సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
కోవిడ్ అనంతర మానసిక ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
Posted On:
08 OCT 2020 5:13PM by PIB Hyderabad
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతశాఖామంత్రి శ్రీ తావర్ చంద్ గెహ్లాట్ ఈ రోజు కోవిడ్ నంతర మానసిక ఆరోగ్యం పై ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సును వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆస్ట్రేలియా-ఇండియా ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ శప్రొఫెసర్ క్రెయిగ్ జెఫ్రీ ఈ సదస్సుకు సహాధ్యక్షత వహించారు.
శ్రీ తావర్ చంద్ గెహ్లాట్ ప్రారంభోపన్యాసం చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మానసిక సమస్యల గురించి ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో భారత్ ప్రభుత్వం మధ్యప్రదేశ్ లోని సెహోర్ లో జాతీయ మానసిక ఆరోగ్య పునరావాస సంస్థను. కిరణ్ మానసిక ఆరోగ్య పునరావాస హెల్ప్ లైన్ ను ప్రాంభించటం ద్వారా ఈ సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని ప్రస్తావించారు.
వికాలాంగుల సాధికారతా విభాగం కార్యదర్శి శ్రీమతి శకుంతల డి. గమ్లిన్ మాట్లాడుతూ, సదస్సు ముఖ్యలక్ష్యాలను వివరించారు. ఇటీవలి కాలంలో మానసిక సమస్యలు పెరుగుతూ ఉండటాన్ని, దాని మీద దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. కోవిడ్ ప్రభావం మనుషుల సామాజిక మానసిక స్థితి మీద ఎక్కువగా ఉందన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యగా తయారైందన్నారు. ఈ విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ ప్రబోధ్ సేథ్ ఈ సదస్సును నిర్వహించారు. దేశంలో మానసిక ఆరోగ్య పరిరక్షణలో జాతీయ మానసిక ఆరోగ్య పునరావాస సంస్థ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు..
సదస్సులో భాగంగా ఐదు సాంకేతిక అంశాలమీద వేరు వేరు సెషన్లు నిర్వహించగా భారత్, ఆస్ట్రేలియా దేశాల నిపుణులు ప్రసంగించారు. కోవిడ్ మీద పోరాటంలో ఆరోగ్యేతర సిబ్బంది ఎదుర్కున్న మానసిక వత్తిడి, బహూళ సంస్కృతులలో మానసిక ఆరోగ్యం, మాన్సిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ఇంటి నుంచి పనిచేయటం, ఆత్మహత్య ఆలోచనలు, భారత్ లో దాని సంబంధమైన కేసులు, భారత్ లోను, ఆస్ట్రేలియాలోను మానసిక ఆరోగ్యం-మానవ హక్కులు, వైకల్యం ఉన్న ప్రజలలో మానసిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించటం , బాలల వికాసానికి విద్యా విధానంలో కొత్త ధోరణి తదితర అంశాలని సదస్సు చర్చించింది.
భారత్ లో ఆస్ట్రేలియా హై కమిషనర్ శ్రీ బారీ ఓ ఫారెల్ మాట్లాడుతూ స్థూలంగా ఆస్ట్రేలియాలో నెలకొన్న మానసిక ఆరోగ్య పరిస్థితిని వివరించారు.ఇరు దేశాల ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు చేపట్టాలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సంబంధిత అంశాల పరిశోధనలు, ప్రధాన స్రవంతిలోని వ్యక్తులలో మానసిక అనారోగ్యం లాంటి విషయాలమీద దృష్టి సారించాల్సి ఉందన్నారు.
ఈ సదస్సులో ప్రసంగించిన ఇతర ప్రముఖులలో హోం శాఖ మాజీ కార్యదర్శి, మాజీ మణిపూర్, మిజోరం గవర్నర్ శ్రీ వికె దుగ్గల్, విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి అనితా కార్వాల్, మెల్బోర్న్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ డిప్యూటీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ మైఖేల్ వెస్లీ ఆస్ట్రేలియా మెంటల్ హెల్త్ చైర్మన్ శ్రీ వాసన్ శ్రీనివాసన్, భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ మాజీ సెక్రెటరీ జనరల్ శ్రీ జైదీప్ గోవింద్, డిఎఆర్ పిజి అదనపు కార్యదర్శిశ్రీ వి. శ్రీనివాస్, మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ గ్రెగ్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్ సాగర్, డాక్టర్ నిమేశ్ దేశాయ్, ప్రొఫెసర్ ప్రతిమా మూర్తి, శ్రీ ఎస్ కె రుంగ్టా, డాక్టర్ కె మథియాస్, డాక్తర్ హిమాన్షు, ప్రొఫెసర్ నాథన్ గ్రిల్స్ తదితరులు ఉన్నారు.
***
(Release ID: 1662889)
Visitor Counter : 224