రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఎస్ఏఆర్‌డీపీ-ఎన్ఈ సంబంధిత పనులకు నిధుల కేటాయింపుల‌ను పెంచిన ఎంఓఆర్‌టీహెచ్‌

Posted On: 08 OCT 2020 12:39PM by PIB Hyderabad

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 'స్పెషల్ యాక్సిలరేటెడ్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం- ఈశాన్య ప్రాంతం' (ఎస్ఏఆర్‌డీపీ-ఎన్ఈ) కింద చేప‌ట్టే వివిధ పనుల ఖర్చుల కోసం నిధుల కేటాయింపును కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టీహెచ్‌) పెంచింది. వాస్తవంగా కేటాయింపు జ‌రిపిన మొత్తానికి దాదాపు రెట్టింపుగా తాజాగా స‌వ‌రించిన కేటాయింపులు జ‌ర‌ప‌బ‌డ్డాయి.
2020-21 మధ్యకాలంలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నుండి ఇంతకు ముందు రూ.390 కోట్ల వ్యయం చేయాలని నిర్ణ‌యించారు. ఇదే కాలానికి ఇప్పుడు దాదాపు రూ.760 కోట్ల రూపాయల‌ను అద‌నంగా కేటాయించారు. దీనిలో రూ.300 కోట్లు ప్రత్యేకంగా అరుణాచల్ ప్రదేశ్ ప్యాకేజీగా కేటాయించ‌డ‌మైంది. దీనికి అద‌నంగా, ఈశాన్య ప్రాంతంలోని జాతీయ రహదారులకు ప‌ది శాతం మేర తప్పనిసరి పూల్ ఫండ్  కేటాయింపులు జ‌ర‌పుతుండ‌డంతో.. గత ఐదేండ్ల‌లో ఈ కేటాయింపులు  పెరుగుతున్నాయి. ఈ ఫండ్ కింద 2016-17 సంవత్సరానికి గాను రూ.4,520 కోట్లు, 2017-18 సంవత్సరానికి రూ.5,265 కోట్లు, 2018-19 సంవత్సరానికి రూ.6,210 కోట్లు, 2019-20 సంవత్సరానికి గాను రూ.6,070 కోట్లు, 2020-21 సంవ‌త్స‌రానికి గాను రూ.6,780 కోట్లు కేటాయించారు. ఈశాన్య భారతావ‌నిలో ఎస్ఏఆర్‌డీపీ-ఎన్ఈ పథకం కింద భారీగా రహదారుల‌ అభివృద్ధి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. ఎస్ఏఆర్‌డీపీ-ఎన్ఈ (ఫేజ్‌-ఎ మ‌రియు అరుణాచల్ ప్రదేశ్) కింద 6418 కి.మీ.(5998 కి.మీ. వాస్తవ రూపకల్పన పొడవు) ర‌హదారుల‌ అభివృద్ధికి ఇప్పటికే రూ.30,450 కోట్లు కేటాయించారు. అందులో దాదాపుగా 3356 కి.మీ. ప‌నులు పూర్తయ్యాయి. 1961 కి.మీ. ర‌హ‌దారి నిర్మాణంలో ఉంది.
                               

 ***



(Release ID: 1662871) Visitor Counter : 101