కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

అక్టోబర్ 9 నుండి 15 వరకు జరిగే ఇండియా పోస్ట్ జాతీయ పోస్టల్ వారోత్సవాలు ప్రారంభం

తపాలా బిళ్ళలు సేకరించేవారికి వర్చువల్ క్యాంప్‌లు / వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు, , కొత్త సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, ఐపిపిబి అకౌంట్లు తెరుస్తున్నారు, , ఆధార్ సీడింగ్ మరియు సర్కిల్ స్థాయిలో సంబంధిత రోజులలో పిఎల్‌ఐ / ఆర్‌పిఎల్‌ఐ ప్రతిపాదనలు పొందుతున్నారు.

Posted On: 09 OCT 2020 5:24PM by PIB Hyderabad

ఇండియా పోస్ట్ జాతీయ పోస్టల్ వారోత్సవాలను ప్రారంభించింది, ప్రతి సంవత్సరం అక్టోబర్ 9 న జరుపుకునే ప్రపంచ పోస్ట్ డే, 1874 లో బెర్న్‌లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యుపియు) స్థాపన రోజును వార్షికోత్సవంగా ఇది జరుపుకుంటున్నారు. ప్రపంచ తపాలా దినోత్సవం ఉద్దేశ్యం ప్రజల మరియు వ్యాపారాల రోజువారీ జీవితంలో తపాలా రంగం యొక్క పాత్ర మరియు దేశాల సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి దాని సహకారం గురించి అవగాహన కల్పించడం. ఒక అడుగు ముందుకు వేస్తూ, జాతీయ స్థాయిలో ప్రజలలో మరియు మీడియాలో దాని పాత్ర మరియు కార్యకలాపాల గురించి విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో జాతీయ పోస్టల్ వీక్  కార్యకలాపాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్టులు జరుపుకుంటాయి. 

పోస్టల్ దినోత్సవం/జాతీయ పోస్టల్ వారం షెడ్యూల్:

 

తేదీ 

రోజు 

వివరణ 

9 అక్టోబర్ 2020

శుక్రవారం 

ప్రపంచ పోస్ట్ దినోత్సవం 

10 అక్టోబర్    2020

శనివారం 

బ్యాంకింగ్ దినోత్సవం 

12 అక్టోబర్    2020

సోమవారం 

పిఎల్ఐ దినోత్సవం 

13 అక్టోబర్   2020

మంగళవరం 

తపాలా బిళ్ళల సేకరణ దినోత్సవం 

14 అక్టోబర్  2020

బుధవారం 

వ్యాపార అభివృద్ధి దినోత్సవం 

15 అక్టోబర్  2020

గురువారం 

మెయిల్స్ దినోత్సవం 

 

సర్కిల్ స్థాయిలో కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టారు.  


(Release ID: 1663328) Visitor Counter : 210