విద్యుత్తు మంత్రిత్వ శాఖ
రెండో త్రైమాసికంలో ఎన్‌టీపీసీ గ్రూపు ఉత్పత్తిలో 13.3% రెండంకెల వృద్ధి నమోదు
- ఎన్‌టీపీసీ బొగ్గు స్టేషన్లు ఈ ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య 94.21% అధిక లభ్యతను నిర్వహించాయి. గత ఏడాది ఇదే కాలంలో లభ్యత నిర్వహణ 90.26 శాతమే
Posted On:
01 OCT 2020 1:48PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్‌టీపీసీ గ్రూప్ కంపెనీలు ఈ ఏడాది జూలై -సెప్టెంబర్ 2020 (2 వ త్రైమాసికం) మధ్య కాలంలో మేటి పనితీరును కనబరిచాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీల ఉత్పత్తిలో 13.3% రెండంకెల వృద్ధి నమోదు అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో (అంటే ఏప్రిల్ నుండి సెప్టెంబర్) ఈ గ్రూప్ మొత్తం ఉత్పత్తి 145.87 బి.యు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు 0.4 శాతం మేర ఎక్కువ. ఎన్‌టీపీసీ లిమిటెడ్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ఎన్‌టీపీసీ అధిక స్థాయి కార్యాచరణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తమ బొగ్గు స్టేషన్లు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 20 వరకు 94.21% అధిక లభ్యత నిర్వహణను కలిగి ఉన్నాయని.. గత ఏడాది ఇదే కాలంలో ఇది 90.26 శాతంగా నిలిచిందని తెలిపింది. మొత్తం 62.9 జీ.డబ్ల్యూ. సామర్థ్యంతో, ఎన్‌టీపీసీ గ్రూప్‌లో 70 పవర్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 24 బొగ్గు, 7 కంబైన్డ్ సైకిల్ గ్యాస్ / లిక్విడ్ ఫ్యూయల్, 1 హైడ్రో, 13 రెన్యూవబుల్స్ తో పాటు 25 అనుబంధ & జాయింట్ వెంచర్ పవర్ స్టేషన్లు ఉన్నాయి.
*****
(Release ID: 1660694)
Visitor Counter : 80