కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

పని ప్రదేశాల్లో కోవిడ్ నుంచి రక్షణకోసం మార్గదర్శక సూత్రాలు జారీ చేసిన ఇ.ఎస్.ఐ.సి.

Posted On: 29 SEP 2020 6:14PM by PIB Hyderabad

కోవిడ్-19 వైరస్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా, పని ప్రదేశాల్లో రక్షణ కోసం పాటించవలసిన మార్గదర్శక సూత్రాలను 2020, సెప్టెంబరు 29 ఢిల్లీలో వెలువరించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక, భూగోళ శాస్త్రాల శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ సహాయ (స్వంతంత్ర హోదా) మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ ఉమ్మడిగా మార్గదర్శక సూత్రాలను విడుదల చేశారు. మార్గదర్శక సూత్రాల రూపకల్పనలో కీలకపాత్ర వహించిన నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్, గౌరవ అతిధిగా  హాజరయ్యారు.

  కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ కార్యదర్శి హీరాలాల్ సమారియా, కార్మిక రాజ్య బీమా సంస్థ (.ఎస్..సి.) డైరెక్టర్ జనరల్ అనూరాధా ప్రసాద్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి ఆరతి ఆహుజా, ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ (డాక్టర్) సునీల్ కుమార్, .ఎస్.. కార్పొరేషన్ సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పరిశ్రమల, ఇతర సంస్థల సిబ్బంది సంఘాల కార్యనిర్వాహక సభ్యులు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఆన్ లైన్ ద్వారా  కార్యక్రమంలో పాల్గొన్నారు.

   కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సందర్భంగా మాట్లాడుతూ, మార్గదర్శక సూత్రాల ప్రాముఖ్యాన్ని వివరించారు. కోవిడ్-19 వైరస్ మహమ్మారిపై పోరులో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. పని ప్రదేశాల్లో భౌతిక దూరాన్ని, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే మార్గదర్శక సూత్రాలను పాటించవలసిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. కోవిడ్-19పై పోరులో భాగంగా .ఎస్..సి. తీసుకున్న చర్యలను అభినందించారు. దేశ వ్యాప్తంగా ఉన్న .ఎస్..సి. ఆసుపత్రుల్లో  కోవిడ్-19 బాధితులైన సామాన్య ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించడం ప్రశంసనీయమన్నారు. మార్గదర్శక సూత్రాలకు కట్టుబడి ఉండాలని ఆయన పరిశ్రమలకు, ఇతర సంస్థలకు విజ్ఞప్తి చేశారు. పనిలో ఉండే సిబ్బంది కోసం తగిన రక్షణ ఏర్పాట్లు చేస్తూ, వాణిజ్యం కొనసాగిస్తూ, అందుకు అనుగుణంగా మార్గదర్శక సూత్రాలకు అవసరమైన సవరణలు, మార్పులు చేసుకోవాలని సూచించారు.

    మరో కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ మాట్లాడుతూ,.కార్మిక సంస్కరణలపై ఇటీవల 3 బిల్లులు ఆమోదం పొందడం హర్షణీయమని, దీనితో మరింత మంది కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుతాయని అన్నారు. సులభంగా వాణిజ్య నిర్వహణకు బిల్లులు దోహదపడతాయన్నారు. బీమా సదుపాయం ఉన్న అల్పాదాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు .ఎస్..సి. తన ఆవిర్భావ కాలంనుంచి కృషి చేస్తోందన్నారు. ఇటీవలి బిల్లుల ఆమోదంతో దాదాపు 12కోట్ల మంది లబ్ధిదారులు .ఎస్..సి. సామాజిక భద్రతా ప్రయోజనాల పరిధిలోకి వస్తారన్నారు. .ఎస్..సి. పథకం దేశవ్యాప్తంగా విస్తృతంగా అమలులోకి వస్తుందన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో బీమా సదుపాయం కలిగిన కార్మికులకు, ఆర్థిక సహాయంసామాన్య ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పించేందుకు .ఎస్..సి. అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. అటల్ బిమిత్ కల్యాణ్ యోజన కింద నిరుద్యోగులకు ఇచ్చే సహాయాన్ని రెట్టింపు చేశారని, సగటు వేతనంలో 25శాతంనుంచి 50శాతానికి సహాయాన్ని పెంచారని చెప్పారు. 2020 మార్చి 24నుంచి 2020 డిసెంబరు 31 వరకూ,.. మధ్యకాలంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి పథకం వర్తింపజేసేందుకు అర్హతా నిబంధనలను సడలించినట్టు తెలిపారు. యాజమాన్యాలు 2020 మార్చి, ఏప్రిల్ తో పాటు మేనెల 15 వరకూ ఎలాంటి పెనాల్టీ లేకుండా తమ వాటా సొమ్మును .ఎస్..సి.కి జమ చేసేందుకు ఇదివరకే వెసులుబాటు కల్పించినట్టు మంత్రి చెప్పారు.  

   దీనికి తోడు కోవిడ్-19 చికిత్సకోసం .ఎస్..సి. ఎంతో చురుకుగా సేవలందిస్తోందని మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 .ఎస్..సి. ఆసుపత్రులు దాదాపు 3,597 పడకల సదుపాయంతో కోవిడ్-19 ఆసుపత్రులుగా సేవలందిస్తూ వస్తున్నాయని, ఆయా ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు కూడా కోవిడ్ వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు అంతేకాక,..  ఆసుపత్రుల్లో 555 .సి.యు./హెచ్.డి.యు. పడకలు, 213 కృత్రిమ శ్వాస పరికరాలు (వెంటిలేటర్లు) అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. బిహ్తా ప్రాంతంలోని .ఎస్..సి. ఆసుపత్రిని 500 పడకలు, 125 .సి.యు. పడకలతో కోవిడ్ ఆసుపత్రిగా తీర్చిదిద్దినట్టు ఆయన చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న .ఎస్..సివైద్య కళాశాల, ఆసుపత్రి, తెలంగాణ రాష్ట్రం సనత్ నగర్ లోఉన్న ఆసుపత్రి, గుల్బర్గా (కర్ణాటక), కె.కె. నగర్ (చెన్నై), రాజాజీ నగర్ (బెంగళూరు), ఢిల్లీలోని బసాదారా పూర్ లో ఉన్న .ఎస్..సి., పి.జి..ఎం.ఎస్.ఆర్. ఆసుపత్రులలో భారతీయ వైద్య పరిశోధనా మండలి (.సి.ఎం.ఆర్.) ఆమోదించిన కోవిడ్-19 ల్యాబ్ పరీక్షల సేవలు మొదలయ్యాయి. హర్యానాలోని ఫరీదాబాద్ లో, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని .ఎస్..సి. వైద్య కళాశాలల్లో ప్లాస్మా థెరపీ చికిత్స సాగుతోందని చెప్పారు

  నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ మాట్లాడుతూ, కోవిడ్-19 కార్మికులకు వ్యాపించకుండా పని ప్రదేశాలకోసం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మహమ్మారి వైరస్ కారణంగా దేశ ఉత్పత్తి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూడటంలో మార్గదర్శక సూత్రాలు ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. పారిశ్రమల్లో పనిచేసే కార్మికులు సురక్షితంగా, నిర్భయంగా పని చేయాలన్నారు.

 

   కోవిడ్-19ను నేపథ్యంలో పరిశ్రమల్లో, సంస్థల్లో పాటించాల్సిన మార్గదర్శక సూత్రాలు;

  ఉద్యోగులు, కార్మికులకోసం తమ ఆవరణలోని పని ప్రదేశంలో కోవిడ్-19 ముప్పు స్థాయిలో ఉందో పసిగట్టే సమగ్ర ప్రణాళికలో భాగంగా  మార్గదర్శక సూత్రాలను తయారు చేశారు. కోవిడ్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకునే లక్ష్యంతో మార్గదర్శక సూత్రాలను ఒక చిన్న పుస్తకం రూపంలో పొందుపరిచారు. పని ప్రదేశాన్ని సురక్షితంగా తీర్చిదిద్దేలా ఎప్పటికప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలతో, అంటే... శ్వాస-పరిశుభ్రత, చేతుల పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం, పని ప్రదేశాన్ని తరచూ శుభ్రపరుచుకోవడం వంటి చర్యలతో ప్రణాళిక ప్రాతిపదికగా పుస్తకాన్ని రూపొందించారు. అలాగే, పని ప్రదేశంలో కోవిడ్-19 వ్యాప్తి కట్టడికి దోహదపడే పరిపాలనా పరమైన, మానవ సంబధాల పరమైన చర్యల వ్యవస్థను గురించి వివరించారు. కోవిడ్ వైరస్ సోకడానికి ఆస్కారం ఉన్న పనుల వివరణ, వాటి వర్గీకరణ, అంచనా ప్రక్రియ, నియంత్రణా చర్యలపై పథనిర్దేశం చేసే ప్రణాళికను పుస్తకం సూచిస్తుంది. పని ప్రదేశంలో ఎవరైనా అస్వస్థతకు గురైతే వారి విషయంలో తీసుకోవలసిన చర్యలు, వారి ఐసొలేషన్ ఏర్పాట్లు తదితర అంశాలను వివరంగా తెలిపారు. భద్రతాపరమైన మార్గదర్శక సూత్రాల్లో భాగంగా చేయవలసిన విధులు, చేయకూడని పనులను కూడా జాబితా రూపంలో పుస్తకంలో పొందుపరిచారు.

   కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు, వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా అనుసరించాలని కేంద్రమంత్రి గాంగ్వార్ వ్యాపార వర్గాలకు, కార్మిక లోకానికి విజ్ఞప్తి చేశారు.

 

 

భారతదేశంలో .ఎస్.. పథకం;

  అల్పాదాయ వర్గానికి చెందిన ఉద్యోగులు గాయపడినా, అనారోగ్యానికి గురైనా, మరణించినా వారికి, వారి కుటుంబాలకు సమగ్రమైన సామాజిక భద్రత ప్రయోజనాలను అందించే అగ్రశ్రేణి సంస్థగా ఉద్యోగ రాజ్య బీమా సంస్థ (.ఎస్..సి.) పనిచేస్తోంది. సరసమైన ధరలో ఆరోగ్య రక్షణ, నగదు ప్రయోజనం కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోంది. 13.56కోట్ల లబ్ధిదారులకు హేతుబద్ధమైన ధరల్లో ఆరోగ్యరక్షణ, నగదు ప్రయోజనం కల్పిస్తూ వస్తోంది. 3.49కోట్ల కార్మిక కుటుంబ యూనిట్లకు పథకాన్ని వర్తింపజేస్తున్నారు సంస్థ తరఫున ప్రస్తుతం 1,520 ఆసుపత్రులు (సంచార డిస్పెన్సరీలు/307 .ఎస్.ఎం. యూనిట్లు, 159 .ఎస్.. ఆసుపత్రులు, 793 బ్రాంచి/ పే ఆఫీసులు, 64 ప్రాంతీయ, ఉప ప్రాంతీయ కార్యాలయాలతో సహా) పనిచేస్తున్నాయి. దేశంలో 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఉన్న 566 జిల్లాల్లో .ఎస్.. పథకం అమలవుతోంది

 

****



(Release ID: 1660214) Visitor Counter : 179