రైల్వే మంత్రిత్వ శాఖ

2020-21 చివ‌రి నాటికి ఆటోమొబైల్ లోడింగ్‌లో 20 శాతం మోడ‌ల్‌షేర్‌, 2023-24 నాటికి 30శాతం మోడ‌ల్‌షేర్ సాధించేందుకు ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్న రైల్వే

కేంద్ర రైల్వేలు, వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌లు, వినియోగదారుల వ్య‌వ‌హారాలు,ఆహారం, ప్ర‌జాపంపిణీ శాఖ‌ల మంత్రి శ్రీ పియూష్‌గోయ‌ల్‌, ఆటోమొబైల్‌ప‌రిశ్ర‌మ నాయ‌కుల‌తో స‌మావేశం కావ‌డం, రైల్వేల ద్వారా ఆటోమొబైల్‌లోడింగ్‌కు మ‌రింత ఊతం ఇవ్వ‌నుంది.

సొసైటీ ఆఫ్ ఇండియ‌న్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చ‌రర్లు (ఎస్‌.ఐ.ఎ.ఎం), ఆటోమోటివ్ టైర్ మాన్యుఫాక్చ‌రర్స్ అసోసియేష‌న్‌(ఎటిఎంఎ), ల‌కు సంబంధించిన అన్నిస‌మ‌స్య‌ల‌ను అత్యున్న‌త ప్రాధాన్య‌త ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించేందుకు భార‌తీయ రైల్వే హామీ.

ఆటోమొబైల్ ట్రాఫిక్ కు సంబంధించి ప్ర‌స్తుతం టెర్మిన‌ల్‌చార్జీల నుంచి పూర్తి మిన‌హాయింపు ఉంది.
2020లో ఆటోమొబైల్ ట్రాఫిక్‌కు 7 టెర్మిన‌ళ్లు ప్రారంభం

సోసైటీ ఆఫ్ ఇండియ‌న్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్‌(ఎస్.ఐ.ఎ.ఎం), టాటా మోటార్స్‌, హుండాయ్‌మోటార్స్‌, ఫోర్డ్ మోటార్స్‌, మ‌హీంద్రా, మ‌హీంద్రా, హోండా ఇండియా, మారుతి సుజికి లిమిటెడ్‌, ఆటోమొబైల్ ఫ్రైట్ ట్రెయిన్ ఆప‌రేట‌ర్స్‌(ఎఎఫ్‌టిఒలు),ఆటోమోటివ్ టైర్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ అసోసియేష‌న్ (ఎటిఎంఎ) ల ప్ర‌తినిధులు రైల్వే శాఖ చొర‌వను అభినందించారు.

ఇండియ‌న్ రైల్వే గ‌త ఏడాది మొత్తం 731 రేక్‌లు లోడ్ చేయ

Posted On: 10 OCT 2020 6:15PM by PIB Hyderabad

రైల్వే ద్వారా ఆటోమొబైల్ లోడింగ్‌ను గ‌ణ‌నీయంగా పెంచేందుకు, కేంద్ర రైల్వే, వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌లు, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ప్ర‌జా పంపిణీ  శాఖ‌ల మంత్రి శ్రీ పియూష్ గోయ‌ల్ ఆటోమొబైల్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో స‌మావేశ‌మయ్యారు.

ఎస్‌.ఐ.ఎ.ఎం(సొసైటీ ఆఫ్ ఇండియ‌న్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చ‌రర్స్‌), టాటా మోటార్స్‌, హుండ‌య్ మోటార్స్‌, ఫోర్డ్ మోటార్స్‌, మ‌హీంద్రా, మ‌హీంద్రా, హోండా ఇండియా, మారుతీ సుజుకి లిమిటెడ్‌, ఆటోమొబైల్‌ఫ్రైట్ ట్రెయిన్ ఆప‌రేట‌ర్స్ (ఎఎఫ్‌టిఒ), ఆటోమోటివ్ టైర్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ అసోసియేష‌న్ (ఎటిఎంఎ) ల‌కు చెందిన ప్ర‌తినిధులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. వీరు రైల్వే ల చొర‌వ‌ను అభినందించారు. భార‌తీయ రైల్వేతో క‌లిసి ఆటోమొబైల్ ఉత్ప‌త్తుల‌ను రైల్వేద్వారా ర‌వాణా చేసేందుకు  వీలు క‌ల్పించే చ‌ర్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు తె లిపారు.
భార‌తీయ రైల్వే ఆటోమొబైల్స్ ర‌వాణాతో నూత‌న శిఖ‌రాల‌ను అధిరోహించ‌నుంది. 2013-14లో రైల్వే ద్వారా ర‌వాణా అయిన ఆటోమోబైల్ ఉత్ప‌త్తులుకేవ‌లం 429 రేక్‌లు మాత్ర‌మే. దీనిని 2019-20 నాటికి 1595 రేక్‌ల‌కు పెంచ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రం (ఏప్రిల్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు) తొలి ఆరునెల‌ల కాలంలో నే భార‌తీయ రైల్వే 836 రేక్‌ల ఆటోమొబైల్ ఉత్ప‌త్తుల‌ను లోడ్‌చేయ‌గా , ఇంత‌కు ముందు సంవ‌త్స‌రం 731 రేక్ ల లోడింగ్ జ‌రిగింది.( మొద‌టి రెండు నెల‌ల్లో కేవ‌లం నామ‌మాత్ర లోడింగ్‌జ‌రిగినప్ప‌టికీ )
రైల్వేలు 2021-22 చివ‌రి నాటికి 20 శాతం మోడ‌ల్ షేర్‌నుసాధించాలని, అలాగే 2023-24 నాటికి 30 శాతం మోడ‌ల్ షేర్ సాధించాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకుంది.
ఆటోమోబైల్ లోడింగ్‌ను ప్రోత్స‌హించేందుకు రైల్వేలు తీసుకున్న చ‌ర్య‌ల‌ను,  రైల్వే లోడింగ్ పెరుగుద‌ల‌కు కార‌ణాల‌ను ఈ స‌మావేశంలో పాల్గొన్న వారికి వివ‌రించి, మ‌రింత లోడింగ్‌ను రైల్వే ద్వారా చేయాల్సిందిగా వారిని కోర‌డం జ‌రిగింది.
ఆటోమొబైల్ లోడింగ్‌కు తీసుకున్న చ‌ర్య‌లు:
(ఎ) బిసిఎసిబిఎం రేక్‌ల‌కుసంబంధించి హాలేజ్ చార్జీల‌ను 2013 మే నుంచి స‌వ‌రించ‌లేదు.
(బి) ఎన్‌.ఎం.జికి స‌ర‌కు ర‌వాణా చార్జీలు 2018 మే నుంచి స‌వ‌రించ‌లేదు.
(సి) ఎన్‌.ఎం.జి రేక్‌ల‌ను (ఏప్రిల్ 1 నాటికి) 30 నుంచి 42 కు పెంపు
(డి) ఎన్‌.ఎం.జి రేక్‌ల‌లో రెండు గ‌మ్య‌స్థానాల‌కు లోడింగ్‌కు అనుమ‌తి
(ఇ) ఆటోమొబైల్ ఎగుమ‌తుల‌కు అనుమ‌తి
          (1) బంగ్లాదేశ్‌కు ఎన్‌.ఎం.జి రేక్‌ల‌లో ర‌వాణా ప్రారంభం
          (2) నౌత‌న్వా టెర్మినల్ (ఎన్‌.ఇ.రైల్వే) ద్వారా నేపాల్‌కు ర‌వాణా ప్రారంభం
ఎఫ్‌) ఆటోమొబైల్ లోడింగ్‌కు ఏడు కొత్త టెర్మిన‌ళ్లు ప్రారంభం
చిత్‌పూర్‌(ఇ.ఆర్‌), పెనుకొండ‌(ఎస్‌.డ‌బ్ల్యు.ఆర్‌), న‌స్ర‌లా (ఎన్‌.ఆర్‌), నేపాల్‌కు ర‌వాణా కోసంనౌత‌న్వా , (ఎన్‌.ఇ.ఆర్‌), స‌ల్‌చ‌పారా, ఫ‌ర్‌కాటింగ్‌,న్యూ తిన్‌సుకియా (  ఎన్‌.ఎఫ్‌.ఆర్‌)
 (జి) ప్ర‌స్తుతం సుమారు 52 రైల్వే టెర్మిన‌ళ్లు అందుబాటులో ఉన్నాయి.
(హెచ్‌) అన్ని ప్రైవేట్ సైడింగ్‌లు, పిఎఫ్‌టిలు, ఐసిడిలు ఆటోమొబైల్ ర‌వాణాను చేప‌ట్ట‌వ‌చ్చు.

త‌మ‌కు రైల్వే శాఖ అందిస్తున్న స‌హాయానికి, మ‌ద్ద‌తుకు ఆటోమొబైల్ ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధులు రైల్వేశాఖ‌ను ప్ర‌శంసించారు. రైల్వే ద్వారా మ‌రింత పెద్ద ఎత్తున లోడింగ్‌జ‌రిపేందుకు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టు వారు స్ఫష్టం చేశారు.
ఆటోమొబైల్ రంగం ట్రాఫిక్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా మ‌రిన్ని టెర్మిన‌ళ్లు చ‌రోడి (డ‌బ్ల్యు.ఆర్‌), బ‌క్షి క త‌లాబ్‌(ఎన్‌.ఇ.ఆర్‌), మెస్రా (ఇసిఆర్‌),ల‌లో ప్రారంభించ‌డం జ‌రుగుతుంద‌ని ఆటోమొబైల్ రంగ ప్ర‌తినిధుల‌కు తెలియ‌జేయ‌డం జ‌రిగింది.  బంగ్లాదేశ్ కు ఎ గుమ‌తుల‌కు సంబంధించి బంగ్లాదేశ్ రైల్వేతో స‌మ‌న్వ‌యంతో బిసిఎసిబిఎం రేక్‌ల‌లో బంగ్లాదేశ్‌కు ఎగుమ‌తుల‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయ‌నున్న‌ట్టుతెలిపారు. అలాగే ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌తో సంప్ర‌దించి కొత్త‌పొడ‌వైన ఆటో కారియ‌ర్ వ్యాగ‌న్ల‌ను ( డ‌బుల్ స్ట‌క్ డ్వార్ఫ్ కంటైన‌ర్ల‌ను) ఆర్‌.డిఎస్‌.ఒ అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు రైల్వేశాఖ తెలిపింది.
 ఆటోమొబైల్ ర‌వాణాను రైల్వే ద్వారా పెంచేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల స‌హాయాన్ని వారికి అందించ‌నున్న‌ట్టు, వారికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప్రాధాన్య‌తా ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించ‌నున్న‌ట్టు స‌మావేశంలో పాల్గొన్న వారికి హామీఇవ్వ‌డం జ‌రిగింది.

***


(Release ID: 1663454) Visitor Counter : 157