వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
కొనసాగుతున్న ఖరీఫ్ పంట ఉత్పత్తుల సేకరణ
దేశవ్యాప్తంగా సాఫీగా వరి ధాన్యం సేకరణ; పప్పుధాన్యాలు, నూనె గింజల సేకరణకు కొన్ని రాష్ట్రాల్లో అనుమతి
పెసలు, ఎండుకొబ్బరి సేకరణ కూడా ప్రారంభం
Posted On:
05 OCT 2020 7:30PM by PIB Hyderabad
కనీస మద్దతు ధర పథకాలను అనుసరించి, కనీస మద్దతు ధర వద్ద ఖరీఫ్ పంట ఉత్పత్తుల సేకరణ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. వరి ధాన్యం సేకరణ సాఫీగా సాగుతోంది. ఈనెల 4వ తేదీ నాటికి మొత్తం 8,00,389 మె.ట. ధాన్యం సేకరణ పూర్తయింది. 62,518 మంది రైతుల నుంచి ఈ ధాన్యం సేకరించి, కనీస మద్దతు ధరగా రూ.1,511.135 కోట్లు చెల్లించారు.
రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు, ప్రస్తుత సీజన్‌లో 28.40 ల.మె.ట. పప్పుధాన్యాలు, నూనె గింజల సేకరణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానాకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,
తమిళనాడు, కేరళలో మొత్తం 1.23 ల.మె.ట. ఎండు కొబ్బరి సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మిగిలిన రాష్ట్రాలు/యూటీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, నమోదిత రైతుల నుంచి ఎంఎస్‌పీ వద్ద ఎఫ్‌ఏక్యూ రకాల సేకరణకు అనుమతి లభిస్తుంది. ఒకవేళ మార్కెట్ రేటు కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే, మద్దతు ధర పథకాలను (పీఎస్‌ఎస్) అనుసరించి సేకరణ ఉంటుంది.
ఈనెల 4వ తేదీ వరకు, 85 మంది తమిళ, హర్యానా రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ, రూ.74 లక్షల కనీస మద్దతు ధరతో, 103.4 మె.ట. పెసలను నోడల్ ఏజెన్సీల ద్వారా కేంద్రం సేకరించింది. అదేవిధంగా, 5089 మె.ట. ఎండు కొబ్బరిచిప్పలను రూ.52.4 కోట్ల కనీస మద్దతు ధరతో సేకరించింది. తమిళనాడు, కర్ణాటకలోని 3961 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో మొత్తం 1.23 ల.మె.ట. ఎండు కొబ్బరిచిప్పల సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎండు కొబ్బరి మిల్లింగ్‌కు సంబంధించి, ఎంఎస్‌పీ కంటే మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. పెసల సేకరణకు ఆయా రాష్ట్రాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. మినుమలు, ఎండు కొబ్బరికి సంబంధించి, మార్కెట్ ధరలు ఎంఎస్‌పీ వద్ద లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నాయి.
2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో, ఈ నెల 1వ తేదీ నుంచి గింజ పత్తి (కపస్) సేకరణ కూడా ప్రారంభమైంది. ఈనెల 4వ తేదీ వరకు, 29 మంది రైతుల నుంచి 147 బేళ్ల పత్తిని 'కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' సేకరించింది. కనీస మద్దతు ధరగా రూ.40.8 లక్షలు చెల్లించింది.
****
(Release ID: 1661902)
Visitor Counter : 147