రైల్వే మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19కి వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రజా ఉద్యమంలోకి దూకిన భారతీయ రైల్వేలు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైల్వే అధికారులు, సిబ్బంది చేత కోవిడ్ ప్రతిజ్ఞ చేయించిన రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్
కోవిడ్ 19 ప్రోటోకాళ్ళ గురించి సాధారణ ప్రజానీకాన్ని చైతన్యపరచవలసిందిగా అధికారులను, సిబ్బందిని ఆదేశించిన రైల్వే బోర్్డ చైర్మన్
జన ఆందోళనలో తొలి రోజున ప్రతిజ్ఞ చేసిన వివిధ జోన్లు, డివిజన్లు, పిఎస్‌యులకు చెందిన 5,41,087 మంది రైల్వే సిబ్బంది
Posted On:
09 OCT 2020 7:09PM by PIB Hyderabad
కోవిడ్ 19కు వ్యతిరేకంగా భారతీయ రైల్వేలు ప్రజా ఉద్యమమైన జన ఆందోళనలో చేరాయి. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రజా ఉద్యమ ప్రారంభానంతరం రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రైల్వే అధికారులు, సిబ్బంది చేత కోవిడ్ ప్రతిజ్ఞను చేయించారు. జోనల్ రైల్వేల జనరల్ మేనేజర్లు, డివిజినల్ రైల్వే మేనేజర్లు, ప్రభుత్వ రంగ సంస్థల సిఎండిలు, సీనియర్ రైల్వే అధికారులు ఈ కార్యక్రమంతో అనుసంధానం అయ్యారు.
దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రజా ఉద్యమంలో దూకుడుతో పాల్గొనేందుకు ముందుకు రావలసిందిగా రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
తమ స్టేషన్లు / కార్యాలయాల వద్ద సాధారణ ప్రజలలో కోవిడ్ ప్రోటోకాల్ గురించి చైతన్యం తెచ్చే లక్ష్యంతో పని చేయవలసిందిగా జోనల్, డివిజనల్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మహమ్మారిని ఓడించేందుకు ఏం చేయాలో, ఏం చేయకూడదో రైల్వే ఉద్యోగులందరూ తెలుసుకుని ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల జిఎంలు, డిఆర్ ఎంలు, సిఎండిలు పోస్టర్లను, బ్యానర్లను రైల్వే స్టేషన్లలో, ఆవరణలో, రైళ్ళలో, రైల్వే కార్యాలయాలలో ఉంచాలని కోరారు. సోషల్ మీడియా వేదికల ద్వారా కోవిడ్‌కు సంబంధించిన సమాచారన్ని వ్యాప్తి చేయాలన్నారు.
ప్రజా ఉద్యమంలో తొలి రోజున వివిధ జోన్లు, డివిజన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 5,41, 087 మంది రైల్వే ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేలకు చెందిన 2452 రైల్వే స్టేషన్లలో, 273 రైళ్ళలో, 847 కార్యాలయాల్లో బానర్లు, పోస్టర్లు అతికించారు. అలాగే, కోవిడ్ 19 గురించి అవగాహన కల్పించేందుకు పబ్లిక్ అనౌన్స్‌మెంట్ ద్వారా 2060 స్టేషన్లలో, 95 రైళ్ళల్లో, 138 రైల్వే కార్యాలయాల్లో పాటను ప్రసారం చేశారు.
****
(Release ID: 1663276)
Visitor Counter : 186