భారత పోటీ ప్రోత్సాహక సంఘం

జి హెచ్ సి ఎల్ జౌళి వ్యాపారం నుంచి టెక్స్ టైల్స్ లిమిటెడ్ వేర్పాటుకు సిసిఐ ఆమోదం

Posted On: 29 SEP 2020 7:55PM by PIB Hyderabad

జి హెచ్ సి ఎల్  లిమిటెడ్ జౌళి వ్యాపారం నుంచి జి హెచ్ సి ఎల్ టెక్స్ టైల్స్ లిమిటెడ్ ను పూర్తిస్థాయి సొంత యాజమాన్యంలో ఉండే అనుబంధ సంస్థగా వేర్పాటు చేయటానికి కాంపిటిషన్ చట్టం, 2002 లోని సెక్షన్ 31(1) కింద కాంపిటిషన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( సిసిఐ) ఆమోదం తెలియజేసింది.

జిహెచ్ సి ఎల్ భారతదేశంలో ఏర్పాటైన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇది  సోడా యాష్, సోడియం బైకార్బనేట్, పారిశ్రామిక ఉప్పు, వినియోగదారు ఉత్పత్తులు సహా అనేక నిరింద్రియ రసాయనాల తయారీలోనూ, అమ్మకంలోనూనిమగ్నమైన సంస్థ. అదే విధంగా నూలు సహా అనేక జౌళి ఉత్పత్తుల తయారీలోనూ, నేతలోనూ, ప్రాసెసింగ్ లోనూ, కటింగ్ లోనూ, కుట్టటంలోను, ఇళ్ళలో వాడే దుస్తుల తయారీ, అమ్మకంలోనూ నిమగ్నమైన సంస్థ.

జి హెచ్ సి ఎల్ టెక్స్ టైల్స్ అనేది భారతదేశంలో ఏర్పాటైన ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ప్రస్తుతం జి హెచ్ సి ఎల్ టెక్స్ టైల్స్ అనేది జి హెచ్ సి ఎల్ యాజమాన్యంలో ఉన్న ఒక పూర్తి అనుబంధ సంస్థ. ఇది కొత్తగా ఏర్పాటైన కంపెనీ. ఇంకా ఎలాంటి వ్యాపార కార్యకలాపమూ ప్రారంభించలేదు.

ఈ వేర్పాటు ప్రతిపాదనతో జి హెచ్ సి ఎల్ తన రసాయనాలు, వినియోగదారు ఉత్పత్తుల వ్యాపారాన్ని తనతోనే ఉంచుకుంటుంది. జి ఎ సి ఎల్ టెక్స్ టైల్స్ లో ఇప్పుడు వేరుపడిన టెక్స్ టైల్ వ్యాపారం ఉంటుంది.

సవివరమైన సిసిఐ ఆదేశాలు వెనువెంటనే వెలువడతాయి.

***



(Release ID: 1660201) Visitor Counter : 74