ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రయాగ్ రాజ్ మోతీలాల్ నెహ్రూ వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంబించిన కేంద్ర మంత్రి
వాజ్ పేయి కలలను మోదీ సాకారం చేస్తున్నారు: డాక్టర్ హర్షవర్ధన్

Posted On: 05 OCT 2020 2:43PM by PIB Hyderabad

ప్రయాగ్ రాజ్ లో ఉన్న మోతీలాల్ నెహ్రూ వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ డిజిటల్ పద్ధతిలో ప్రారంభించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమంలొ పాల్గొన్నారు. . ఈ 220 పడకల విభాగాన్ని కోవిడ్ చికిత్సకు ప్రత్యేకంగా కేటాయించారు. కోవిడ్ పరీక్షల వ్యూహంలో అవసరమయ్యే కోబాస్ 6800 యంత్రాన్ని కూడా కేంద్రమంత్రి డిజిటల్ విధానంలో ప్రారంభించారు.

ప్రధానమంత్రి స్వస్థ్య సురక్షా యోజన కింద రూ. 150 కోట్ల రూపాయలతో ఈ బ్లాక్ ని నిర్మించారు. ఇందులో న్యూరాలజీ,  న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ ఎండోక్రైనాలజీ, సర్జికల్ ఆంకాలజీ, కార్డియో థొరాసిక్ వాస్క్యులార్ సర్జరీ విభాగాలున్నాయి. ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో 7 ఆపరేషన్ థియేటర్లు, 233 సూపర్ స్పెషాలిటీ పడకలు,52 ఐసియు పడకలు, 13 డయాలసిస్ పడకలు ఉన్నాయి. ఇందులో 24 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు శిక్షన పొందటానికి కూడా వీలుంది.

పూర్తిగా ఆటోమేటిక్ పద్ధతిలో పనిచేసే కోబాస్ 6800 యంత్రం ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దీనివలన పిసిఆర్  కోవిడ్ -19 పరీక్షల ఫలితాలు తక్షణమే అందుబాటులోకి వస్తాయన్నారు. 24 గంటల్లో 1200 శాంపిల్స్ పరీక్షించగలిగే సామర్థ్యం ఈ యంత్రానికి ఉందని చెప్పారు. ఈ కోబాస్ 6800 కేవలం కోవిడ్ పరీక్షలకే పరిమితం కాకుందా వైరల్ హెపటైటిస్ బి, సి, హెచ్ ఐవి, ఎంటీబీ, పాపిలోమా, సైటోమెగలోవైరస్, క్లామిడియా లాంటి అనేక వ్యాధులనిర్థారణకు సైతం ఉపయోగపడుతుందని చెప్పారు. మనుషుల అవసరాన్ని బాగా తగ్గిస్తూ రిమోట్ పద్ధతిలో దీన్ని పనిచేయించవచ్చునని కూడా డాక్టర్ హర్ష వర్ధన్ వివరించారు.

వైద్య రంగంలో ప్రాంతీయ అసమానతలు తొలగించాలని 2003 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని వాజ్ పేయ్ పిలుపునివ్వటాన్ని ప్రస్తావిస్తూ, అదే ఈ నాటికీ ఒక దివిటీలా మార్గదర్శనం చేస్తోమ్దన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయీ ఆకాంక్షలకు కార్యరూపం ఇవ్వటానికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని డాక్టర్ హర్షవర్ధన్ అభివర్ణించారు. ఎయిమ్స్ వైద్య విజ్ఞాన సంస్థలు 6 నుంచి 22 కు పెంచగ్గా ఇప్పుడున్న మరో 75 సంస్థలను ఎయిమ్స్ స్థాయికి పెంచబోతున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. 

ఉత్తరప్రదేశ్ లో ప్రధానమంత్రి స్వస్థ్య సురక్షా యోజన పురోగతి ఎంతో సంతృప్తికరంగా ఉందని కూడా అన్నారు. ప్రాంతీయ అసమానతలు తొలగించే క్రమంలోనే ఉత్తరప్రదేశ్ లోనూ, బీహార్ లోనూ రెండు ఎయిమ్స్ సంస్థలు నెలకొల్పామన్నారు. ఉత్తరప్రదేశ్ లోని రెండు ఎయిమ్స్ సంస్థలూ పూర్తికాబోతున్నాయని చెబుతూ, రాయ్ బరేలీలో ఇప్పటికే ఔట్ పేషెంట్ విభాగం, ఎంబీబీఎస్ విద్యార్థులకు శిక్షణ ప్రారంభించాయన్నారు.

లక్నో, వారణాసి, అలీగఢ్, గోరఖ్ పూర్, ఝాన్సీ, మీరట్ లో వైద్య కళాశాలల నిర్మాణం ఈ పథకంలోని వేరు వేరు దశల్లో పూర్తయిందన్నారు.  ఆగ్రా, కాన్పూర్, వారణాసి వైద్య కళాశాలలు దాదాపుగా పూర్తి కావస్తున్నాయన్నారు. రాష్ట్రంలో నిర్మించిన  మొత్తం వైద్య కళాశాలల సంఖ్య 27 కు చేరుతుందన్నారు. కొత్త వైద్య కళాశాలలు బిజ్నూర్, గోందా, లలిత్ పూర్, చండౌలి, బులుంద్ షహర్, పిలిభిత్, కౌశాంబి, అమేథి, కాన్పూర్ దేహత్, సుల్తాన్ పూర్, లఖీంపూర్, ఔరయా, సోనెభద్ర జిల్లాల్లో ఏర్పాటవుతాయన్నారు.

ప్రధానమంత్రి స్వస్థ్య సురక్షా యోజన కింద ఉత్తరప్రదేశ్ లో ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం పట్ల కేంద్రప్రభుత్వానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. సకాలంలో ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ను కోవిడ్ చికిత్సకోసం ఉపయోగించుకోగలిగేలా రూపొందించటం గురించి మాట్లాడుతూ, చుట్టుప్రక్కల ఉన్న కౌశాంబి, చిత్రకూట్, బందా, ప్రతాప్ గఢ్, మీర్జాపూర్ జిల్లాల ప్రజలు కూదా దీనివలన ఎంతగానో లబ్ధి పొందగలుగుతారన్నారు. కోవిడ్ మహమ్మారి మొదలైనప్పుడు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్క వెంటిలేటర్ కూదా లేదని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలు బాగా పుంజుకొని ఇప్పుడు లక్షా 75 వేల పడకల అందుబాటు, రోజువారీ పరీక్షల సామర్థ్యం 1.5 నుంచి 2.0 లక్షలదాకా చేరుకోవటం సాధ్యమైందన్నారు. మొత్తంగా ప్రతి జిల్లాలోనూ కోవిడ్ కిఉ చికిత్స అందించగలిగే ఉన్నతా స్థాయి ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయన్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాలు, వైద్య విద్యాశాఖ మంత్రి శ్రీ సురేశ్ కుమార్ ఖన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మాతాశిశు సంక్షేమ శాఖామంత్రి శ్రీ జై ప్రతాప్ సింగ్, ప్రయాగ్ రాజ్ లోక్ సభ సభ్యురాలు శ్రీమతి రీటా బహుగుణ జోషి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

 

****(Release ID: 1661770) Visitor Counter : 37