సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
జె&కె, లడాఖ్, ఈశాన్య ప్రాంతం, అండమాన్& నికోబార్ దీవులకు ప్రభుత్వ ఉద్యోగులు విమానంలో ప్రయాణించేందుకు అనువుగా ఎల్‌టిసి సదుపాయాన్ని సడలించిన డిఒపిటి
ప్రయాణ సదుపాయ సడలింపు 2022, సెప్టెంబర్ 25వరకు పొడగింప - డాక్టర్ జితేంద్ర సింగ్
స్వస్థలానికి ఇచ్చే ఎల్‌టిసిని కేంద్ర పాలిత ప్రాంతాల పర్యటించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించుకోవచ్చు
ప్రయాణ సౌకర్యం కోసం ప్రైవేటు విమానాలలో ప్రయాణించేందుకు ఉద్యోగులకు అవకాశం
Posted On:
08 OCT 2020 5:10PM by PIB Hyderabad
ప్రభుత్వ ఉద్యోగులు జమ్ము, కాశ్మీర్, లడాఖ్, ఈశాన్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులకు విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించేలా లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టిసి) సదుపాయాన్ని సడలిస్తూ సిబ్బంది & శిక్షణ శాఖ (డిఒపిటి) గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణు శక్తి, అంతరిక్ష వ్యవహారాల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ సడలింపును 2022, సెప్టెంబర్ 25 వరకు పొడిగిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఈ సర్క్యులర్ ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ స్వస్థలానికి ఉద్దేశించిన ఎల్‌టిసిని జమ్ము, కాశ్మీర్, ఈశాన్య ప్రాంతం, లడాఖ్, అండమాన్, నికోబార్ దీవులలో పర్యటించుకోవడానికి ఉపయోగించుకోవచ్చని మంత్రి జితేందర్ సింగ్ వివరించారు.
ఇందుకు అదనంగా, విమాన యానానికి అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగులు జమ్ము, కాశ్మీర్, ఈశాన్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులకు విమానంలో ప్రయాణించేందుకు ఈ సదుపాయం అవకాశమిస్తుంది.
ఈ సౌలభ్యాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు పైన పేర్కొన్న ప్రాంతాలకు ప్రైవేటు విమానాలలో ప్రయాణించే అవకాశాన్ని కూడా ఈ సడలింపులో భాగంగా కల్పించారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విమానయాన్ సంస్థ అయిన ఎయిర్ ఇండియాలోనే ప్రయాణించవలసి ఉంటుందని ఆయన చెప్పారు.
కేంద్ర సివిల్ సర్వీసుల (ఎల్‌టిసి) నిబంధనలు, 1988ని సడలిస్తూ, ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము, కాశ్మీర్, ఈశాన్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులకు విమానంలో ప్రయాణించే అవకాశాన్ని 2022, సెప్టెంబర్ 25వరకు, అంటే రెండేళ్ళపాటు ప్రభుత్వం పొడిగించిందని మంత్రి చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇది భారీ, ప్రత్యేక సదుపాయమని అభివర్ణిస్తూ, వారు నాలుగేళ్ళ కాలంలో తమ స్వస్థలానికి ఇచ్చే ఎల్‌టిసిని పైన పేర్కొన్న ప్రాంతాలలోకి పర్యటించేందుకు బదలాయించుకోవచ్చని, డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల స్వస్థలం, పని చేసే ప్రాంతం ఒకటే అయినప్పుడు ఈ బదలాయింపును అనుమతించరు. సాధారణంగా విమానయానానికి అర్హత లేని ఉద్యోగులను కూడా ఈ పథకంలోని నిబంధనల ప్రకారం విమాన ప్రయాణానికి అనుమతిస్తారు. అయితే వారు విమానంలోని ఎకానమీ క్లాసులో, ఎల్‌టిసి -80 పథకం కింద గరిష్ట చార్జీలకు లోబడి ప్రయాణించవలసి ఉంటుంది.
మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ, సుదూర, సమస్యాత్మక ప్రాంతాలకు ప్రధాన మంత్రి మోడీ ప్రాధాన్యతను ఇచ్చి, ఈ ప్రాంతాలలో పాలనా సౌలభ్యం, జీవన సౌలభ్యం కోసం సాధ్యమైనంతగా చేస్తున్నారని మంత్రి వివరించారు.
***
(Release ID: 1662858)
Visitor Counter : 207