సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కొత్త వ్యవసాయ చట్టాలపై జమ్మూ & కాశ్మీర్ లోని ఉద్దంపూర్ జిల్లా రాంనగర్ తహశీల్ లోని బసంత్ గఢ్ , చౌకీ బ్లాకు అభివృద్ధి కమిటీల అధ్యక్షులు, రైతులు, గ్రామ సర్పంచులతో సమావేశమైన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్

Posted On: 05 OCT 2020 6:44PM by PIB Hyderabad

కొంతమంది స్వార్ధంతో స్వప్రయోజనాల కోసం రైతు సమాజానికి శత్రువుల వలె మరియు దోపిడీదారులకు మద్దతుగా  కొత్త వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోమవారం అన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణల వాళ్ళ రైతులు తమ పంట ధరను ఎంపిక చేసుకునే శ్వేతచ్చ ఉంటుందని అంతేకాక తమకు నచ్చిన ధరకు పంటను అమ్ముకోవచ్చని  తద్వారా ఎక్కువ మంది కొనుగోలుదారులు అందుబాటులో ఉంటారని మంత్రి తెలిపారు.  అంతేకాక ఇదివరకే ఏర్పాటైన కనీస మద్దతు ధర వ్యవస్థలో కొనసాగవచ్చని అన్నారు.  

గ్రామం, పంచాయత్, బ్లాకు స్థాయిలో రైతులు, ప్రజా ప్రతినిధులతో  సమావేశాలు,  పరస్పర అభిప్రాయ వ్యక్తీకరణ కొనసాగింపుగా  డాక్టర్ జితేంద్ర సింగ్  జమ్మూ & కాశ్మీర్ లోని ఉద్దంపూర్ జిల్లా రాంనగర్ తహశీల్ లోని బసంత్ గఢ్ ,  చౌకీ  బ్లాకు అభివృద్ధి కమిటీల అధ్యక్షులు, రైతులు, గ్రామ సర్పంచులతో మంత్రి సమావేశమయ్యారు.  

వక్రోక్తి ఏమిటంటే గత అనేక సంవత్సరాలుగా మారువేషంలో రైతుల మద్దతుదారులమని చెప్పుకొంటూ మోదీ ప్రభుత్వ సంస్కరణలను వ్యతిరేకిస్తున్న వారు నిజానికి  రైతుల పంటను తక్కువ ధరకు కొని ఎన్నో రేట్లు ఎక్కువకు అమ్ముతున్న వారితో కుమ్మక్కయ్యారని,   దాని వల్ల మధ్య దళారులు,  మార్కెటులో అక్రమాలు చేసేవారు  తరతరాలుగా సంపన్నులవుతుండగా రైతు మాత్రం రోజు రోజుకు  పేదరికంలో మగ్గిపోతున్నాడని ఆయన ఆరోపించారు.

రైతులపట్ల ఎలాంటి జాలి, దయ లేకుండా వ్యవహరించడం వల్ల అనేక మంది రైతులు బాధతో తెగించి ఆత్మహత్యలకు పాల్పడ్డారని
డాక్టర్ సింగ్ అన్నారు.  ఇప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు,  భద్రతా చర్యల వల్ల విపత్కర పరిస్థితుల్లో రైతులకు ఊరట లభించే ఏర్పాటు జరిగిందని అన్నారు.  

గత ఆరేళ్ళ అనుభవాల దృష్ట్యా మోదీ ప్రభుత్వ ఉద్దేశాలను అనుమానించేందుకు ఆస్కారమే లేదని డాక్టర్ జితేంద్ర సింగ్ ఉద్ఘాటించారు.  గతంలో ఏ ప్రభుత్వం  కనీసం యోచించని అనేక సంస్కరణలకు రూపకల్పన చేసి  అమలు చేసిందని,  వాటిలో భూసార పరీక్ష కార్డు,  రైతుల ఖాతాలలో నగదు డిపాజిట్ చేసే ప్రధాన మంత్రి సమ్మాన్ కిసాన్ నిధి,   ఫసల్ బీమా యోజన, వేప పూత పూసిన యూరియా మరియు  రైతు ఉత్పత్తుల సంఘాల ఏర్పాటు వంటివి ఉన్నాయి.  

మంత్రితో జరిపిన సమావేశంలో తమ అభిప్రాయాలు వెలిబుచ్చిన స్థానిక రైతులు, సర్పంచులు మరియు బ్లాకు అభివృద్ధి కమిటీల అధ్యక్షులతో  కేవల్  సింగ్ పరిహార్,  ఉపదేశ్ కుమార్,  రమేశ్ కుమార్, ఆకాశ్ సింగ్,  రాంలాల్ వర్మ,  దీప్ సింగ్,  మఖ్నా దేవి మరియు ఇతరులు ఉన్నారు.  ప్రజల్లో క్రియాశీలురు రాజిందర్ శర్మ,  సుమిత్ గుప్తా, మొహిందర్ సింగ్,  రతన్ శర్మ మరియు ఇతరులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.  

***



(Release ID: 1662086) Visitor Counter : 93