ఆయుష్

క్యూబా వాసుల‌‌ హృదయాలలో త‌న‌వంతు స్థానం ద‌క్కించుకుంటున్న‌ యోగా

Posted On: 09 OCT 2020 12:55PM by PIB Hyderabad

క్యూబాలో యోగాకు క్ర‌మంగా ఆదరణ పెరుగుతుండ‌డం భారత దేశ యోగా ప్రియులకు ఆనందాన్ని క‌లిగిస్తోంది. మన పూర్వీకుల నుండి కాలాతీతంగా అందిన ఈ బహుమతి నిజంగా విశ్వవ్యాప్త వారసత్వం. ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా త‌గు శిష్యులను సంపాదించుకుంటోంది. క్యూబా, హవానాలోని భారత రాయబార కార్యాలయం నుండి అందిన‌ సమాచారం మేర‌కు క్యూబన్ యోగా అసోసియేషన్ అధ్యక్షుడు మరియు వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ ఎడ్వర్డో పిమెంటెల్ వాజ్క్వెజ్ ఆ దేశంలో యోగాకు సంబంధించి ఒక‌ ప్రముఖ వ్యక్తిగా ఉంటున్నారు. ఇతను 30 సంవత్సరాలుగా క్యూబాలో యోగా బోధన చేస్తున్నాడు మరియు 50 మంది బోధకులకు శిక్షణను ఇచ్చాడు. దాదాపు 1.13 కోట్ల జనాభా ఉన్న క్యూబా దేశంలో యోగా స్థిరమైన వృద్ధికి ఇది గణనీయంగా తోడ్ప‌డుతోంది. లూయిస్ రౌల్ వాజ్క్వెజ్ మావోజ్, రాఫెల్ పినారెస్ గొంజాలెజ్ చేత జువెంటుడ్ రెబెల్డేలో ప్రొఫెసర్ పిమెంటెల్ వాజ్క్వెజ్ ఇటీవ‌ల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ క్యూబాలో విస్తృతంగా చదవబడింది. యోగా ఆ దేశంలో ఎలా ప్రాచుర్యం పొందిందనే విష‌యాన్ని ఇది వెలుగులోకి తెచ్చింది. అన్ని వయసుల ప్రజలు పార్కులు, గదులు మరియు యోగా ప్రదర్శించే మ్యూజియమ్‌లలో కనిపిస్తున్నారు. క్యూబా దేశంలో యోగా కార్యకలాపాల్లో పాల్గొనే వారి సంఖ్య కూడా రోజురోజూ పెరుగుతూ వ‌స్తోంది. ఈ ఇంటర్వ్యూ ప్రకారం ప్రొ. ఎడ్వర్డో పిమెంటెల్ వాజ్క్వెజ్ యొక్క‌ జీవితాన్ని ఒక యోగా పుస్తకం మార్చేసింది. అతను 12 సంవత్సరాల వయస్సు నుండి చెస్ ఆటగాడు. ఒక రోజు యోగా పద్ధతులతో కూడిన పుస్తకాన్ని (1972 లో) ఆయ‌న బహుమతిగా పొందాడు. ఆ త‌రువాత పుస్తకంను అనుసరించి ఆయ‌న యోగా సాధ‌న చేయ‌డం మొద‌లుపెట్టాడు. అప్పటి నుండి అతను యోగా అధ్యయనం మాన‌లేదు. ప్రొఫెసర్ పిమెంటెల్ యోగాస‌నాల్ని మిగతా వాటికన్నా ఎక్కువ తత్వశాస్త్రంగా నిర్వచించారు. పాశ్చాత్య ప్రపంచానికి యెగా ముఖ్యంగా దాని శారీరక అభ్యాసానికి ఎంతో ఆసక్తిని కలిగి ఉందని అన్నారు. ఈయ‌న అమెరికా, బ్రెజిల్, మెక్సికో దేశాలలో యోగా పాఠాలు నేర్పించాడు. 2018 లో ప్రచురించిన తన  పుస్తకంలో 'తు సెషన్ డి యోగా' (మీ యోగా సెషన్) మేటి ముంద‌స్తు వ్యాధి నివారణ వ్యవస్థగా ఉటుంద‌ని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన యోగాను 1995 నుండి క్యూబా యొక్క ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. సంప్రదాయ మరియు సహజ ఔషధపు విభాగంలో భాగంగా గుర్తించబడింది. ఏదో ఒక భంగిమ సాధ‌న మాత్ర‌మే యోగా సెష‌న్ కాద‌ని ప్రొఫెసర్ పిమెంటెల్ అభిప్రాయపడ్డారు. వ‌రుస‌ యోగాస‌నాల‌ను సాధ‌న చేయాలని సిఫార్సు చేశారు. ఒత్తిడిని దూరం చేసే రెండు భంగిమల‌ను ఆయ‌న ఇక్క‌డ ప‌రిచ‌యం చేశారు. వాటిలో ఒకటి త్రికోణాస‌నా.  ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంద‌ని అలాగే హార్మోన్లను విశ్రాంతిని క‌లిగిస్తుంద‌ని అన్నారు. మరొకటి తల శిర్షాసనం. ఇది కీలక‌ మూల బల‌ము, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంద‌న్నారు. ప్రతి ఏడాది క్యూబాలో 'అంతర్జాతీయ యోగా దినోత్సవం‌ (ఐడీవై) ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2020లో) కూడా  దేశవ్యాప్తంగా ఆరో ఐడీవైని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈ వేడుక‌ల్లో హవానాలో ఉన్న‌ భారత రాయబార కార్యాలయం చురుకుగా పాల్గొంది.

***

 



(Release ID: 1663142) Visitor Counter : 171