భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం, రాగల 24 గంటలలో ఇది మరింత తీవ్రమై వాయుగుండంగా మారే అవకాశం
దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,రాయలసీమలలో అక్కడక్కడా ,కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో భారీనుంచిఅతిభారీ వర్షాలు కురిసే అవకాశం
పశ్చిమ మధ్య బంగాళాఖాతం,పొరుగున ఉన్న వాయవ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం, ఒడిషా,
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి కోస్తాప్రాంతంలో, గల్ప్ ఆఫ్‌మన్నార్ లలో సముద్రం అల్లకల్లోలం నుంచి తీవ్ర అల్లకల్లోలంగా ఉంటుంది.
Posted On:
11 OCT 2020 10:21AM by PIB Hyderabad
భారత వాతావరణ విభాగం (ఐఎండి)కి చెందిన తుపానుహెచ్చరిక కేంద్రం సమాచారం ప్రకారం:
తాజా ఉపగ్రహ చిత్రాలు,నౌకలు,వాతావరణ బెలూన్ల నుంచి సమాచారాన్ని పరిశీలించి చూసినపుడు నిన్న స్పష్టంగా తూర్పు మధ్యబంగాళాఖాతం,పొరుగున ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద వాయుగుండంగా మారి 11 అక్టోబర్ 2020 ఉదయం 5 గంటల సమయంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తరాన 15.3 డిగ్రీలు, తూర్పున 86.5 డిగ్రీల రేఖాంశం వద్ద ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా, కాకినాడకు 490 కిలోమీటర్ల ఆగ్నేయంగా,ఆంధ్రప్రదేశ్‌లోనినర్సాపూర్‌కు 520 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమైఉంది. ఇది మరింత బలపడి రాగల 24 గంటలలో తీవ్ర తుపానుగా మారేఅవకాశంఉంది.
ఇది పశ్చిమ వాయవ్యదిశగా కదిలి నర్సాపూర్, విశాఖపట్నం తీరం మధ్య 12 అక్టోబర్2020 రాత్రి తీరం దాటే అవకాశంఉంది.
***
(Release ID: 1663497)
Visitor Counter : 172