మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
వ్యవసాయ అధారిత భారతదేశం రైతు సంక్షేమ కేంద్రిత దేశంగా ముందుకు సాగుతున్నది. దీని వల్ల రైతులు తాము కష్టపడి పనిచేసినదానికి తగిన గౌరవాన్ని , ఉత్పత్తులకు సముచిత ధరను పొందగలుగుతారు: ముక్తార్ అబ్బాస్ నక్వి
ఒక దేశం, ఒక మార్కెట్ కల సాకారం కానుంది: ముక్తార్ అబ్బాస్ నక్వి
Posted On:
05 OCT 2020 3:15PM by PIB Hyderabad
వ్యవసాయ ఆధారిత భారతదేశం రైతు సంక్షేమ కేంద్రితంగా ముందుకు సాగుతున్నది. రైతు తాను కష్టపడి పనిచేసిన పనికి గౌరవం పొందుతారు.అలాగే పండించిన పంటకు సరైన ధర పొందగలుగుతారు అని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ వద్దగల లోధిపూర్ గ్రామంలో కిసాన్ చౌపాల్ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. రైతుల రాబడిని రెట్టింపు చేయాలని ప్రభుత్వం సంకల్పించడంతో బ్రోకర్లు, మధ్యవర్తుల చింతలు నాలుగు రెట్లు అయ్యాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలు , రైతుల కళ్లల్లో సంతోషం, వారి జీవితాలలో సుసంపన్నతకు భరోసా ఇస్తాయని శ్రీ నక్వీ అన్నారు. ఈ చట్టాలు రైతులకు ఆర్ధిక సాధికారత కల్పించడంతోపాటు, మధ్యదళారుల పిడికిలి నుంచి స్వేచ్ఛ కల్పిస్తాయని ఆయన తెలిపారు.
ప్రభుత్వం రైతుల సుసంపన్నతకు కట్టుబడి ఉందని శ్రీనక్వి అన్నారు. వ్యవసాయ సంస్కరణల చట్టాలు రైతుల సాధికారత, సుసంపన్నత దిశగా చరిత్రాత్మక అడుగు అని ఆయన అన్నారు. రైతుల ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహక, సులభతర చట్టం, నిత్యావసర సరకుల (సవరణ) చట్టం ఆమోదం పొందాయని, ఇప్పుడు రైతులకు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయని అవి వారి రాబడిని పెంచుతాయని ఆయన అన్నారు.ఇది వ్యవసాయ రంగానికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. కనీస మద్దతు ధర, ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం కొనసాగుతాయని అన్నారు.
ఈ చట్టాలు రైతులు నిల్వ చేసుకోవడానికి, అమ్మకానికి స్వేచ్ఛనిస్తాయని, మద్ధవర్తుల ఉచ్చునుంచి బయటపడవేస్తాయని ఆయన అన్నారు. అలాగే రైతులు చట్టపరమైన ఆంక్షలనుంచి విముక్తులు అవుతారని, రైతులు ఉత్పత్తులను మండీలలో లైసెన్సుడు ట్రేడర్లకు అమ్మాల్సిందిగా రైతులపై ఎలాంటి ఒత్తిడి ఇక ఉండదని ఆయన అన్నారు. అలాగే ప్రభుత్వ మండీలు వసూలు చేసే పన్ను నుంచీ రైతులకు స్వేచ్ఛ లభిస్తుందని ఆయన అన్నారు. రైతులు తమ చెల్లింపులను మూడురోజులలోపు పొందగలుగుతారని చెప్పారు. ఒక దేశం , ఒక మార్కెట్ కల సాకారమౌతుందని అన్నారు.
గ్రామాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నారని శ్రీ నక్వీ అన్నారు. ఎలాంటి పరిస్థితులలోనూ రైతుల హక్కులను కాపాడడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకూ ప్రభుత్వం 92,000 కోట్ల రూపాయలు రైతులకు అందజేసిందని ఆయన చెప్పారు.
ఇంతకు ముందు ఉన్నట్టుగానే కనీస మద్దతు ధర వ్యవస్థ దేశవ్యాప్తంగా కొనసాగుతుందని ప్రధానమంత్రి పదే పదే స్పష్టం చేస్తున్నారని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు.అంతే కాదు, ఎన్నో పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరను పెంచడం జరిగిందన్నారు. గోధుమలకు సంబంధించిన కనీస మద్దతు ధర ను క్వింటాలుకు రూ 1975 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ఆలాగే బార్లీ ధర రూ 1600కు, శనగలు రూ 5100, మసూర్ దాల్ 5100, ఆవాలు రూ 4650 లు, సన్‌ఫ్లవర్ క్వింటాలు రూ 5327కు పెంచారు.
2009-10 యుపి హయాంలో వ్యవసాయ బడ్జెటట్ 12,000 కోట్ల రూపాయలు ఉండగా దానిని ప్రభుత్వం 1.24 లక్షల కోట్ల రూపాయలకు పెంచిందని ఆయన చెప్పారు. భూసార కార్డులు 22 కోట్ల మంది రైతులకు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఫసల్ భీమా యోజన వల్ల 8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం జరిగిందని, 10,000 కొత్త రైతు ఉత్పత్తి సంస్థలపై ప్రభుత్వం రూ 6850 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నదని చెప్పారు. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద వ్యవసాయానికిప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు ప్రకటించిందని, రైతు రుణాలకు గతంలో 8 లక్షల కోట్లు కేటాయించగా, ప్రస్తుతం 15 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని అన్నారు. 60 సంవత్సరాలు దాటిన రైతులకు నెలకు కనీసం రూ3000 లు పెన్షన్ అందించే నిబంధన ఉందని అన్నారు. కనీస మద్దతు ధర చెల్లింపు గురించి ప్రస్తావిస్తూ, ప్రభుత్వం రైతులకు 6 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలు చెల్లించినట్టు చెప్పారు. ఇది యుపిఎ ప్రభుత్వ హయాంలో కంటే రెట్టింపు అని ఆయన అన్నారు.
కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి ప్రస్తావిస్తూ శ్రీ నక్వి, రైతులు తమ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛ కలిగి ఉంటారు. ఎవరైనా రైతు తాను కుదుర్చుకున్న కాంట్రాక్టుతో సంతృప్తి చెందనట్టయితే అతను కాంట్రాక్టును రద్దు చేసుకోవచ్చు. వ్యవసాయ సంస్కరణల చట్టం రైతుల ప్రయోజనాలు రక్షించేందుకు నూరుశాతం గ్యారంటీ ఇస్తుందని ఆయన అన్నారు.
***
(Release ID: 1661839)
Visitor Counter : 145