ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం
మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నది 15.11 శాతమే
చికిత్స పొందుతున్న బాధితులలో 76% మంది 10 రాష్ట్రాలనుంచే
Posted On:
30 SEP 2020 12:17PM by PIB Hyderabad
మొత్తం కోవిడ్ పాజిటివ్ కెసులలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం దేశంలోని పాజిటివ్ కేసులలో 15.11శాతం మంది మాత్రమే ఇప్పటికీ చికిత్సలో ఉన్నారు. వీరి సంఖ్య 9,40.441 గా నమోదైంది. ఆగస్టుఇ 1న చికిత్సలో ఉన్నవారి సాతం 33.32% ఉందగా సెప్టెంబర్ 30 నాటికి అది 15.11శాతానికి తగ్గింది. అంటే రెండు నెలల కాలంలోనే బాధితుల సంఖ్య సగం కంటే ఎక్కువగా తగ్గిపోయింది.

కోలుకుంటున్న వారి శాతం క్రమేపీ పెరుగుతూ ఉండటం వలన పాజిటివ్ కెసులలో కోలుకున్న వారి శాతం ఈరోజుకు 83.33% అయింది. గడిచిన 24 గంటల్లో 86.428 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోవిడ్ నుంచి బైటపడినవారి సంఖ్య 52, 87, 825గా నమోదైంది. కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య అంతరం కూడా బాగా పెరిగింది. అది ఈ రోజుకు 42 లక్షలు ( 42,47,384) దాటింది. కోలుకుంటున్నవారు పెద్ద సంఖ్యలో పెరుగుతూ ఉండటంతో ఈ అంతరం కూడా బాగా పెరుగుతూ వస్తోంది.


దేశంలో చికిత్సలో ఉన్నవారి భారం తగ్గుతూ వస్తుండటం వల్ల సెప్టెంబర్ 22 నుంచి బాధితుల సంఖ్య పది లక్షల లోపే ఉంటోంది.

ఇంకా చికిత్సలో ఉన్న వారిలో 76% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే కావటం గమనార్హం. వాటిలో మహారాష్ట్ర, కర్నాటక, ఆ<ధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, అస్సాం, చత్తీస్ గఢ్, తెలంగాణ ఉన్నాయి. గరిష్ఠంగా 2,60,000 కేసులతో మహారాష్ట్ర అని రాష్ట్రాలకంటే ముందుంది.

పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే మూడంచెల వ్యూహానికి అనుగుణంగా నడుచుకోవటం వల్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కోలుకుంటున్న వారి శాతం చాలా ఎక్కువగా నమోదవుతూ వస్తోంది. చికిత్సలో ఉన్నవారి సంఖ్య 14 రాష్ట్రాలలో 5,000 కంటే తక్కువగా ఉండటం గమనార్హం.

మొత్తం కోలుకున్నవారిలో 78% మంది 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 10 లక్షలమందికి పైగా కోలుకున్నారు. ఆ తరువాత స్థానంలో 6 లక్షలమందికి పైగా కోలుకున్న ఆంధ్రప్రదేశ్ ఉంది.

గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 80,472 నమోదయ్యాయి. కొత్త కేసులలో 76% కేవలం 10 రాష్ట్రాలకు చెందినవే కావటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 15,000 కు పైగా కేసులు నమోదయ్యాయి. 10,000 కు పైగా కేసులతో కర్నాటక రెండో స్థానంలో ఉంది.
గత 24 గంటల్లో 1,179 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 85% మరణాలు 10 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. అవి మహారాష్ట, కర్నాటక, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. కొత్తగా నమోదైన మరణాలలో 36% పైగా (430 మంది) మహారాష్ట్ర నుంచే కావటం కూడా గమనార్హం

****
(Release ID: 1660273)
Visitor Counter : 254
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam