ప్రధాన మంత్రి కార్యాలయం

వెస్‌టాస్ ప్రెసిడెంటు, సిఇఒ తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి  

Posted On: 06 OCT 2020 4:10PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వెస్‌టాస్ ప్రెసిడెంటు, సిఇఒ శ్రీ హెన్రిక్ ఆండ‌ర్‌ స‌న్ తో ప‌వ‌న శ‌క్తి రంగానికి సంబంధించిన అంశాల‌పై మాట్లాడారు.
 
“వెస్‌టాస్ ప్రెసిడెంటు, సిఇఒ శ్రీ హెన్రిక్ ఆండ‌ర్‌ స‌న్ తో ఒక చ‌క్క‌ని చ‌ర్చ చోటుచేసుకొంది.  మేం ప‌వ‌న శ‌క్తి రంగానికి సంబంధించిన అనేక అంశాల‌ ను చ‌ర్చించాం.  రాబోయే త‌రాల‌ వారికి ఒక శుద్ధ‌మైన భ‌విష్య‌త్తు ను అందించ‌డం కోసం న‌వీక‌ర‌ణీయ‌ శ‌క్తి ని వినియోగించుకొనే దిశ‌ లో భార‌త‌దేశం చేస్తున్న  ప్ర‌య‌త్నాలలో కొన్నిటిని ఈ సంద‌ర్భం లో ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించ‌డ‌మైంది’’ అని ట్విట‌ర్ మాధ్య‌మం లో ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డించారు.

***
 (Release ID: 1662046) Visitor Counter : 14