడు....నాలక్ష్యం...మీ లక్ష్యం....మనందరి ఉమ్మడి లక్ష్యం వైరస్‌ను అంతం చేసి మానవాళిని కాపాడడం. ఇదే మన మతం.ఇదే ప్రపంచ మతం.” అని ఆయన అన్నారు.
అత్యంత అరుదైన పరిస్థితులు అరుదైన బాధ్యతను కూడా కోరుకుంటాయని అన్నారు.ఏ మతం, ఏ దేవుడు కూడా పండగలను ఆడంబరంగా జరపాలని చెప్పడం లేదు. ప్రార్ధనల కోసం మసీదులు, ఆలయాలకు వెళ్లాలని చెప్పడం లేదు అనిడాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. రాగల రెండు నెలలు ప్రజలు , ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విధంగా ప్రతిజ్ఞ చేపట్టి దేశవ్యాప్తంగా కోవిడ్ పైఅవగాహనకు జన ఆందోళన్ లోభాగం (శీతాకాలంలో సహా) కావాలి.అప్పుడే కోవిడ్ మహమ్మారి మరింత గా విస్తరించకుండా ఉంటుంది. కరోనా వైరస్ ఊపిరితిత్తులకు సంబంధించిన వైరస్‌కనుక శీతాకాలంలో ఈ వైర్ విస్తరణ ఎక్కువ గా ఉండే అవకాశం ఉందని , చల్లటి వాతావరణంలోఇది మరింత పెరిగే అవకాశం ఉందనిఅన్నారు.“ ఈ వైరస్ చల్లటి వాతావరణంలో ,తక్కువ తేమ పరిస్థితులలో బాగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల భారతదేశ పరిస్థితులలో కూడా నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి రేటు పెరిగేఅవకాశం ఉందని భావించడం తప్పు కాదు. ” అని ఆయన అన్నారు. ముఖానికిమాస్కు ధరించడం ,ప్రత్యేకించి పబ్లిక్‌ప్రదేశాలలో దీనిని పాటించడం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవడం,ఊపిరితిత్తులకు సంబంధించిన జాగ్రత్తలు పాటించడం వంటి వాటివల్ల వైరస్‌వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుందని డాక్టర్ హర్ష వర్ధన్ పునరుద్ఘాటించారు.
త్వరలోనే ఫెలూదా పరీక్ష రానున్నదన్న శుభ వార్తను డాక్టర్‌హర్షవర్ధన్ తెలిపారు. ప్రయోగదశలో 2000 మంది పేషెంట్లపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయలజీ(ఐజిఐబి)లో నిర్వహించిన పరీక్షలు, ఇంకా ప్రైవేటు ల్యాబ్‌లలో నిర్వహించిన పరీక్షలలో 96 శాతం సున్నితత్వం, 98 శాతం ఖచ్చితత్వం గమనించడం జరిగిందని అన్నారు. ఇది ఐసిఎంఆర్‌ప్రస్తుతం ఆమోదించిన ఆర్‌టి-పిసిఆర్‌కిట్ల టాగా కనీసం 95 శాతం సున్నితత్వం, 99 శాతం ఖచ్చితత్వం కలిగి ఉ న్నట్టుఆయన తెలిపారు.ఎస్.ఆర్.ఎస్ సి.ఒవి-2 నిర్ధారణకు ఫెలూదా పేపర్ స్ట్రిప్ టెస్ట్ను సిఎస్ఐఆర్-ఐజిఐబి అభివృద్ధి చేసింది. దీనిని వాణిజ్య పరంగా ప్రారంభించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. ఈ కిట్ ను ఇప్పటికే డిపార్టమెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వారి నేషనల్ సెంటర్‌ఫర్‌బయోలాజికల్‌సైన్సెస్,బెంగళూరు ఆమోదించింది. “ ఇది ఎప్పటినుంచి అమలులోకి వస్తుందో ఖచ్చితమైన తేదీని చెప్పలేనుకాని, రాగల కొద్దివారాలలో అందుబాటులోకి వస్తుందని మాత్రం చెప్పగలను” అని ఆయన అన్నారు.
కోవిడ్ 19 వాక్సిన్‌ను ప్రభుత్వం మొత్తం ప్రజలలో ముందుగా ఎవరెవరికి వాక్సిన్ అవసరమో గుర్తించివారికి ప్రాధాన్యత ప్రాతిపదికన వాక్సిన్ అందుబాటులోకి తేవడం వంటి అంశాల గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ హర్షవర్ధన్,తొలినాళ్లలో కోవిడ్ 19 వాక్సిన్ తక్కువ పరిమాణంలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నామని, ఆయన వివరించారు భారత్ వంటి పెద్ద దేశంలో వాక్సిన్ అందుబాటు విషయంలో ప్రాధాన్యతలు నిర్ణయించడం కూడా కష్టమైనదేనని అన్నారు. వారు ఎదుర్కొంటున్న రిస్క్,వివిధ వర్గాలప్రజలో ఇతర అనారోగ్య సమస్యలు, కోవిడ్‌కేసులలో మరణాల రేటు, ఇంకా ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని అన్నారు. ఇండియా వివిధ రకాల వాక్సిన్‌ల అందుబాటు కోసం ఎదురు చూస్తున్నదని, వీటిలో కొన్ని కొన్ని ప్రత్యేక వయసుల వారికి సరిపోవచ్చని కొన్ని సరిపడకపోవచ్చని అన్నారు.
వాక్సిన్ పంపిణీకి సంబంధించి చిట్టచివరి మైలు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాక్సిన్ నుచేరవేసేందుకు అవసరమైన రవాణా ఇతర సదుపాయాలపై ప్రణాళికలు రూపొందించడం అత్యంత అవసరమని మంత్రి చెప్పారు. వాక్సిన్ కుసంబంధించి ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని వీటికి గల కారణాలను వారికి తెలియజెప్పాలని ఆయన అన్నారు.కోవిడ్ 19 వాక్సిన్ విషయంలో యువకులు, శ్రామికులకు ఆర్ధిక కారణాల రీత్యా ప్రాధాన్యతనివ్వబోతారంటూ వ్యాపిస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. కోవిడ్ 19 వాక్సిన్ కుసంబంధించిన ప్రాధాన్యత రెండు అంశాల ఆధారంగా జరుగుతుందన్నారు. ఒకటి వృత్తిపరంగా ఇన్‌ఫెక్షన్‌గురయ్యే ముప్పు కల వర్గాలు, రెండవది తీవ్రమైన వ్యాధి కారణంగా మరణాల సంఖ్య పెరిగే ముప్పు వంటి అంశాలని ఆయన తెలిపారు.
వాక్సిన్‌కు సంబంధించి ఒక డాక్టర్‌గా ఒకరుఅడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డాక్టర్‌హర్షవర్ధన్, తొలిదశ పరీక్షలు ఉత్పత్తి సురక్షితత్వానికి సంబంధించినవని, రెండోదశ పరీక్షలు ఇమ్యునోజెనిసిటినీ ప్రాధమికంగా,భద్రతను రెండో అంశంగా లెక్కిస్తాయని చెప్పారు.మూడో దశలో క్లినికల్‌పరీక్షలు భద్రత, ఇమ్యునోజెనిసిటీ సెకండరీ ఎండ్ పాయింట్లుగా అలాగే వాక్సిన్‌సమర్థ ప్రాథమిక ఎండ్ పాయింట్‌గా చూస్తారని అన్నారు.
కోవిడ్ వాక్సిన్‌ను ఇండియాలో అత్యవసరంగా వాడే అంశం గురించి ప్రస్తావిస్తూడాక్టర్ హర్షవర్ధన్,ఈ అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉందని అన్నారు. తగిన భద్రత, సమర్దతకు సంబంధించిన సమాచారం అత్యవసర వినియోగానికి అవసరమని, అలాగే పేషెంట్ భద్రతకు సంబంధించి వాక్సిన్ ఉపయోగానికి అనుమతులు అవసరమని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం అందుబాటును బట్టి తదుపరిచర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం ఇండియాలో పరీక్షిస్తున్న వాక్సిన్‌లు రెండు డోసుల, మూడుడోసుల వాక్సిన్‌లని ఆయన తెలిపారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్‌వాక్సిన్‌లు రెండు డోసుల వాక్సిన్‌లని, కాడిలా హెల్త్‌కేర్‌వాక్సిన్ మూడు డోసుల వాక్సిన్ అని ఆయన అన్నారు. ఇతర వాక్సిన్‌లు ప్రీ క్లినికల్ దశలలో ఉన్నాయని , డోస్‌లకు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ఇతర నోవెల్ కాండిడేట్లను కోవిడ్‌వాక్సిన్‌లుగా చేర్చుకోవలసిన అవసరం గురించి చెబుతూ,దేశంలో పెద్ద సంఖ్యలోని జనాభాను దృష్టిలో ఉంచుకుని ఒక వాక్సిన్‌గానీ లేదా ఒక వాక్సిన్ తయారీదారు కానీ మన దేశం మొత్తం అవసరాలను తీర్చలేరు. అదువల్ల పలు కోవిడ్ 19 వాక్సిన్‌లను ప్రవేశపెట్టే అంశం గురించి ఆలోచిస్తున్నాం. అని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ హర్షవర్ధన్, ప్రస్తుత పరిస్థితులు బహుళ వాక్సిన్ భాగస్వాముల అవసరాన్ని తెలియజేస్తున్నదని, దేశంలోని పెద్ద సంఖ్యలో గల జనాభాకు అందుబాటులోకి రావడానికి ఇది అవసరమని అన్నారు.ఒక ప్రత్యేక కంపెనీ నుంచి సింగిల్ వాక్సిన్ వాడకాన్ని నెగటివ్ దృష్టితో చూడకూడదని అన్నారు.
ఆరోగ్యం,భద్రతకు సంబంధించిన అంశాల విషయంలో వాటి వాస్తవాలను ఒకటికి రెండు సార్లు నిర్ధారణ చేసుకోకుండా అలాంటి సందేశాలను షేర్‌చేయవద్దని మంత్రి సూచించారు. మనం నోవెల్ కరోనా వైరస్‌న ఉంచి చాలా నేర్చుకున్నామని, చాలా వాక్సిన్‌కాండిడేట్లు రెండోదశ, మూడో దశ పరీక్షలకు వచ్చాయని, ఇలాంటి దశలో ,చాలా నకిలీ వార్తలు ,అవాస్తవ వార్తలు సామాజిక మాధ్యమాలలో ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. వీటిని కొందరు స్వార్థ ప్రయోజనాలతో ప్రచారంచేసే అవకాశం ఉందన్నారు.కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కింద గల ప్రెస్ ఇన్ఫర్మేషన్‌బ్యూరో లోని ఫాక్ట్ చెక్ యూనిట్ , క్రమం తప్పకుండా సామాజిక మాధ్యమాల ప్లాట్‌ఫారంలలో ఫేక్‌న్యూస్ ను పరిశీలిస్తున్నదని, ఫేక్‌న్యూస్ ఏవైనా తమ దృష్టికి వస్తే వాటిని పిఐబి ఫాక్ట్ చెక్ యూనిట్‌కుపంపాల్సిందిగా మంత్రి కోరారు.
తిరిగి ఇన్‌ఫెక్షన్ కు గురౌతున్న కేసుల గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ హర్షవర్ధన్, వివిధ రాష్ట్రాలలో అక్కడక్కడా ఒకసారి ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారు మళ్ళీ ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నకేసులు వస్తున్న అంశం గురించి ప్రస్తావిస్తూ, ఐసిఎంఆర్ సమాచారాన్నిజాగ్రత్తగా గమనించిచూసినపుడు వీటిలో చాలాకేసుల విషయంలో రెండోసారి ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్టు తప్పుగా నిర్ధారించినట్టు గమనించడం జరిగిందన్నారు. వాస్తవ ఇన్‌ఫెక్షన్‌ను, తప్పుగానిర్ధారించిన రీ ఇన్‌ఫెక్షన్‌ను జాగ్రత్తగా వేరుచేసి చూడడం అవసరమని ఆయన అన్నారు. వాస్తవానికి రీ ఇన్‌ఫెక్షన్ అంటే కోవిడ్‌నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తి కితాజాగా వైరస్ సోకడం అని, ఐసిఎంఆర్ ఇందుకు సంబంధించి వాస్తవాలను అర్థంచేసుకునేందుకు అధ్యయనం చేస్తున్నదని ఆయన అన్నారు. మరి కొద్ది వారాలలో ఈ ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా డాక్టర్లను కోల్పోవడం వ్యక్తిగతంగా ఎంతో బాధకలిగించే అంశమని అంటూ డాక్టర్ హర్షవర్ధన్, ఆరోగ్యసంరక్షకులు కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ బారినపడకుండా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను సవివరంగా వివరించారు. రాష్ట్రాలలో కోవిడ్ కేసులు చూసే వారికోసం పిపిఇ కిట్లు, ఎన్-95 మాస్కులు, హెచ్.సి.క్యు,ప్రొఫిలాక్సిస్ వంటివాటిని కి అందుబాటులో ఉంచడం జరిగిందని
డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఢిల్లీ ఎయిమ్స్ సంస్థ రాష్ట్రస్థాయి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సుతో కలిసి ఇన్‌ఫెక్షన్, నియంత్రణ, నిరోధం వంటి విషయాలపై క్రమం తప్పకుండా వెబినార్లు నిర్వహిస్తోంది. ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో శిక్షణ మాడ్యూళ్లను అందుబాటులో ఉంచారు. అలాగే ఐజిఒటి- దీక్షా ప్లాట్‌ఫాం లో ఇన్‌ఫెక్షన్, నియంత్రణ, నిరోధానికి సంబందించిన విధానాలను పొందుపరచడం జరిగింది. కోవిడ్ పై పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు వ్యక్తిగత రక్షణ పరికరాలు, నాన్‌కోవిడ్ ప్రాంతాలలోని ఆరోగ్య సదుపాయాలు,క్షేత్రస్థాయిలో హేతుబద్ధమైన వాడకానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.
మన కరోనా వారియర్లను రక్షించుకునేందుకు తాను వ్యక్తిగతంగా అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులు,ఇతర ఆరోగ్యశాఖ అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నట్టు డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.
ఐసొలేషన్ లోని ప్రజల వైద్య అవసరాలకు స్పందించడం గురించి ప్రస్తావిస్తూ , డాక్టర్‌హర్షవర్ధన్, ఇండియాలో టెలిమెడిసిన్‌సేవలను ఆమోదించడంలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని, దీనివల్ల కరోనా మహమ్మారి సమయంలో పేషెంట్లకు ప్రభుత్వం సరైన చికిత్స అందించడానికి వీలుకలగడమే కాక, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఉపకరించిందని ఆయన తెలిపారు.ఈ ప్రోత్సాహకరమైన పురోగతి గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ హర్షవర్ధన్,ఈ సంజీవని కి వివిధ రాష్ట్రప్రభుత్వ ఆరోగ్య శాఖలకుచెందిన 12,000మంది ప్రాక్టీషనర్లు అనుసంధానమై ఉన్నారని వారిసేవలను దేశంలోని 26 రాష్ట్రాలలోని 510 జిల్లాలవారు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు.తొలి లక్ష సంప్రదింపులకు ఈ ప్లాట్‌ఫాంపై 3 నెలల కాలం పట్టగా , చివరి లక్ష సంప్రదింపులకు పట్టుమని 3 వారాల వ్యవధి పట్టిందని ఇదోక గొప్ప విజయమని ఆయన అన్నారు.
సండే సంవాద్ సందర్భంగా సామాజిక మాధ్యమాల వారితో మాట్లాడుతూ డాక్టర్‌హర్షవర్ధన్ కోవిడ్ పై పోరాటానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తొలివిడత కింద భారత ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టుతెలిపారు. కేవలం మూడు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలు తమకుకేటాయించిన మొత్తాన్ని ఖర్చచేశాయని ఆయన తెలిపారు. మహారాష్ట్ర తమకు కేటాయించిన గ్రాంటును 42.5 శాతం మాత్రమే ఖర్చుచేయగా, చండీఘడ్ 47.8 శాతం, ఢిల్లీ 75.4 శాతం ఖర్చు చేశాయని ఆయన తెలిపారు.
కోవిడ్ -19కు చికిత్స అందించడంలో ఆయుష్ ఫార్ములేషన్ల సమర్ధతపై వస్తున్నవిమర్శల గురించి ప్రస్తావిస్తూ,డాక్టర్ హర్షవర్ధన్, శాల్యుటోజెనిసిస్ కాన్సెప్ట్ గురించి వివరించారు. ఈ ఫార్ములేషన్లు పేషెంట్లు సంపూర్ణంగా కోలుకోవడం లక్ష్యం గలవని అన్నారు. సిలికో అధ్యయనాలనుంచి శాస్త్రీయ ఆధారాలు,ఇందుకు సంబంధించిన సమాచారం గురించి ప్రస్తావిస్తూ మంత్రి,గుడిచి, అశ్వగంధ,గుడుచి, పిప్పలి కాంబినేషన్,ఆయుష్ 64 వంటివి ఇమ్యునో మాడ్యులేటరీ, యాంటీ వైరల్, యాంటీ పైరటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుకలిగి ఉన్నాయని తేలిందని తెలిపారు. ఈ పరిష్కరాల ప్రభావం ప్రొఫిలాక్సిస్, సెకండరీ ప్రివెన్షన్, కోవిడ్ బారిన పడిన వారికి సంబంధించిన విషయంలో వాడకానికి సంబంధించి ఇంటర్ డిసిప్లినరీ టాస్క్‌ఫొర్సుసూచన మేరకు అధ్యయనాలు జరుగుతున్నట్టు చెప్పారు.
చ్యవనప్రాశ్ వల్ల ప్రయోజనాల గురించి తెలియజేస్తూ డాక్టర్ హర్షవర్ధన్, క్లినికల్ అధ్యయనాల వల్ల లభ్యమైన సమాచారం ప్రకారం, చ్యవన్‌ప్రాష్ క్రమంతప్పకుండా నిర్ణీత కాలం వాడుతున్నవారి మొత్తం ఆరోగ్యంలో మెరగుదల కనిపించినట్టు తెలిపారు. అలాగే వీరి వ్యాధి నిరోధకశక్తి, మెరుగుపడినట్టు తెలిపారు. అయితే ఇందులో చక్కెర ముఖ్యమైన పదార్ధం కనుక వినియోగదారులు మార్కెట్‌లో షుగర్ లేని చ్వవన్‌ప్రాష్‌ను ఎంపికచేసుకోవచ్చని అన్నారు.
సండే సంవాద్ 5 వ ఎపిసోడ్‌ను చూడడానికి దయచేసి కింది లింక్‌లపై క్లిక్ చేయండి :
Twitter: https://twitter.com/drharshvardhan/status/1315196225805717505?s=20
Facebook: https://www.facebook.com/watch/?v=1045439492574995
Youtube: https://www.youtube.com/watch?v=V8M-ujWIqoA
DHV App: http://app.drharshvardhan.com/download
****
(Release ID: 1663624)
Visitor Counter : 235