శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
విద్యర్ధినులకు స్టెమ్ రంగంలో వృత్తిపరమైన అవకాశాలను సృష్టించేందుకు ఐబిఎంతో డిఎస్‌టి భాగస్వామ్యం
డిఎస్‌టి చొరవలైన - విజ్ఞాన్ జ్యోతి, ఎంగేజ్ విత్ సైన్స్ (విజ్ఞాన్ ప్రసార్)లను వృద్ధి చేసేందుకు భాగస్వామ్యాలు
ఎంగేజ్ విత్ సైన్స్ పారస్పరిక విద్యా వేదికను వృద్ధి చేయడం, విద్యను సమకాలీన అవసరాలకు తగినట్టు చేయడమే కాక, దేశ యువతలో శాస్త్రీయ స్ఫూర్తిని పెంచుతుంది: డిఎస్‌టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ
Posted On:
09 OCT 2020 4:10PM by PIB Hyderabad
ప్రతిభావంతమైన ఆడపిల్లలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమెటిక్్స (STEM) పట్ల ఆసక్తిని పెంచందుకు, ఆ రంగాలలో అవకాశాలను విస్తరింపచేసి, అధ్యయనం మరింత సమకాలీనంగా ఉండేలా చూసేందుకు, దేశ యువతలో శాస్త్రీయ స్ఫూర్తిని పెంచేందుకు, ఐబిఎం భాగస్వామ్యంతో ఒక వేదికను శాస్త్ర సాంకేతిక శాఖ ఏర్పరచనుంది.
శాస్త్ర, సాంకేతిక శాఖ (డిఎస్‌టి) చొరవలైన విజ్ఞాన జ్యోతి, ఎంగేజ్ విత్ సైన్స్ (విజ్ఞాన్ ప్రసార్)ను వృద్ధి చేసి యువతకు అందించేందుకు, డిఎస్‌టి, ఐబిఎం ఇండియా తమ సహకారాన్ని, భాగస్వామ్యాన్నిశుక్రవారం నాడు ప్రకటించాయి.
ఉన్నత విద్యలోభాగంగా స్టెమ్ విద్యను కొనసాగించడానికి 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతిభావంతమైన ఆడపిల్లలకు సమానావకాశాలను సృష్టించి, ముఖ్యంగా, ఆడపిల్లలు తక్కువగా ఉన్న ఈ రంగంలోని ఉన్నత కళాశాలల్లో వారికి అవకాశాలను కల్పించడానికి, ఆడపిల్లలు స్టెమ్ అధ్యయనాన్ని చేసి, వారు స్టెమ్ కెరీర్లను చేపట్టేలా స్ఫూర్తినిచ్చే కార్యక్రమమే విజ్ఞాన జ్యోతి.
సైన్సులో ఆసక్తిని వృద్ధి చేసి , విద్యార్ధులు, టీచర్లు, శాస్త్రవేత్తలతో ఒక సమాజాన్ని సృష్టించి, హైస్కూల్ విద్యార్ధులను ఉన్నత విద్యా సంస్థలతో అనుసంధానం చేసే చొరవే విజ్ఞాన్ ప్రసార్ లోని ఎంగేజ్ విత్ సైన్్స లక్ష్యం.
ఐబిఎంతో ఈ భాగస్వామ్యం డిఎస్‌టికి, విజ్ఞాన్ ప్రసార్‌కు సంబంధించిన ఈ కార్యక్రమాలు విద్యార్ధులు, టీచర్లకు పెద్ద స్థాయిలో పారస్పరిక పద్ధతిలో చేరుతాయి. పారస్పరిక అధ్యయన వేదిక ఎంగేజ్ విత్ సైన్్స - విద్య సమకాలీనంగా ఉండేలా చూడడం, దేశ యువతలో శాస్త్రీయ స్ఫూర్తి పెంపొందేలా చూడటమే కాక, క్లాస్ రూముకు ఆవల కూడా మరింత విజ్ఞానం అవసరమైన స్కూలు విద్యార్ధులను ప్రత్యక్షంగా సంబోధించి, పారస్పరిక అధ్యయన పద్ధతి ద్వారా లోతుగా విసయాన్ని తెలుసుకునేలా తోడ్పడి, అనవసరమైన వాటి నుంచి అవసరమైన వాటిని వేరు చేసేందుకు సహాయపడుతుందని, డిఎస్‌టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ ఈ భాగస్వామ్యాన్ని ప్రకటిస్తూ వివరించారు.
శాంప్లింగ్ కు విద్యార్ధులు ప్రతిస్పందిస్తూ, అందులో పాల్గొంటూ, డిజిటల్ పరికరాలను ఉపయోగిస్తూ క్లౌడ్, బిగ్ డాటా, తదితరాలు సహా శాస్త్ర సాంకేతిక విషయాంశాలను చురుకుగా అర్థం చేసుకునేందుకు తోడ్పడే శాస్త్రీయ వేదిక ఇది అని ఆయన అన్నారు.
ఇంజినీరింగ్, సాంకేతిక విజ్ఞాన రంగాలకు సంబంధించిన ఉన్నత విద్యలో అతితక్కువ మంది మహిళా ప్రాతినిధ్యం ఉండడానికి కారణమైన బహుళ సమస్యలను పరిష్కరించడానికి, వారిలో ఆత్మవిశ్వాసం , ఈ రంగం పట్ల ఆసక్తిని పెంచేందుకు విజ్ఞాన్ జ్యోతి దృష్టిపెడుతుంది. రానున్న ఐదేళ్ళల్లో, ఇంజినీరింగ్, టెక్నాలజీ విషయాంశాలలో మొత్తం విద్యార్ధులలో మూడొంతుల మంది ఆడపిల్లలు చేరేలా చూడాలన్నదే తమ లక్ష్యమని, ప్రొఫెసర్ అశుతోష్ శర్మ పేర్కొన్నారు.
స్టెమ్ రంగాలకు సంబంధించి ఉన్నత విద్యను, కెరీర్‌ను చేపట్టేలా విద్యర్ధినులకు స్ఫూర్తినిచ్చేందుకు డిఎస్‌టి 2019లో విజ్ఞాన్ జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. సమీపంలో ఉన్న శాస్త్రీయ సంస్థలు, సైన్స్ శిబిరాలు, ప్రముఖ మహిళా శాస్త్రవేత్తల ఉపన్యాసాలకు వెళ్ళడానికి, కెరీర్ కౌన్సిలింగ్ వంటి వాటికి ఈ కార్యక్రమం స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని జవహర్ నవోదయ విద్యాలయాలు (జెఎన్‌వి) 58 జిల్లాలలో, 2900 మంది విద్యార్ధుల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నాయి. ఐబిఎంతో భాగస్వామ్యం ప్రస్తుత కార్యకలాపాలను బలోపేతం చేయడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలు దీనిని అమలు చేసేలా విస్తరింపచేసేందుకు తావిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఐబిఎం ఇండియా సంస్థలో పని చేసే మహిళా సాంకేతిక నిపుణులు విద్యార్ధినులకు స్ఫూర్తినిచ్చి, వారు స్టెమ్ స్రవంతులలో కెరీర్‌ను మలచుకునేలా తోడ్పడతారు. మరింతమంది విద్యార్ధినులను సాంకేతిక రంగంలోకి తీసుకువచ్చి, వారి సంఖ్యను పెంచాలన్న డిఎస్‌టి చొరవను ఇది బలోపేతం చేస్తుంది.
స్టెం విద్యలో జెండర్ బహుముఖతను ప్రోత్సహించి, వైవిధ్యమైన ప్రతిభను పెంచేందుకు కొత్త మార్గాలను సృష్టించడం ప్రస్తుతం అవసరమని, 10+2 చదువుతున్న విద్యర్ధినులకు తమ స్టెమ్ కార్యక్రమాన్ని విస్తరించేందుకు డిఎస్‌టితో తమ భాగస్వామ్యం తోడ్పడుతుందని, ఐబిఎం ఇండియా ఎండి సందీప్ పటేల్ చెప్పారు. శాస్త్రీయమైన ఆలోచనలు చేసేవారిని, సమస్యా పరిష్కారం చేసేవారు, నూతన తరం ఆవిష్కర్తలకు స్ఫూర్తినిచ్చే ఎంఎఎన్ఎకె (MANAK (Million Minds Augmenting National Aspirations and Knowledge) అవార్డుల ద్వారా - ఆరోగ్యకరమైన స్టెమ్ వాతావరణాన్నిసృష్టించాలని డిఎస్‌టి, ఐబిఎం లక్ష్యిస్తున్నాయి. పాఠశాల విద్యార్ధుల ద్వారా సైన్స్‌లో పాదుకొన్న మిలియన్ ఐడియాలను నిర్మించాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యా పర్యావరణ వ్యవస్థలో సైన్స్ & టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసి, మరింతగా సమ్మిళతం చేసేందుకు స్వల్పకాలిక కోర్సులు, వర్క్‌షాపులు, మార్గదర్శనంతో పాటుగా భారతదేశంలోని టీచర్లు, విద్యార్ధులకు ఆన్‌లైన్ సైన్స్ కంటెంట్ కమ్యూనికేషన్‌ను అందించేందుకు డిఎస్‌టి, ఐబిఎం ఇండియా కలిసి పని చేస్తాయి.
ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఎంగేజ్ విత్ సైన్స్ సహా వివిధ వ్యూహాత్మక చొరవల ద్వారా భారతీయ సైన్స్‌కు మరింత ప్రాచుర్యం కల్పించే అజెండాను ముందుకు తీసుకువెళ్ళేందుకు డిఎస్‌టి ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తితో పని చేస్తున్న విజ్ఞాన్ ప్రసార్‌తో కలిసి ఐబిఎం పని చేస్తుంది. హైస్కూలు విద్యార్ధులు సైన్స్ &టెక్నాలజీ రంగాలను వృత్తిపరంగా ఎంచుకునేందుకు స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు ఇండియా సైన్స్ ఓవర్-ది-టాప్ (ఒటిటి) వేదికకు అదనంగా పారస్పరిక వేదికను నిర్మించనున్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా, విద్యార్ధులకు వర్్క షాప్‌లు, సెమినార్లు, విద్యర్ధులకు మార్గదర్శనం చేసేందుకు తమ నైపుణ్యాలను వినియోగించడం సహా, రోజువారీ కార్యకలాపాలను ఐబిఎం నిర్వహిస్తుంది. విద్యార్ధులు ఇంటరాక్ట్ అయ్యి, కార్యక్రమంలో పాల్గొని, క్లౌడ్, బిగ్ డాటా, తదితరాలతో సహా ఎస్&టి విషయాంశాల శాంప్లింగ్, చురుకుగా అర్థం చేసుకోవడానికి ఈ వేదిక తోడ్పడుతుంది. వీటిని గామిఫికేషన్ పరికరాలు, ఎఐ/ఎంఎల్ భాగాలను ఉపయోగించడం ద్వారా వారు నేర్చుకుంటారు.
పాఠశాలలతో చురుకుగా ఒప్పందం చేసుకుంటూ, పాఠశాల ఆవరణలలో పారస్పరిక కార్యక్రమాలను షూట్ చేస్తూ, గుర్తింపుకు అవకాశాలను, ఎస్&టికి సంబంధించి ఎంపిక చేసిన టీచర్ల శ్లాఘిస్తూ ఎంగేజ్ విత్ సైన్్స పని చేస్తుంది. ఈ కార్యక్రమాలను ఇండియా సైన్స్ ఛానెల్ ద్వారా ప్రసారం చేసినప్పుడు టీచర్లు, పాఠశాలల చుట్టూ ఒక సమాజాన్నే కాక, ఫాన్ ఫాలోయింగ్‌ను కూడా సృష్టిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
***
(Release ID: 1663209)
Visitor Counter : 214