రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

వచ్చే ఏడాది అక్టోబర్ నుండి ట్రాక్టర్లకు, ఏప్రిల్ నుండి నిర్మాణపు సామగ్రి వాహనాలకు ఉద్గార నిబంధనలు వర్తిస్తాయి

Posted On: 05 OCT 2020 5:59PM by PIB Hyderabad

ట్రాక్టరు వాహ‌నాల‌కు (టీఆర్ఈఎం స్టేజ్- IV) ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి వ‌ర్తించాల్సిన తదుపరి దశ ఉద్గార నిబంధనలను వ‌చ్చే ఏడాది అక్టోబ‌రు 1వ తేదీకి వాయిదా వేస్తూ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నిబంధ‌నల్ని స‌వ‌రించింది. దీనికి సంబంధించి.. 30 సెప్టెంబ‌రు 2020న‌
జీఎస్ఆర్ 598(ఈ) ద్వారా.. సీఎంవీఆర్ 1989కు సవరణను నోటిఫై చేసింది.
అమ‌లు తేదీ వాయిదాకు సంబంధించి మంత్రిత్వ శాఖ‌కు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ట్రాక్టర్ తయారీదారులు మరియు వ్యవసాయ సంఘాల నుండి  అభ్యర్థనలు అందాయి. నిర్మాణ సామగ్రి వాహనాల కోసం, తదుపరి దశ ఉద్గార నిబంధనలు 1 ఏప్రిల్ 2021 నుండి వర్తింపజేయాలని ప్రతిపాదించబడింది. ఇది గ‌తంలో నిర్ణ‌యించిన దాని కంటే కూడా ఆరు నెలల వాయిదాను అందిస్తుంది.
బీఎస్‌ నిబంధనలను కలిగిన ఇతర మోటారు వాహనాల ఉద్గార నిబంధనలు మరియు వ్యవసాయ యంత్రాలు, నిర్మాణ సామగ్రి వాహనాలు మరియు ఇతర పరికరాల వాహ‌నాల మధ్య గందరగోళాన్ని నివారించే దిశ‌గా ఈ సవరణ దోహ‌దం చేస్తుంది.
ర‌వాణా శాఖ చేప‌ట్టిన స‌వ‌ర‌ణ‌ ఈ కింది అంశాల‌ను క‌లిగి ఉంది..

(i) వ్యవసాయ యంత్రాలు (వ్యవసాయ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు మరియు సంయుక్త హార్వెస్టర్లు) మరియు నిర్మాణ సామగ్రి వాహనాల కోసం ఉద్గార నిబంధనలను వేరు చేయ‌డ‌మైంది మరియు
(ii) భారత్ స్టేజ్ (సీఈవీ/ టీఆర్ఈఎం)–IV మరియు భారత్ స్టేజ్ (సీఈవీ/ టీఆర్ఈఎం)–V నుండి ఉద్గార నిబంధనల నామకరణంలో మార్పులు చేయ‌డ‌మైంది.

a. వ్యవసాయ ట్రాక్టర్లు మరియు ఇతర పరికరాల కోసం టీఆర్ఈఎం స్టేజ్- IV మరియు టీఆర్ఈఎం స్టేజ్-V.

బి. నిర్మాణ సామగ్రి వాహనాల కోసం సీఈవీ స్టేజ్ -IV మరియు సీఈవీ స్టేజ్-Vగా మార్చ‌డమైంది.

ఈ నిబంధనలను సవరించడానికి సంబంధించి ముసాయిదా నియమాల‌ను  ఆగస్టు 5, 2020 నాడు జారీ చేసిన‌ నోటిఫికేషన్ నంబర్ జి.ఎస్‌.ఆర్
491(ఈ) నందు ప్రచురించ‌డ‌మైంది.

 

***


(Release ID: 1661852)