వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖలో శ్రీ రామ్ విలాస్ పాస్వాన్ సంతాప సమావేశం

Posted On: 09 OCT 2020 5:26PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ రామ్ విలాస్ పాస్వాన్ ఆక‌స్మిక మ‌ర‌ణం నేప‌థ్యంలో ఇక్క‌డ న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో సంతాప స‌మావేశం నిర్వ‌హించారు. కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖల‌కు చెందిన  అధికారులు, సిబ్బంది ఈ స‌మావేశంలో పాల్గొని త‌మ సంతాపం తెలియ‌జేశారు.
కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి లీనా టాండన్,ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సుధాన్షూ పాండే మంత్రిత్వ శాఖల‌కు చెందిన  ఇతర ఉన్నతాధికారులు సంతాప సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా  కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్ర‌జా పంపిణీ శాఖ‌ల‌ మంత్రిగా శ్రీ రామ్ విలాస్ పాస్వాన్ చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. శ్రీ‌రామ్ విలాస్ పాస్వాన్ ఆత్మ‌కు శాంతి క‌లగాల‌ని, దుఃఖంలో మునిగి ఉన్న శ్రీ పాస్వాన్ కుంటుబానికి ఈ క‌ఠిన స‌మ‌యంలో అవ‌స‌ర‌మైన‌ ధైర్యాన్ని క‌ల్పించాల‌ని.. ఈ స‌మావేశంలో పాల్గొన్న వారు ఆ భ‌గ‌వంతుడ్ని ప్రార్థించారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల‌ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాస్వాన్ గురువారం ( అక్టోబర్ 8న) న్యూ ఢిల్లీలో కన్నుమూసిన విష‌యం విదిత‌మే.

***(Release ID: 1663271) Visitor Counter : 139